E-Paper

WhatsAppలో కొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్.. ఒకే రీఛార్జ్‌తో మెటా యాప్స్ అన్నింటికీ ప్రీమియం ఫీచర్స్!

WhatsAppలో కొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్.. ఒకే రీఛార్జ్‌తో మెటా యాప్స్ అన్నింటికీ ప్రీమియం ఫీచర్స్!
Advertisement

Meta One Premium Plan: త్వరలోనే వాట్సప్ యూజర్ల కోసం మెటా సంస్థ సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్‌ను పరిచయం చేయబోతోంది. ‘మెటా వన్ ప్లస్’, ‘మెటా వన్ ప్రీమియం’ పేరుతో రానున్న ఈ ప్లాన్స్ ద్వారా కేవలం వాట్సప్ మాత్రమే కాకుండా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, మెటా ఏఐ (Meta AI)లలో కూడా ప్రీమియం ఫీచర్లను వాడుకోవచ్చు. ప్రస్తుతం ఆండ్రాయిడ్ బీటా వెర్షన్‌లో ఈ సరికొత్త అప్‌డేట్ కనిపిస్తోంది.

మెటా వన్ ప్లస్ ఫీచర్లు:

ఈ ప్లాన్ ధర నెలకు రూ.700 ఉండొచ్చని అంచనా. ఇందులో వాట్సప్ ప్లస్ ఫీచర్లతో పాటు మెటాకు సంబంధించిన అదనపు ఏఐ టూల్స్ లభిస్తాయి. మెరుగైన ఇమేజ్, వీడియో జనరేషన్ టూల్స్, క్రియేటివ్ ఆప్షన్స్, పర్సనలైజేషన్ ఫీచర్లు ఈ ప్లాన్ ద్వారా యూజర్లకు అందుబాటులోకి వస్తాయి.

మెటా వన్ ప్రీమియం విశేషాలు:

Advertisement

ఇది హెవీ యూజర్స్, కంటెంట్ క్రియేటర్లను దృష్టిలో ఉంచుకొని తీసుకొస్తున్న ప్లాన్. దీని ధర నెలకు రూ.2,200 ఉండొచ్చు. దీనిలో ప్లస్ ప్లాన్ ఫీచర్లతో పాటు అడ్వాన్స్‌డ్ ఏఐ టూల్స్ లభిస్తాయి. కష్టమైన ప్రాంప్ట్‌లను అర్థం చేసుకునే ఏఐ టెక్నాలజీ, ఎక్కువ ఇమేజ్, వీడియోలను క్రియేట్ చేసుకునే లిమిట్ ఉంటాయి. దీనికోసం ఒక నెల ఉచిత ట్రయల్ కూడా ఇచ్చే అవకాశం ఉంది.

Also Read: iPhone 17 ధర భారీగా తగ్గింది.. Flipkart ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో రూ.25 వేలు సేవ్ చేసుకోండి!

వాట్సప్ ప్లస్ ప్రయోజనాలు:

Advertisement

ఈ రెండు ప్లాన్లలోనూ యూజర్లకు వాట్సప్ ప్లస్ బెనిఫిట్స్ అందుతాయి. దీనివల్ల వాట్సప్‌లో సరికొత్త యాప్ థీమ్స్, నచ్చిన రింగ్‌టోన్స్ పెట్టుకునే సదుపాయం, ఎక్కువ చాట్స్‌ను పిన్ చేసుకునే ఆప్షన్ లభిస్తాయి. అలాగే చాట్ లిస్ట్‌ను మనకు నచ్చినట్టు మార్చుకోవడానికి, ప్రీమియం స్టిక్కర్ ప్యాక్స్ వాడుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది.

మెటా పెయిడ్ ఎకోసిస్టమ్:

మెటా సంస్థ తమ పెయిడ్ సేవలను విస్తరించడంలో భాగంగానే ఈ ప్లాన్స్‌ను లీక్ చేసింది. గత నెలలోనే ఫేస్‌బుక్ ప్లస్, ఇన్‌స్టాగ్రామ్ ప్లస్, వాట్సప్ ప్లస్ సేవలను కొద్దిమంది యూజర్లకు మెటా అందుబాటులోకి తెచ్చింది. కేవలం యాప్ అందంగా కనిపించడమే కాకుండా, మెటా ఏఐతో యూజర్లకు మరింత స్మార్ట్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వడమే ఈ సరికొత్త ప్లాన్స్ ముఖ్య ఉద్దేశం. ప్రస్తుతం ఈ ప్లాన్స్ లాంచ్ డేట్‌పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Also Read: అద్భుతం.. iPhone 18 Pro Max ఫైనల్ కలర్స్ ఇవే.. ఒక్కసారి చూస్తే కళ్లు తిప్పుకోలేరు!

Related News

భారత్‌లో టెలిగ్రామ్ సేవలు బంద్!.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు..

iPhone 17 ధర భారీగా తగ్గింది.. Flipkart ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో రూ.25 వేలు సేవ్ చేసుకోండి!

యూజర్ల డిమాండ్‌తో మార్కెట్లోకి HMD Vibe 2 5G కొత్త వేరియంట్.. సేల్స్ ఎప్పటి నుంచంటే?

అద్భుతం.. iPhone 18 Pro Max ఫైనల్ కలర్స్ ఇవే.. ఒక్కసారి చూస్తే కళ్లు తిప్పుకోలేరు!

పవర్‌ఫుల్ ప్రాసెసర్‌తో Oppo Reno 16 Pro ఎంట్రీ.. గీక్‌బెంచ్‌లో లీకైన వివరాలు ఇవే!

Flipkart June Epic Sale.. భారీ డిస్కౌంట్‌తో మోటరోలా స్మార్ట్‌ఫోన్లు.. రూ.15,000 వరకు పొదుపు!

మార్కెట్లోకి రాకముందే Geekbench‌లో దుమ్మురేపిన iQOO కొత్త ఫోన్.. ఏ ప్రాసెసర్‌తో వస్తుందంటే?

×