E-Paper
Advertisement

IPL Auction 2026: అన్‌క్యాప్డ్ ప్లేయర్‌కు రూ.14.20 కోట్లు పెట్టిన CSK..ఇంతకీ ఎవరీ ప్రశాంత్ వీర్?

IPL Auction 2026: అన్‌క్యాప్డ్ ప్లేయర్‌కు రూ.14.20 కోట్లు పెట్టిన CSK..ఇంతకీ ఎవరీ ప్రశాంత్ వీర్?
Advertisement

IPL Auction 2026:  ఐపీఎల్ 2026 టోర్నమెంటుకు ( Indian Premier League 2026 Tournament ) సంబంధించిన మినీ వేలం చాలా రసవత్తరంగా కొనసాగుతోంది. ఇవాళ మధ్యాహ్నం రెండున్నర గంటల ప్రాంతంలో అబుదాబి వేదికగా ప్రారంభమైన ఈ మినీ వేలంలో ప్రేయర్లు అంచనాలకు మించి ధర పలుకుతున్నారు. ఇప్పటికే విదేశీ ప్లేయర్ కామెరాన్ గ్రీన్ ( Cameron Green ) పై 25.20 కోట్లు పెట్టిన కేకేఆర్ , చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు చెందిన మతీష పతీరణ ను 18 కోట్లకు కొనుగోలు చేశారు. అయితే ఈ నేపథ్యంలో పాత ప్లేయర్లను వదులుకున్న చెన్నై సూపర్ కింగ్స్, యంగ్ జనరేషన్ కు అవకాశం ఇస్తోంది. ఈ సారి ఎలాగైనా టైటిల్ గెలవాలన్న లక్ష్యంతో దూసుకు వెళ్తోంది చెన్నై సూపర్ కింగ్స్. ఇందులో భాగంగానే ప్రశాంత్ వీర్ అనే అన్‌క్యాప్డ్ ప్లేయర్ పై 14.20 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. ప్రశాంత్ వీర్ ( Prashant Veer ) ఆల్ రౌండ‌ర్ కావ‌డంతో అత‌న్ని ఈ రేంజ్ లో ధ‌ర పెట్టింది CSK.

Also Read: Vaibhav Suryavanshi: 3 ఏళ్లుగా అదే చెబుతున్నావ్, వైభ‌వ్ ఏజ్ పై పాకిస్తాన్ ఫ్యాన్స్ ట్రోల్స్‌.. ఛీట‌ర్ అంటూ అరుపులు

ఇంతకీ ఎవరీ ప్రశాంత్ వీర్?

Advertisement

చెన్నై సూపర్ కింగ్స్ భారీ ధర పెట్టి కొనుగోలు చేసిన ప్రశాంత్ వీర్ వయసు కేవలం 20 సంవత్సరాలు మాత్రమే. ప్రశాంత్ వీర్ మంచి ఆల్రౌండర్. అయితే అంతర్జాతీయ క్రికెట్ ఆడిన అనుభవం ప్రశాంత్ వీర్ కు లేదు. ఉత్తరప్రదేశ్ లోని అమేథీ ప్రాంతంలో జన్మించిన ప్రశాంత్ వీర్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ చేస్తాడు. ఉత్తర ప్రదేశ్ టి20 లీగ్ లో నోయిడా సూపర్ కింగ్స్ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ టోర్నమెంట్ లో ఇటీవల పది మ్యాచ్ ల‌లో 320 పరుగులు చేయడమే కాకుండా మొత్తం ఎనిమిది వికెట్లు తీసి దుమ్ము లేపాడు. ఇతని కోసం సన్రైజర్స్ హైదరాబాద్ కూడా చాలా ప్రయత్నాలు చేసింది. కానీ చివరికి చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 14.20 కోట్లకు కొనుగోలు చేసింది. ఇక అటు రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన యంగ్ బ్యాటర్ కార్తీక్‌ శర్మను రికార్డ్ స్థాయిలో ధరపెట్టి కొనుగోలు చేసింది చెన్నై సూపర్ కింగ్స్. ఈ 19 ఏళ్ల అన్‌క్యాప్డ్ ప్లేయర్ కార్తీక్ శ‌ర్మ‌ను 14.20 కోట్లకు కొనుగోలు చేసింది చెన్నై సూపర్ కింగ్స్.

 

Advertisement

Also Read: IPL 2026 Auction: ఐపీఎల్ 2026 షెడ్యూల్ లో మార్పు…నేడే మినీ వేలం, టైమింగ్స్, ఉచితంగా ఎక్క‌డ చూడాలంటే

 

Related News

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్..త‌న డ్రీమ్ టీమిండియాను ప్ర‌క‌టించిన ర‌విశాస్త్రి

శ్రీలంక‌లో షాహీన్ అఫ్రిదికి ఘోర అవ‌మానం…ప్రీమియ‌ర్ బౌల‌ర్ కాస్త..మీడియం అయ్యాడు

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

పాకిస్తాన్ జ‌ట్టులో కుదుపు…ఫాతిమా స‌నా కెప్టెన్సీ గ‌ల్లంతు

Big Stories

Advertisement
×