E-Paper
Advertisement

iPhone 17 ధర భారీగా తగ్గింది.. Flipkart ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో రూ.25 వేలు సేవ్ చేసుకోండి!

iPhone 17 ధర భారీగా తగ్గింది.. Flipkart ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో రూ.25 వేలు సేవ్ చేసుకోండి!
Advertisement

iPhone 17 Price Drop: తక్కువ బడ్జెట్‌లో కొత్త ఐఫోన్ కొనాలనుకునే వారికి ఫ్లిప్‌కార్ట్ సూపర్ గుడ్ న్యూస్ చెప్పింది. యాపిల్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన iPhone 17 ఇప్పుడు భారీ డిస్కౌంట్‌తో అందుబాటులోకి వచ్చింది. డైరెక్ట్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్, బ్యాంక్ ఆఫర్లు అన్నీ కలుపుకుంటే ఏకంగా రూ.25,000 పైగా ఆదా చేసుకునే అవకాశం లభిస్తోంది. ప్రీమియం ఫోన్ల కేటగిరీలో ప్రస్తుతం మార్కెట్లో ఉన్న బెస్ట్ డీల్స్‌లో ఇది ఒకటిగా నిలిచింది.

ధర ఎంత తగ్గింది?

మార్కెట్లో iPhone 17 (256GB వేరియంట్) అసలు ధర రూ.82,900 ఉంది. అయితే ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ దీనిపై నేరుగా రూ.5,000 తగ్గింపును ఇస్తోంది. దీంతో ఈ ఫోన్ ధర రూ.77,900కు దిగొచ్చింది. కేవలం ఈ ఫ్లాట్ డిస్కౌంట్ మాత్రమే కాకుండా.. ఇతర ఆఫర్లను కూడా వాడుకుంటే ఫోన్ ధర మరింత భారీగా తగ్గుతుంది.

Advertisement

Also Read: యూజర్ల డిమాండ్‌తో మార్కెట్లోకి HMD Vibe 2 5G కొత్త వేరియంట్.. సేల్స్ ఎప్పటి నుంచంటే?

ఎక్స్ఛేంజ్ ఆఫర్ వివరాలు:

ఈ డీల్‌లో అసలైన లాభం ఎక్స్ఛేంజ్ ఆఫర్ ద్వారానే వస్తుంది. పాత iPhone 11ను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా రూ.16,800 వరకు తగ్గింపు పొందొచ్చు. దీనిలో రూ.5,000 అదనపు ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా కలిసి ఉంది. ఒకవేళ మీ వద్ద అంతకంటే కొత్త ఐఫోన్ మోడల్స్ ఉండి, అవి మంచి కండిషన్‌లో ఉంటే ఇంకా ఎక్కువ ఎక్స్ఛేంజ్ విలువ వచ్చే అవకాశం ఉంది. దీనికి తోడు హెచ్‌ఎస్‌బీసీ, బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డులపై మరో రూ.4,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ కూడా లభిస్తోంది. ఇవన్నీ కలిపితే iPhone 17ను చాలా తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.

iPhone 17 ప్రత్యేకతలు:

Advertisement

ఐఫోన్ 17 ఫీచర్ల విషయానికి వస్తే.. దీనిలో 6.3 అంగుళాల ఓఎల్ఈడీ డిస్‌ప్లేను ఇచ్చారు. ఇది అద్భుతమైన బ్రైట్‌నెస్, కలర్స్ అందిస్తుంది. ఈ ఫోన్‌లో యాపిల్ అత్యంత వేగవంతమైన ఏ19 చిప్‌సెట్‌ను వాడారు. దీంతో హెవీ గేమింగ్, మల్టీ టాస్కింగ్, ఏఐ ఫీచర్లు చాలా స్మూత్‌గా రన్ అవుతాయి. ఇక కెమెరా పరంగా వెనుక వైపు 48MP డ్యూయల్ కెమెరా సెటప్, సెల్ఫీల కోసం 18MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. 256GB స్టోరేజ్ ఉండటం వల్ల స్పేస్ సమస్య కూడా ఉండదు.

ఇప్పుడు కొనడం మంచిదా?

మీరు గనుక పాత ఐఫోన్ వాడుతూ.. కొత్త ఫోన్‌కి అప్‌గ్రేడ్ అవ్వాలని చూస్తుంటే మాత్రం ఈ ఆఫర్‌ను అస్సలు వదులుకోవద్దు. ముఖ్యంగా iPhone 11 లేదా అంతకంటే పాత మోడల్స్ ఉన్నవారికి ఇది సరైన సమయం. రోజురోజుకూ ప్రీమియం ఫోన్ల ధరలు పెరిగిపోతున్న తరుణంలో, ఇలాంటి భారీ డిస్కౌంట్ ఆఫర్లు రావడం చాలా అరుదు. కాబట్టి.. బడ్జెట్ లో iPhone 17 కొనాలనుకునే వారికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.

Also Read: యాపిల్ సంచలన నిర్ణయం.. చాట్‌జీపీటీ లాగే Siri AI కూడా పెయిడ్ సర్వీస్‌గా మారబోతుందా!?

Related News

బ్యాంక్ ఖాతాలపై హ్యాకర్ల కన్ను.. ఈ 6 VPN యాప్స్ ఉంటే వెంటనే డిలీట్ చేయండి!

వాట్సప్‌లో ఫొటోలు, వీడియోలు ఆటోమేటిక్‌గా డౌన్‌లోడ్ కాకుండా ఎలా ఆపాలి?

25 రోజుల బ్యాటరీ.. వాచ్ ఫీచర్లతో క్యాసియో ‘స్మార్ట్ రింగ్’ వచ్చేసింది, ధర ఎంతంటే?

ఆరేళ్ల బ్యాటరీ గ్యారెంటీతో భారత్‌లోకి వచ్చేసిన Vivo T5x 5G.. లాంచింగ్ ఆఫర్‌తో తక్కువ ధరకే పొందొచ్చు!

రీఛార్జ్ రేట్లు పెరిగినా డోంట్ కేర్.. రూ.1849కే ఏడాది పొడవునా ఎయిర్‌టెల్ ప్లాన్ ఉందిగా!

ఫోన్ వర్షంలో తడిసినా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా కాపాడుకునే ‘మాస్టర్ టిప్’ ఇదిగో!

జియో మైండ్ బ్లోయింగ్ ఆఫర్.. రూ.55 కే 1000 పైగా ఛానెళ్లు.. ఎంచెక్కా ఫోన్‌లోనే లైవ్ టీవీ!

డెల్ నుంచి అడ్వాన్స్‌డ్ ఏఐ ల్యాప్‌టాప్‌లు వచ్చేసాయి.. 17 గంటల బ్యాటరీ లైఫ్‌తో!

Big Stories

Advertisement
×