E-Paper
Advertisement

Flipkart June Epic Sale.. భారీ డిస్కౌంట్‌తో మోటరోలా స్మార్ట్‌ఫోన్లు.. రూ.15,000 వరకు పొదుపు!

Flipkart June Epic Sale.. భారీ డిస్కౌంట్‌తో మోటరోలా స్మార్ట్‌ఫోన్లు.. రూ.15,000 వరకు పొదుపు!
Advertisement

Flipkart June Epic Sale: ఫ్లిప్‌కార్ట్ జూన్ ఎపిక్ సేల్ ప్రస్తుతం లైవ్‌లో ఉంది. ఇందులో శాంసంగ్, షియోమీ, ఒప్పో, వివో వంటి బ్రాండ్లతో పాటు మోటరోలా స్మార్ట్‌ఫోన్లపై మంచి ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా మోటరోలాకు చెందిన G సిరీస్, Edge సిరీస్ ఫోన్లపై కంపెనీ భారీ తగ్గింపును అందిస్తోంది. 50MP కెమెరా, 7000mAh వరకు భారీ బ్యాటరీ వంటి సూపర్ ఫీచర్లు ఉన్న ఈ ఫోన్లపై లభిస్తున్న బెస్ట్ డీల్స్ వివరాలు ఇప్పుడు మీ కోసం..

Motorola Edge 60 Fusion

ఈ సేల్‌లో మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ మోడల్ రూ.27,999 ధరకు లిస్ట్ అయింది. అయితే బ్యాంక్ ఆఫర్లను ఉపయోగించుకుంటే దీనిని ఇంకా తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే రూ.1,400 అదనపు తగ్గింపు లభిస్తుంది. ఫీచర్ల విషయానికొస్తే.. 6.67 ఇంచుల డిస్‌ప్లే, 50MP మెయిన్ కెమెరాతో కూడిన డ్యూయల్ లెన్స్ సెటప్ ఉంది. అలాగే 5500mAh బ్యాటరీ, ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7400 చిప్‌సెట్‌తో ఈ ఫోన్ పనిచేస్తుంది.

Advertisement

Also Read: మార్కెట్లోకి రాకముందే Geekbench‌లో దుమ్మురేపిన iQOO కొత్త ఫోన్.. ఏ ప్రాసెసర్‌తో వస్తుందంటే?

Motorola Edge 60 Pro

ఇక 8 GB RAM, 256 GB స్టోరేజ్ వేరియంట్ కలిగిన మోటరోలా ఎడ్జ్ 60 ప్రో మోడల్ ఈ సేల్‌లో రూ.29,999కే అందుబాటులో ఉంది. కంపెనీ ఈ ఫోన్ ఎంఆర్‌పీపై ఏకంగా రూ.7వేల డైరెక్ట్ డిస్కౌంట్ ఇస్తోంది. దీనికి తోడు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్ వాడితే మరో రూ.1,500 అదనపు తగ్గింపు వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6.7 ఇంచుల సూపర్ హెచ్‌డీ ప్లస్ 1.5K డిస్‌ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 8350 చిప్‌సెట్, 50MP ట్రిపుల్ కెమెరా, 6000mAh బ్యాటరీ వంటి పవర్‌ఫుల్ ఫీచర్లను కలిగి ఉంది.

Motorola G37 Power

Advertisement

భారీ బ్యాటరీ కావాలనుకునే వారికి మోటోరోలా జీ37 పవర్ మంచి ఆప్షన్. దీని 4 GB RAM, 128 GB స్టోరేజ్ వేరియంట్ సేల్‌లో రూ.15,999 ధరతో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ అసలు ధరపై కంపెనీ సుమారు రూ.15,000 వరకు భారీ తగ్గింపును ఇస్తుండటం విశేషం. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్ ద్వారా కొంటే మరో రూ.800 అదనంగా ఆదా అవుతుంది. ఈ ఫోన్‌లో 6.6 ఇంచుల డిస్‌ప్లే, డైమెన్సిటీ 6400 చిప్‌సెట్, 50MP కెమెరాతో పాటు 7000mAh కెపాసిటీ గల భారీ బ్యాటరీని అందించారు.

Also Read: యాపిల్ సంచలన నిర్ణయం.. చాట్‌జీపీటీ లాగే Siri AI కూడా పెయిడ్ సర్వీస్‌గా మారబోతుందా!?

Related News

BSNL మైండ్ బ్లోయింగ్ ఆఫర్.. జస్ట్ రూ. 39కే 20GB డేటా.. రూ.1కే ఉచిత సిమ్!

రూ.35వేలలోపు 50 ఇంచుల టీవీ..ఇంట్లోనే థియేటర్ ఫీల్

రాత్రి వేళ గణపయ్య ఫోటోలు బ్లర్ అవుతున్నాయా? ఈ టిప్స్‌తో క్లారిటీ అదుర్స్!

రొటేటింగ్ బెజెల్‌తో క్రేజీ స్మార్ట్ వాచ్..GOBOULT Saber విశేషాలివే

రూ.1000లోపు దబిడి దిబిడే..పార్టీ మోత మోగించే బ్లూటూత్ స్పీకర్!

మ్యూజిక్ లవర్స్ కోసం బెస్ట్ హెడ్ సెట్..మార్కెట్లో రచ్చ చేస్తున్న మోడల్

రూ.2,399కే క్రేజీ ఫీచర్లు..నథింగ్ నుంచి కొత్త ఇయర్‌బడ్స్

కొత్త ఫోన్ కొంటున్నారా? 128GB లేదా 256GB ఏది బెటర్?

Big Stories

Advertisement
×