E-Paper
Advertisement

Vivo X200T Launch: భారీ బ్యాటరీ, అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో వివో కొత్త మొబైల్.. లాంచ్ డేట్, స్పెసిఫికేషన్స్, ధర వివరాలివే!

Vivo X200T Launch: భారీ బ్యాటరీ, అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో వివో కొత్త మొబైల్.. లాంచ్ డేట్, స్పెసిఫికేషన్స్, ధర వివరాలివే!
Advertisement

Vivo X200T Launch: వివో బ్రాండ్ ఫోన్లకు మార్కెట్‌లో ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని.. తన ప్రీమియం X సిరీస్‌లో భాగంగా కంపెనీ ‘Vivo X200T’ని భారత మార్కెట్లోకి విడుదల చేసేందుకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే X200, X200 ప్రో మోడల్స్‌తో మార్కెట్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన వివో.. ఇప్పుడు ఈ T వేరియంట్‌తో యూజర్లకు మరింత మెరుగైన అనుభూతిని అందించాలని భావిస్తోంది. ఈ మేరకు జనవరి 27న మధ్యాహ్నం 12 గంటలకు ఈ ఫోన్‌ను లాంచ్ చేయనున్నట్లు సంస్థ అధికారికంగా ప్రకటించింది. కేవలం వినోదం మాత్రమే కాకుండా.. ప్రొఫెషనల్ ఫొటోగ్రఫీని ఇష్టపడే వారిని ఆకట్టుకునేలా ఈ ఫోన్‌ను డిజైన్ చేసినట్లు తెలుస్తోంది.

ఈ Vivo X200T ఫోన్‌లో మీడియాటెక్ డెమెన్సిటీ 9400+ చిప్‌సెట్‌ను వాడారు. ఇది గేమింగ్, మల్టీటాస్కింగ్‌ సులభతరం చేస్తుంది. అంతేకాదు ఇది Android 16 ఆధారిత OriginOS 6తో వస్తున్న తొలి ఫోన్లలో ఒకటి కావడం విశేషం. ఇక డిస్‌ప్లే పరంగా చూస్తే ఈ ఫోన్ 6.67 అంగుళాల AMOLED స్క్రీన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుందని అంచనా.

Advertisement

Also Read: మాట్లాడక్కర్లేదు.. సైగ చేయక్కర్లేదు.. మీ రాకను గుర్తించి చక చకా పనులు చేసే అమెజాన్ కొత్త డివైజ్!

సాధారణంగా వివో ఫోన్ అంటేనే కెమెరాకు పెట్టింది పేరు. ఈసారి కూడా ZEISS తో కలిసి మూడు 50 మెగాపిక్సెల్ కెమెరాలను వెనుక వైపు అమర్చారు. దీనిలో ప్రధాన కెమెరాతో పాటు, పెరిస్కోప్ టెలిఫొటో లెన్స్ ఉండటం వల్ల దూరంగా ఉన్న వస్తువులను కూడా చాలా స్పష్టంగా క్లిక్ చేయవచ్చు. ఇక సెల్ఫీల కోసం అయితే 32MP కెమెరాను అమర్చినట్లు తెలుస్తోంది.

Advertisement

ఇకపోతే.. Vivo X200T ఫోన్ బ్యాటరీ బ్యాకప్ గురించి అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. దీనిలో 6,200mAh భారీ బ్యాటరీని అమర్చారు. దీనికి తోడు 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటంతో నిమిషాల్లోనే ఫోన్ ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. అంతేకాదు.. జర్నీలు, ఎక్కువగా సినిమాలు చూసేవాళ్లకి ఇక ఛార్జింగ్ టెన్షన్ కూడా ఉండదు.

Vivo X200T ఫోన్ ధర గురించి కంపెనీ ఇంకా అధికారికంగా వెల్లడించనప్పటికీ.. టెక్ వర్గాల సమాచారం ప్రకారం దీని ధర రూ.55,000 – రూ60,000 మధ్యలో ఉండే అవకాశం ఉంది. ఇది ఫ్లిప్‌కార్ట్, వివో ఆన్‌లైన్ స్టోర్ల ద్వారా విక్రయానికి రానుంది. ప్రీమియం లుక్, పవర్‌ఫుల్ బ్యాటరీ, అదిరిపోయే కెమెరా కోరుకునే వారికి ఇంత కంటే మంచి ఫోన్ దొరకదనే చెప్పాలి.

Also Read: ఛార్జింగ్‌ కష్టాలకు చెక్.. ఫోన్‌తో పాటు ల్యాప్‌టాప్‌నూ ఛార్జ్ చేసే ఉగ్రీన్ పవర్ బ్యాంక్ ఫీచర్లు ఇవే!

 

Related News

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

బడ్జెట్ ధరలో బెస్ట్ 3-డోర్ ఫ్రిజ్.. వర్ల్‌పూల్ ప్రోటాన్ రివ్యూ

రూ.1,599 కే బెస్ట్ ఇయర్‌బడ్స్..హెవీ బేస్‌తో మార్కెట్ షేక్!

మార్కెట్‌ను షేక్ చేస్తున్న 43 ఇంచుల టీవీ.. ఫీచర్స్ నెక్స్ట్ లెవెల్!

కేవలం రూ. 999 కే హెడ్‌ఫోన్స్..సౌండ్ క్వాలిటీ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

రూ.6వేలలోపు టాప్ క్లాస్.. బ్రాండెడ్ వాషర్ ..మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి పండగే

బిగ్ డిస్‌ప్లే స్మార్ట్‌వాచ్.. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్లతో దుమ్మురేపుతోంది!

ప్రీమియం వాషింగ్ ఎక్స్‌పీరియన్స్..క్షణాల్లోనే బట్టలు తెల్లగా మెరిసిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×