E-Paper
Advertisement

అద్భుతం.. iPhone 18 Pro Max ఫైనల్ కలర్స్ ఇవే.. ఒక్కసారి చూస్తే కళ్లు తిప్పుకోలేరు!

అద్భుతం.. iPhone 18 Pro Max ఫైనల్ కలర్స్ ఇవే.. ఒక్కసారి చూస్తే కళ్లు తిప్పుకోలేరు!
Advertisement

iPhone 18 Pro Max Leaks: ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ నుంచి ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూసే టెక్ లవర్స్‌కు గుడ్ న్యూస్. ఈ ఏడాది సెప్టెంబర్‌లో లాంచ్ కాబోతున్న ఈ మోడల్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ప్రముఖ టెక్ రిపోర్టర్ జాన్ రెట్టింగర్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పంచుకున్న ఈ లీకైన ఫొటోలు ఐఫోన్ ప్రియుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇందులో ముఖ్యంగా ఫోన్ కలర్ ఆప్షన్స్, డిజైన్ మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ఆకట్టుకుంటున్న 3 కొత్త రంగులు:

తాజా లీకుల ప్రకారం iPhone 18 Pro Max మూడు సరికొత్త రంగుల్లో అలరించనుంది. అవి డార్క్ చెర్రీ, లైట్ బ్లూ, బ్లాక్. గతంలో వచ్చిన ప్రో మోడల్స్‌తో పోలిస్తే ఇవి చాలా భిన్నంగా ఉండబోతున్నాయి. ముఖ్యంగా గతంలో లీకైన సిల్వర్ కలర్ వేరియంట్ ఈ తాజా ఫొటోలలో ఎక్కడా కనిపించకపోవడం గమనార్హం. దానికి బదులుగా ఈ మూడు రంగులనే ఆపిల్ ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది.

ఈసారి సిగ్నేచర్ కలర్ ఇదేనా?

Advertisement

ఈ సిరీస్‌లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న రంగు ‘డార్క్ చెర్రీ’. గత కొన్ని నెలలుగా యాపిల్ ఒక సరికొత్త రెడ్ షేడ్‌ను పరిచయం చేయబోతోందనే ప్రచారం జరుగుతోంది. దానికి తగ్గట్టే ఈ డార్క్ చెర్రీ కలర్ ఉండబోతోంది. ఇది మనం రెగ్యులర్‌గా చూసే బ్రైట్ ప్రొడక్ట్ (RED)లా కాకుండా, ఎరుపు, గులాబీ రంగుల కలయికతో చాలా క్లాసిక్‌గా, ప్రీమియం లుక్‌తో కనిపిస్తోంది.

ఈ ఏడాది యాపిల్ సిగ్నేచర్ కలర్‌గా ఇదే నిలిచేలా ఉంది. ఇక లైట్ బ్లూ కలర్ మునుపటి కంటే కాస్త ముదురు రంగులో, బ్లాక్ వేరియంట్ గ్లోసీ కెమెరా మాడ్యూల్ మరియు మ్యాట్ ఫినిషింగ్ బ్యాక్ ప్యానెల్‌తో అదిరిపోయే కాంట్రాస్ట్‌ను ఇస్తున్నాయి.

Advertisement

Also Read: పవర్‌ఫుల్ ప్రాసెసర్‌తో Oppo Reno 16 Pro ఎంట్రీ.. గీక్‌బెంచ్‌లో లీకైన వివరాలు ఇవే!

డైనమిక్ ఐలాండ్ సైజు తగ్గింది:

ఫీచర్ల విషయానికి వస్తే.. iPhone 18 Pro Maxలో పవర్‌ఫుల్ ఏ20 ప్రో బయోనిక్ చిప్‌సెట్‌ను ఉపయోగించనున్నారు. ఇది ఫోన్ పెర్ఫామెన్స్‌ను, బ్యాటరీ సామర్థ్యాన్ని మరింత పెంచుతుంది. మెరుగైన కనెక్టివిటీ కోసం కొత్త సీ2 మోడెమ్‌ను జోడించబోతున్నారు. వీటన్నింటితో పాటు స్క్రీన్‌పై డిజైన్ పరంగా ఒక ముఖ్యమైన మార్పు జరగనుంది.

అలాగే డిస్‌ప్లే పైభాగంలో ఉండే డైనమిక్ ఐలాండ్ సైజును ఈసారి తగ్గించబోతున్నారు. దీనివల్ల యూజర్లకు స్క్రీన్ స్పేస్ మరింత ఎక్కువగా దొరుకుతుంది. అయితే బ్యాటరీ సామర్థ్యంలో మాత్రం పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. ధరలు కూడా ప్రస్తుత మోడల్స్ శ్రేణిలోనే ఉండే అవకాశం ఉంది.

సెప్టెంబర్ లాంచ్‌పై భారీ అంచనాలు:

యాపిల్ తమ పాత సాంప్రదాయాన్ని పాటిస్తూ ఈ ఐఫోన్ 18 సిరీస్‌ను సెప్టెంబర్ నెలలో మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ఈ గ్రాండ్ ఈవెంట్‌లోనే యాపిల్ తమ మొదటి ఫోల్డబుల్ (మడతబెట్టే) ఐఫోన్‌ను కూడా ప్రపంచానికి పరిచయం చేయవచ్చనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మాత్రం ఇంకా బయటకు రావాల్సి ఉంది.

Also Read: Flipkart June Epic Sale.. భారీ డిస్కౌంట్‌తో మోటరోలా స్మార్ట్‌ఫోన్లు.. రూ.15,000 వరకు పొదుపు!

Related News

BSNL మైండ్ బ్లోయింగ్ ఆఫర్.. జస్ట్ రూ. 39కే 20GB డేటా.. రూ.1కే ఉచిత సిమ్!

రూ.35వేలలోపు 50 ఇంచుల టీవీ..ఇంట్లోనే థియేటర్ ఫీల్

రాత్రి వేళ గణపయ్య ఫోటోలు బ్లర్ అవుతున్నాయా? ఈ టిప్స్‌తో క్లారిటీ అదుర్స్!

రొటేటింగ్ బెజెల్‌తో క్రేజీ స్మార్ట్ వాచ్..GOBOULT Saber విశేషాలివే

రూ.1000లోపు దబిడి దిబిడే..పార్టీ మోత మోగించే బ్లూటూత్ స్పీకర్!

మ్యూజిక్ లవర్స్ కోసం బెస్ట్ హెడ్ సెట్..మార్కెట్లో రచ్చ చేస్తున్న మోడల్

రూ.2,399కే క్రేజీ ఫీచర్లు..నథింగ్ నుంచి కొత్త ఇయర్‌బడ్స్

కొత్త ఫోన్ కొంటున్నారా? 128GB లేదా 256GB ఏది బెటర్?

Big Stories

Advertisement
×