E-Paper
Advertisement

ఇంత తక్కువ ధరకి ఇలాంటి ఫీచర్లా.. సూపర్ లుకింగ్ డిజైన్.. బిగ్ బ్యాటరీతో Vivo Y31s 5G లాంచ్!

ఇంత తక్కువ ధరకి ఇలాంటి ఫీచర్లా.. సూపర్ లుకింగ్ డిజైన్.. బిగ్ బ్యాటరీతో Vivo Y31s 5G లాంచ్!
Advertisement

Vivo Y31s 5G: స్మార్ట్‌ఫోన్ ప్రియుల కోసం ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో సరికొత్త 5G ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. గత కొన్ని రోజులుగా పలు సర్టిఫికేషన్ వెబ్‌సైట్లలో హల్‌చల్ చేసిన ‘వివో Y31s 5G’ స్మార్ట్‌ఫోన్ ఎట్టకేలకు మలేషియా మార్కెట్లో అధికారికంగా లాంచ్ అయింది. అయితే, ఇదే పేరుతో 2021లో చైనాలో ఒక ఫోన్ విడుదలైంది. కానీ, ఇప్పుడు వచ్చిన ఈ లేటెస్ట్ 5G ఫోన్ సరికొత్త డిజైన్, అప్‌గ్రేడెడ్ ఫీచర్లతో పూర్తి భిన్నంగా ఉండటం గమనార్హం.

ఈ సరికొత్త వివో Y31s 5G స్మార్ట్‌ఫోన్ అద్భుతమైన పర్ఫార్మెన్స్ అందించేందుకు క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 (4nm) ఆక్టాకోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. యూజర్లకు స్మూత్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చేందుకు ఈ ఫోన్ లేటెస్ట్ OriginOS 6.0 కస్టమ్ స్కిన్‌తో రన్ అవుతుంది. స్టోరేజ్ విషయానికి వస్తే.. కంపెనీ దీనిని ఒకే ఒక్క వేరియంట్‌లో పరిచయం చేసింది. దీనిలో 8GB RAM, 256GB ఇంటర్నల్ స్టోరేజ్ సపోర్ట్ లభిస్తుంది.

Advertisement

Also Read: షియోమీ షాకింగ్ నిర్ణయం.. ఒకేసారి Redmi K100, Xiaomi 18 సిరీస్ లాంచ్?!

ఇక ఫోన్ డిస్‌ప్లే విషయానికి వస్తే.. దీనిలో 6.745 ఇంచుల ఫుల్ హెచ్‌డీ స్క్రీన్‌ను అందించారు. ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపించేలా 1050 నిట్స్ సన్‌లైట్ బ్రైట్‌నెస్ సపోర్ట్ దీని సొంతం. అలాగే ఫొటోగ్రఫీ ప్రేమికుల కోసం వెనుక వైపు 50MP మెయిన్ కెమెరాతో పాటు 2MP బోకె లెన్స్, ఫ్లాష్ లైట్ ఉన్నాయి. అలాగే సెల్ఫీల కోసం ఏకంగా 32MP హెచ్‌డీ గ్రూప్ సెల్ఫీ కెమెరాను అమర్చారు.

Advertisement

ఈ స్మార్ట్‌ఫోన్ ప్రధాన ఆకర్షణ దీని బ్యాటరీ లైఫ్ అని చెప్పొచ్చు. దీనిలో 6500mAh సామర్థ్యం గల భారీ బ్లూవోల్ట్ బ్యాటరీని ఇచ్చారు. దీనిని వేగంగా ఛార్జ్ చేయడానికి 44W ఫ్లాష్‌చార్జ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ఈ ఫోన్‌కు IP69+, IP68 రేటింగ్స్ ఉండటం వల్ల ధూళి, నీటి నుండి పూర్తి రక్షణ లభిస్తుంది. అంతేకాదు.. 400 శాతం వాల్యూమ్ సపోర్ట్, NFC, టైప్-సి ఆడియో, కాల్ రికార్డింగ్ ఫీచర్లు కూడా ఉన్నాయి. దీని బరువు 209 గ్రాములు ఉంటుంది.

మలేషియా మార్కెట్లో విడుదలైన ఈ వివో Y31s 5G ఫోన్ బ్లాక్, పర్పుల్ అనే రెండు ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. దీని ఏకైక 8GB RAM +256GB స్టోరేజ్ మోడల్ ధరను రూ.35,226గా నిర్ణయించారు. పవర్‌ఫుల్ బ్యాటరీ, వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్లు కోరుకునే వారికి ఇది మంచి ఆప్షన్ కానుంది.

Also Read: ఐఫోన్ లవర్స్‌కు ఊహించని షాక్.. ఈ ఏడాది iPhone 18 లాంచ్ లేనట్టేనా? యాపిల్ అసలు ప్లాన్ లీక్!

Related News

యాపిల్ నుంచి మొదటి ఫోల్డబుల్ ఫోన్ iPhone Duo.. ధర రూ.3 లక్షలా? ఫీచర్లు ఎలా ఉన్నాయంటే!

లాగ్ ప్రాబ్లం ఉండదు.. సూపర్‌ఫాస్ట్ రెస్పాన్స్ ఇచ్చే బెస్ట్ వైర్‌లెస్ కీబోర్డ్ కాంబోస్ ఇవే!

ఫోన్ మార్చాలనుకుంటున్నారా? ఫ్లిప్‌కార్ట్‌లో భారీగా ధర తగ్గిన Vivo V40e 5Gపై ఓ లుక్కేయండి!

బడ్జెట్ ధరలో సోనీ కొత్త హెడ్‌ఫోన్స్ లాంచ్.. బ్లూటూత్ 6.0, ఏఐ కాల్స్ ప్రత్యేకత!

నుదుటిపై ఈ డివైజ్‌ను పెట్టుకుంటే చాలు.. బ్రెయిన్ సీక్రెట్స్ అన్నీ బయటపడతాయట?!

ఏటీఎం కీప్యాడ్ ప్లాస్టిక్‌లో కాకుండా.. మెటల్‌‌ లోనే ఎందుకు? దీని వెనుక ఉన్న సైంటిఫిక్ రీజన్ ఏంటి?

రూ. 349 vs రూ. 379.. Airtel చౌకైన ప్లాన్ల మధ్య పోటీ.. బెనిఫిట్స్ పరంగా విజేత ఎవరంటే?

జియో బంపరాఫర్.. ఈ ప్లాన్లతో అమెజాన్ ప్రైమ్ ఉచితం.. ఇంకా మరెన్నో బెనిఫిట్స్!

Big Stories

Advertisement
×