E-Paper
Advertisement

Hyderabad Crime: కూకట్‌పల్లి లో దారుణం..! కంప్లైంట్ ఇచ్చిన వారానికే భర్తను లేపేసిన భార్య

Hyderabad Crime: కూకట్‌పల్లి లో దారుణం..! కంప్లైంట్ ఇచ్చిన వారానికే భర్తను లేపేసిన భార్య
Advertisement

Hyderabad Crime: ఇటీవల వివాహేతర సంబంధాలు పచ్చని సంసారాల్లో చిచ్చు రేపుతున్నాయి. ఇటీవల ఓ భార్య ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తనే కడతేర్చింది. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లి పరిధిలో చోటుచేసుకుంది.కేవలం తన అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడనే కారణంతో.. నిద్రపోతున్న భర్తను చున్నీతో ఉరేసి హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న సుధీర్ రెడ్డి అతని భార్య ప్రసన్న మధ్య గత కొంత కాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ గొడవలకు గల కారణం ప్రసన్నకు మరో వ్యక్తితో ఉన్న వివాహేతర సంబంధం.ప్రసన్న తన తప్పును సరిదిద్దుకోకపోగ.. తనను ప్రశ్నిస్తున్న భర్తను వదిలించుకోవాలని ప్రసన్న పథకం వేసింది. గత నెల 24వ తేదీని రాత్రి సమయంలో సుధీర్ రెడ్డి గాఢ నిద్రలో ఉండగా.. ఆమె తన చున్నీతో అతడి మెడకు ఉరి బిగించి అత్యంత దారుణంగా హత్య చేసింది.

Advertisement

ఈ కేసులో అత్యంత విషాదకరమైన విషయం ఏమిటంటే.. తన ప్రాణాలకు ముప్పు ఉందని సుధీర్ రెడ్డికి ముందే తెలుసు. తన భార్య తనను చంపేందుకు ప్రయత్నిస్తోందని తనకు రక్షణ కావాలని హత్యకు వారం రోజుల ముందే ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ.. తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం లేదా పోలీసుల వైపు నుంచి ఎటువంటి రక్షణ లేకపోవడం వల్ల చివరకు ఆయన ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఒక వ్యక్తి తన ప్రాణహాని గురించి ఫిర్యాదు చేసిన కొద్ది రోజుల్లోనే అదే వ్యక్తి చేతిలో హతమవ్వడం స్థానికంగా చర్చనీయాంశమైంది.

ప్రారంభంలో సుధీర్ రెడ్డి మృతిపై అనుమానాలు వ్యక్తమవగా.. పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టారు. ప్రసన్నను అదుపులోకి తీసుకుని విచారించగా.. ఆమె పొంతన లేని సమాధానాలు చెప్పింది. అయితే.. సాంకేతిక ఆధారాలు, పోలీసుల గట్టి విచారణతో ప్రసన్న నేరాన్ని అంగీకరించింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నందునే సుధీర్ రెడ్డిని చున్నీతో ఉరేసి చంపినట్లు ఆమె ఒప్పుకుంది.

Advertisement

నిందితురాలు ప్రసన్నపై పోలీసులు కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచారు.న్యాయమూర్తి ఆదేశాల మేరకు ఆమెకు రిమాండ్ విధించి.. ప్రస్తుతం సంగారెడ్డి జిల్లాలోని కంది జైలుకు తరలించారు.

ALSO READ: 4 గంటలకే నిద్రలేచి.. నేరుగా శారీ షాప్‌కు, పట్టు చీరల కోసం కిలోమీటర్ల కొద్ది భారీ లైను!

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×