E-Paper
Advertisement

Cold Wave: తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న చలి.. భారీ స్థాయిలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. ఇంకా ఎన్ని రోజులంటే!

Cold Wave: తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న చలి.. భారీ స్థాయిలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. ఇంకా ఎన్ని రోజులంటే!
Advertisement

Cold Wave: తెలంగాణ గడ్డ మీద ఈసారి చలి మామూలుగా లేదు. ఊహించని రీతిలో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ఉదయాన్నే లేవాలంటేనే జనం భయం పడుతున్నారు. మొన్న శనివారం సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో ఏకంగా 4.5 డిగ్రీల సెల్సియస్ రికార్డయ్యిందంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పదేళ్ల కిందట కూడా ఇంతటి చలిని ఎవ్వరూ చూడలేదని ముసలోళ్లు చెప్పుకుంటున్నారు. ఇక కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్‌లో కూడా 4.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. పల్లెల్లో పొద్దున్నే మంటలు వేసుకుని కాపలా కాయడం తప్ప వేరే దారి లేకపోయింది. సిటీల్లో కూడా ఉదయం తొమ్మిది దాటినా రోడ్ల మీద ఎవ్వరూ కనిపిస్తలేరు.

అయితే రాష్ట్రంలోని ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, సంగారెడ్డి, ఆసిఫాబాద్, వికారాబాద్, కామారెడ్డి, కొమురం భీం, ములుగు, మంచిర్యాల, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో చలి తీవ్రత మునుపెన్నడూ లేనంతగా ఉంది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం కూడా రాబోయే రెండు రోజులు పరిస్థితి ఈలానే ఉంటదని గట్టిగానే హెచ్చరించింది. అన్ని జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’ జారీ చేసిందంటే, బయట తిరిగేటప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలని అర్థం. మంచు కురుస్తుండటంతో హైవేల మీద డ్రైవింగ్ చేసేటోళ్లకు దారి కనిపిస్తలేదు. పొలాల దగ్గరికి వెళ్లే రైతులు, పనులకు వెళ్లే కూలీలు గొంగళ్లు, స్వెటర్లు కప్పుకుని చలిని తట్టుకోవడానికి కుస్తీ పడుతున్నారు. చిన్న పిల్లలు, ముసలోళ్లు జర జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు కూడా చెబుతున్నారు.

Advertisement

ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే, ఏజెన్సీ ప్రాంతాలు మంచు దుప్పటి కింద ఉండిపోయినట్లు కనిపిస్తున్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చింతపల్లి, లంబసింగి వంటి ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయాయి. అక్కడ మంచు కురుస్తుంటే, సూర్యుడు కూడా ఉదయం పూట మబ్బుల వెనుక దాక్కున్నట్లు కనిపిస్తున్నాడు. పాడేరు, అరకు వ్యాలీలో పర్యటించే సందర్శకులు కూడా ఈ చలికి వణికిపోతున్నారు. తీర ప్రాంతాల్లో కూడా చల్లటి గాలులు వీస్తుండటంతో సామాన్య జనం ఇబ్బందులు పడుతున్నారు. ఏజెన్సీ గ్రామాల్లో ప్రజలు రాత్రి వేళల్లో బయటకు రావడానికి సాహసించడం లేదు.

ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే తెలంగాణలోనూ, ఏపీలోనూ చలి ప్రభావం ఇంకా పెరిగేలా ఉంది. రాత్రి ఏడు గంటలకే కర్ఫ్యూ ఉన్నట్టుగా ఊళ్లన్నీ ఖాళీ అయిపోతున్నాయి. మంచు వల్ల కంటికి ఎదురుగా ఉన్న వాహనాలు కూడా కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి, వాహనదారులు లైట్లు వేసుకుని జాగ్రత్తగా వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు.

Advertisement

Also Read: గోవిందరాజ స్వామి గోపుర పనుల్లో భారీ గోల్‌మాల్? రంగంలోకి టీటీడీ విజిలెన్స్!

ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం చేస్తే ఈ చలి ప్రాణాల మీదకు తెచ్చే ప్రమాదం ఉంది. ముఖ్యంగా శ్వాసకోశ ఇబ్బందులు ఉన్నవాళ్లు, గుండె జబ్బులు ఉన్నవాళ్లు ఈ చలిలో బయట తిరగకపోవడమే మంచిది. వేడి వేడి ఆహారం తీసుకోవడం, శరీరానికి వెచ్చదనాన్ని ఇచ్చే ఉన్ని దుస్తులు ధరించడం చాలా ముఖ్యం. రాబోయే రెండు రోజులు మరింత దారుణంగా ఉంటాయని వాతావరణ శాఖ చెబుతోంది కాబట్టి, జాగ్రత్తలే మనల్ని కాపాడతాయి. అలాగే వాతావరణ హెచ్చరికలను గమనిస్తూ, అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టకండి.

Related News

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

ఓడిపోతామనే భయం.. కుట్రలకు తెరలేపారు, వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్

ప్రయాణికుల ఇంటికి ఆర్టీసీ సేవలు.. ఏపీఎస్ఆర్టీసీ వినూత్నంగా

వెలిగొండ ప్రాజెక్టు వాగులో కొట్టుకుపోయిన బొలెరో, అందులో నలుగురు వ్యక్తులు, రంగంలోకి రెస్క్యూ టీమ్

ఎవరీ పూల సుబ్బయ్య? వెలిగొండ ప్రాజెక్టుకు ఆయన పేరు ఎందుకు పెట్టారు?

Big Stories

Advertisement
×