E-Paper
Advertisement

IPL Auction 2026: ఏం గుండెరా అది.. గాయమైన ఆ కుర్రాడికి రూ.14.20 కోట్లు పెట్టిన CSK, ఇంతకీ ఎవ‌రీ కార్తీక్ శర్మ?

IPL Auction 2026: ఏం గుండెరా అది.. గాయమైన ఆ కుర్రాడికి రూ.14.20 కోట్లు పెట్టిన CSK, ఇంతకీ ఎవ‌రీ కార్తీక్ శర్మ?
Advertisement

IPL Auction 2026:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంటుకు ( Indian Premier League 2026 Tournament )
సంబంధించిన మినీ వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు చాలా తెలివిగా అడుగులు వేస్తోంది. అంతర్జాతీయ ప్లేయర్లపై డబ్బులు పెట్టకుండా కేవలం రంజీలు, దేశవాళీ క్రికెట్ ఆడే ప్లేయర్ల పైన ఎక్కువ డబ్బులు పెడుతోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే ప్రశాంత్ వీర్ అనే కొత్త కుర్రాడిని 14.20 కోట్లకు కొనుగోలు చేసిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు యాజమాన్యం, మరో షాకింగ్ కొనుగోలు చేసింది. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన యంగ్ బ్యాటర్ కార్తీక్‌ శర్మను రికార్డ్ స్థాయిలో ధరపెట్టి కొనుగోలు చేసింది చెన్నై సూపర్ కింగ్స్. ఈ 19 ఏళ్ల అన్‌క్యాప్డ్ ప్లేయర్ కార్తీక్ శ‌ర్మ‌ను 14.20 కోట్లకు కొనుగోలు చేసింది చెన్నై సూపర్ కింగ్స్. దీంతో మిగిలిన ఫ్రాంచైజీలు షాక్ అవుతున్నాయి. ఏంటి ఈ బచ్చా కుర్రాళ్లను కొనుగోలు చేసి, టైటిల్ గెలవాలని చెన్నై సూపర్ కింగ్స్ చూస్తోందా? అంటూ షాక్ అవుతున్నాయి. ఈ కార్తీక్ శర్మను కొనుగోలు చేసేటప్పుడు హైదరాబాద్ జట్టు చాలా ప్ర‌యత్నం చేసింది. కానీ హైద‌రాబాద్ ను బీట్ చేసి ముందుకు వెళ్ళింది సీఎస్కే.

Also Read: Vaibhav Suryavanshi: 3 ఏళ్లుగా అదే చెబుతున్నావ్, వైభ‌వ్ ఏజ్ పై పాకిస్తాన్ ఫ్యాన్స్ ట్రోల్స్‌.. ఛీట‌ర్ అంటూ అరుపులు

ఇంతకీ ఎవ‌రీ కార్తీక్ శర్మ ?

Advertisement

19 ఏళ్ల ఈ అన్‌క్యాప్డ్ ప్లేయర్ కార్తీక్ శ‌ర్మ‌ ( Karthik Sharma) రాజస్థాన్ రాష్ట్రానికి చెందినవాడు. ఇతడు రంజీ ట్రోఫీలో ఉత్తరాంఖ‌డ్ పైన ఇటీవల సెంచరీ కూడా నమోదు చేశాడు. గత సంవత్సరంలో విజయ్ హజారే ట్రోఫీలో 445 పరుగులు చేసి రాజస్థాన్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా చరిత్ర సృష్టించాడు. ఇటు స‌య్య‌ద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 11 ఇన్నింగ్స్ లలో 334 పరుగులు సాధించాడు. అయితే ఈ మధ్య గాయం కారణంగా అతడు ఈ టోర్నమెంట్ నుంచి వైదొల‌గాల్సి వచ్చింది. అయినప్పటికీ అతన్ని భారీ ధరకే కొనుగోలు చేసి షాక్ ఇచ్చింది చెన్నై సూపర్ కింగ్స్.

Also Read: IPL 2026 Auction: ఐపీఎల్ 2026 షెడ్యూల్ లో మార్పు…నేడే మినీ వేలం, టైమింగ్స్, ఉచితంగా ఎక్క‌డ చూడాలంటే

Advertisement

 

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్..త‌న డ్రీమ్ టీమిండియాను ప్ర‌క‌టించిన ర‌విశాస్త్రి

శ్రీలంక‌లో షాహీన్ అఫ్రిదికి ఘోర అవ‌మానం…ప్రీమియ‌ర్ బౌల‌ర్ కాస్త..మీడియం అయ్యాడు

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

Big Stories

Advertisement
×