E-Paper
Advertisement

TG Transco Circular: ట్రాన్స్‌కో ఉద్యోగులకు సంస్థ సీరియస్ వార్నింగ్.. కొత్త నిబంధనలు జారీ

TG Transco Circular: ట్రాన్స్‌కో ఉద్యోగులకు సంస్థ సీరియస్ వార్నింగ్.. కొత్త నిబంధనలు జారీ
Advertisement

TG Transco Circular: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణ స్టేట్ ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్(టీజీ ట్రాన్స్ కో) తన ఉద్యోగులు, ఆర్టీజన్ల ప్రవర్తనపై కఠినమైన ఆదేశాలను జారీచేసింది. విద్యుత్ సౌధలోని కార్పొరేట్ కార్యాలయంలో పనిచేస్తున్న కొందరు ఉద్యోగులు విధి నిర్వహణలో అశ్రద్ధ వహిస్తున్నట్లు యాజమాన్యం గుర్తించింది. ఈమేరకు ఒక సర్క్యులర్ ను జారీ చేసింది. ఉద్యోగులందరూ కార్యాలయ వేళల్లో తమ విధులను అత్యంత సమర్థవంతంగా, ఉత్పాదకతతో నిర్వహించాలని స్పష్టంచేశారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 3 గంటల మధ్య వ్యవధిలో భోజన విరామం తీసుకోవాలని, అది కూడా కేవలం 30 నిమిషాలకు మించకూడదని పేర్కొన్నారు.

Also Read: Romantic movie OTT: ఇద్దరబ్బాయిలతో అమ్మాయి వ్యవహారం… మతిపోగొట్టే రోడ్ ట్రిప్… ఇది పెద్దలకు మాత్రమే

క్రమశిక్షణ చర్యలు

Advertisement

కార్యాలయ ప్రాంగణంలో పని లేకుండా తిరగడం, అనవసరంగా గుంపులుగా మాట్లాడటం లేదా అనధికారిక సమావేశాలు నిర్వహించకూడదని ఆదేశించారు. మొబైల్ ఫోన్లను కేవలం అత్యవసర లేదా ముఖ్యమైన కాల్స్ కోసం మాత్రమే వాడాలని, ఫోన్లలో మాట్లాడేటప్పుడు గట్టిగా అరవడం, ఇతరులకు ఇబ్బంది కలిగించడం నిషేధమని నొక్కిచెప్పారు. డ్యూటీ సమయంలో సమయాన్ని వృథా చేయకుండా, తమకు కేటాయించిన సీట్లలోనే అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఈ నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠినమైన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని సీఎండీ కృష్ణ భాస్కర్ హెచ్చరించారు. సిబ్బంది ఈ రూల్స్ పాటించేలా చూడాల్సిన బాధ్యత కంట్రోలింగ్ ఆఫీసర్లదేనని, ఇందులో విఫలమైతే అధికారులపై కూడా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.

Also Read: Poonam Kaur: పవన్ కళ్యాణ్‌పై మరో బాంబ్ పేల్చిన పూనమ్ కౌర్.. ఈసారి టార్గెట్ పిల్లలు!

Related News

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

JNTUH Inspections: మేడ్చల్‌లో హైటెన్షన్.. మల్లారెడ్డి, సీఎంఆర్ కాలేజీల్లో జేఎన్‌టీయూహెచ్ దాడులు!

El Niño Telangana: బిగ్ అలర్ట్.. తెలంగాణలో ఎన్నడూ లేని కరువు గండం..!

Transfers: అటవీ శాఖ ఉద్యోగులకు బిగ్ షాక్.. ఇటీవల జరిగిన బదిలీలు రద్దు!

Telangana PCC: ఢిల్లీని షేక్ చేస్తున్న తెలంగాణ.. టీపీసీసీకి రాహుల్ గాంధీ సీక్రెట్ టాస్క్..?

Big Stories

Advertisement
×