E-Paper
Advertisement

మార్కెట్లోకి రాకముందే Geekbench‌లో దుమ్మురేపిన iQOO కొత్త ఫోన్.. ఏ ప్రాసెసర్‌తో వస్తుందంటే?

మార్కెట్లోకి రాకముందే Geekbench‌లో దుమ్మురేపిన iQOO కొత్త ఫోన్.. ఏ ప్రాసెసర్‌తో వస్తుందంటే?
Advertisement

iQOO Neo 11S: ఐకూ కంపెనీ చైనాలో తమ పాపులర్ నియో సిరీస్‌ను మరింత విస్తరించేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా iQOO Neo 11S పేరుతో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకురావడానికి ప్లాన్ చేస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా రానప్పటికీ.. ప్రముఖ బెంచ్‌మార్కింగ్ వెబ్‌సైట్ గీక్‌బెంచ్‌లో ఈ ఫోన్ ప్రత్యక్షమవడంతో దీని కీలక ఫీచర్లు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి.

పవర్‌ఫుల్ ప్రాసెసర్‌తో ఎంట్రీ:

గీక్‌బెంచ్ లిస్టింగ్ ప్రకారం.. ఈ సరికొత్త iQOO Neo 11S స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ ఫ్లాగ్‌షిప్ డైమెన్సిటీ 9500 ప్రాసెసర్‌తో రానుంది. దీనిలో Mali-G1-Ultra గ్రాఫిక్స్ కార్డ్‌ను అందించారు. ఈ ఫోన్ సింగిల్ కోర్ టెస్టులో 3,395 స్కోరును, మల్టీ కోర్ టెస్టులో ఏకంగా 10,312 స్కోరును సాధించి అందరినీ ఆకట్టుకుంటోంది. దీనివల్ల ఫోన్ పర్ఫార్మెన్స్ చాలా వేగంగా ఉంటుందని తెలుస్తోంది.

Advertisement

Also Read: యాపిల్ సంచలన నిర్ణయం.. చాట్‌జీపీటీ లాగే Siri AI కూడా పెయిడ్ సర్వీస్‌గా మారబోతుందా!?

భారీ ర్యామ్, లేటెస్ట్ సాఫ్ట్‌వేర్:

ఈ ఫోన్ వివో V2545A మోడల్ నెంబర్‌తో గీక్‌బెంచ్‌లో కనిపించింది. మల్టీటాస్కింగ్ ఇష్టపడే వారి కోసం ఈ ఫోన్‌లో ఏకంగా 16GB RAMను అందించినట్లు సమాచారం. దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్ సరికొత్త ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుందని లిస్టింగ్ ద్వారా స్పష్టమవుతోంది.

సూపర్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్:

Advertisement

గతంలో వచ్చిన 3C సర్టిఫికేషన్ వివరాల ప్రకారం.. ఈ కొత్త మోడల్ 100W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో వచ్చే అవకాశం ఉంది. బ్యాటరీ క్షణాల్లో ఛార్జ్ అవ్వడానికి ఈ ఫీచర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే ఈ ఫోన్ బ్యాటరీ సామర్థ్యం ఎంత అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

పాత మోడల్‌కు అప్‌గ్రేడ్‌గా:

గతేడాది అక్టోబర్‌లో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్, 7500mAh భారీ బ్యాటరీతో వచ్చిన ఐకూ నియో 11 మోడల్‌కు అప్‌గ్రేడ్‌గా ఈ నియో 11ఎస్ రానుంది. రాబోయే రోజుల్లో ఈ ఫోన్ ధర, లాంచ్ తేదీకి సంబంధించిన మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది.

Also Read: చూడగానే నచ్చేసే డిజైన్.. 11,000mAh భారీ బ్యాటరీ.. మార్కెట్లోకి వస్తోన్న Honor క్రేజీ ఫోన్ ఇదే!

Related News

BSNL మైండ్ బ్లోయింగ్ ఆఫర్.. జస్ట్ రూ. 39కే 20GB డేటా.. రూ.1కే ఉచిత సిమ్!

రూ.35వేలలోపు 50 ఇంచుల టీవీ..ఇంట్లోనే థియేటర్ ఫీల్

రాత్రి వేళ గణపయ్య ఫోటోలు బ్లర్ అవుతున్నాయా? ఈ టిప్స్‌తో క్లారిటీ అదుర్స్!

రొటేటింగ్ బెజెల్‌తో క్రేజీ స్మార్ట్ వాచ్..GOBOULT Saber విశేషాలివే

రూ.1000లోపు దబిడి దిబిడే..పార్టీ మోత మోగించే బ్లూటూత్ స్పీకర్!

మ్యూజిక్ లవర్స్ కోసం బెస్ట్ హెడ్ సెట్..మార్కెట్లో రచ్చ చేస్తున్న మోడల్

రూ.2,399కే క్రేజీ ఫీచర్లు..నథింగ్ నుంచి కొత్త ఇయర్‌బడ్స్

కొత్త ఫోన్ కొంటున్నారా? 128GB లేదా 256GB ఏది బెటర్?

Big Stories

Advertisement
×