E-Paper
Advertisement

గాజియాబాద్‌‌లో భారీ అగ్ని ప్రమాదం.. పరుగులు తీసిన జనం

గాజియాబాద్‌‌లో భారీ అగ్ని ప్రమాదం.. పరుగులు తీసిన జనం
Advertisement

Uttar Pradesh: ఉత్తర్‌ప్రదేశ్‌లోని గాజియాబాద్‌లో ప్రైవేట్ హౌసింగ్ సొసైటీలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఇందిరాపురంలోని ‘గౌర్ గ్రీన్’ (Gaur Green) అపార్ట్‌మెంట్‌లోని ఒక ఫ్లాట్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. చూస్తుండగానే ఈ మంటలు పక్కనే ఉన్న ఇతర ఫ్లాట్‌లకు కూడా వేగంగా వ్యాపించడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్మేసింది.

ప్రమాద తీవ్రతను గమనించిన నివాసితులు ప్రాణభయంతో భవనం నుండి బయటకు పరుగులు తీశారు. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది వెంటనే రంగంలోకి దిగారు. మూడు ఫైర్ ఇంజిన్‌ల సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. మంటల ధాటికి ఫ్లాట్‌లలోని విలువైన సామాగ్రి కాలి బూడిదైనట్లు తెలుస్తోంది.

Advertisement

ప్రాథమిక సమాచారం ప్రకారం, షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

Also Read: గూగుల్ క్రెడిట్ జగన్‌దే.. చంద్రబాబుకు కేకే రాజు బహిరంగ సవాల్!

Advertisement

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×