E-Paper
Advertisement

ఎలక్ట్రిక్ To హైబ్రిడ్.. భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న సూపర్ 7-సీటర్ SUVలు ఇవే!

ఎలక్ట్రిక్ To హైబ్రిడ్.. భారత మార్కెట్లోకి  ఎంట్రీ ఇవ్వబోతున్న సూపర్ 7-సీటర్ SUVలు ఇవే!
Advertisement

7 Seater SUVs Launching in India by 2027: భారత ఆటోమొబైల్ మార్కెట్లో 7-సీటర్ కార్లకు డిమాండ్ బాగా పెరుగుతోంది. కుటుంబ అవసరాలకు అనుగుణంగా ఎక్కువ సీటింగ్ సామర్థ్యం ఉన్న SUVలు, MPVలను కొనుగోలుదారులు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో 2026-27 మధ్య కాలంలో పలు కంపెనీలు కొత్త 7-సీటర్ మోడళ్లను తీసుకురావడానికి సిద్ధమవుతున్నాయి. వాటిలో టాప్ మోడల్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

1.మారుతి ఎలక్ట్రిక్ 7-సీటర్ SUV

మారుతి సుజుకి ఎలక్ట్రిక్ 7-సీటర్ SUVపై పని చేస్తోంది. ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్న ఈ మోడల్ 2026 చివర్లో లేదంటే 2027 ప్రారంభంలో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఇ-విటారాలో ఉపయోగిస్తున్న ప్లాట్‌ ఫారమ్ ఆధారంగా ఈ వాహనం రూపొందుతున్నట్లు సమాచారం. పెద్ద బ్యాటరీ ప్యాక్, అత్యాధునిక టెక్నాలజీ, ఎక్కువ స్థలం ఈ SUV ప్రత్యేకతలుగా ఉండవచ్చు.

2.టయోటా 7-సీటర్

Advertisement

టయోటా కూడా ఇదే ప్లాట్‌ ఫారమ్‌ పై తన సొంత 7 సీటర్ వెర్షన్‌ ను తీసుకురానుంది. మారుతి మోడల్‌ తో పోలిస్తే అదనపు ఫీచర్లు, ప్రీమియం ఇంటీరియర్‌ ను అందించే అవకాశం ఉంది. ధర కూడా కొంత ఎక్కువగా ఉండొచ్చు.

3.రెనాల్ట్ బోరియల్

రెనాల్ట్ నుంచి బోరియల్ అనే కొత్త 7-సీటర్ SUV రానుంది. దీనిని డస్టర్ ఆధారంగా అభివృద్ధి చేసిన మోడల్. ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లో పరిచయమైన ఈ SUV, భారతదేశంలో 2027లో విడుదలయ్యే అవకాశముంది. మహీంద్రా XUV700, టాటా సఫారీ లాంటి మోడళ్లకు పోటీగా నిలవనుంది.

4.నిస్సాన్ కొత్త SUV

Advertisement

నిస్సాన్ కూడా తన టెక్టన్ SUV ఆధారంగా మూడు వరుసల సీట్లతో కూడిన కొత్త SUVను సిద్ధం చేస్తోంది. ఈ మోడల్ 2027 చివర్లో విడుదల కావచ్చని అంచనా. ప్రస్తుతం దీనికి సంబంధించిన వివరాలు బయటకు రాలేదు.

5.టాటా 7-సీటర్

టాటా మోటార్స్ కూడా కొత్త 7-సీటర్ SUV లేదా MPVపై పని చేస్తున్నట్లు సమాచారం. ఇది సియెర్రా ప్లాట్‌ ఫారమ్ ఆధారంగా ఉండే అవకాశం ఉంది. పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్లతో పాటు అత్యాధునిక భద్రతా ఫీచర్లను అందించవచ్చని భావిస్తున్నారు.

6.టాటా సఫారీ ఎలక్ట్రి

అలాగే టాటా సఫారీ ఎలక్ట్రిక్ వెర్షన్ కూడా రానుంది. ప్రస్తుతం ఉన్న సఫారీ డిజైన్‌ను కొనసాగిస్తూ, ఎలక్ట్రిక్ పవర్‌ ట్రెయిన్‌ తో ఈ మోడల్ మార్కెట్లోకి అడుగుపెట్టనుంది. హారియర్ EVలో ఉపయోగించే సాంకేతికత ఇందులో కూడా ఉండే అవకాశం ఉంది.

7.కియా సోరెంటో

కియా సంస్థ సోరెంటో SUVను భారత మార్కెట్లో ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లలో ఇప్పటికే మంచి ఆదరణ పొందిన ఈ SUV, ప్రీమియం 7-సీటర్ విభాగంలో ఫార్చ్యూనర్‌ కు ప్రత్యర్థిగా నిలవొచ్చు. హైబ్రిడ్ టెక్నాలజీతో అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది.

8.MG కొత్త 7-సీటర్

ఇక MG మోటార్ కూడా స్టార్‌ లైట్ 560 ఆధారంగా కొత్త 7-సీటర్ SUVను తీసుకురానుంది. ఈ మోడల్ EV, ప్లగ్ ఇన్ హైబ్రిడ్ రూపాల్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. పెద్ద టచ్‌ స్క్రీన్, ADAS, పనోరమిక్ సన్‌ రూఫ్ లాంటి ఆధునిక ఫీచర్లతో అందుబాటులోకి రానుంది.

Read Also: హోండా To BMW.. జూన్‌ లో మార్కెట్ లోకి అడుగు పెట్టబోతున్న 7 కొత్త కార్లు ఇవే!

Related News

కొత్త స్టైల్.. సరికొత్త కలర్స్.. రివోల్ట్ RVX వచ్చేసింది!

రూ.10.99 లక్షలకే క్రెటా ఎలక్ట్రిక్.. హ్యుందాయ్ షాకింగ్ ఆఫర్!

టాటా సియెర్రా ఈవీ vs MG విండ్సర్ ఈవీ.. రెండింటిలో ఏ SUV బెస్ట్ అంటే..?

180 కి.మీ రేంజ్.. రిమూవబుల్ బ్యాటరీ.. కీవే క్రేజీ స్కూటర్ వచ్చేసింది!

పల్సర్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. N125 ఉత్పత్తి నిలిపివేత!

కొత్త కలర్స్‌ తో క్రేజీగా ఏథర్ 450X.. ఛార్జింగ్ కూడా ఇక సూపర్ ఫాస్ట్!

నానో 2.0 రిలీజ్‌ కు కౌంట్‌డౌన్.. టీజర్‌ తోనే దుమ్మురేపిన టాటా!

సీటు మార్చిన ఎయిర్ ఇండియాకు భారీ షాక్.. ఏకంగా రూ.60 వేల జరిమానా!

Big Stories

Advertisement
×