E-Paper
Advertisement

వాట్సప్ హ్యాక్ అయిందా? వెంటనే ఇలా చేయండి.. స్కామర్లకు పిచ్చెక్కిపోద్ది!

వాట్సప్ హ్యాక్ అయిందా? వెంటనే ఇలా చేయండి.. స్కామర్లకు పిచ్చెక్కిపోద్ది!
Advertisement

WhatsApp Security Tips: ప్రస్తుత రోజుల్లో వాట్సప్ కేవలం మెసేజింగ్ యాప్ లాగే కాకుండా.. వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాల్లో భాగమైపోయింది. అయితే అదే సమయంలో వాట్సాప్ ఖాతాలను హ్యాక్ చేస్తూ అమాయకులను బురిడీ కొట్టించే సైబర్ నేరగాళ్ల సంఖ్య కూడా రోజురోజుకూ పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో వాట్సప్ హ్యాక్ అయినట్లు ఏమైనా అనుమానం కలిగితే.. వెంటనే మార్చాల్సిన సెక్యురిటీ సెట్టింగ్స్ గురించి ఈ కథనంలో అందించడం జరుగుతోంది. వాటిపై ఓ లుక్కేయండి.

టూ-స్టెప్ వెరిఫికేషన్ (Two Step Verification)

వాట్సాప్ ఖాతాకు ఇది పూర్తి స్థాయిలో భద్రతను ఇస్తుంది. ఈ ఫీచర్ ను ఉపయోగించి.. 6 డిజిట్ల పిన్ ను మీ నెంబర్ కు సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా చేస్తే.. ఎవరైనా మీ మెుబైల్ నెంబర్ తో వాట్సాప్ క్రియేట్ చేయాల్సి వస్తే ఈ పిన్ తప్పనిసరిగా ఎంటర్ చేయాల్సి వస్తుంది. తద్వారా మీ వాట్సప్ డేటా మరొకరి చేతికి వెళ్లకుండా అడ్డుకోవచ్చు. ఈ పిన్ క్రియేట్ చేసేందుకు సెట్టింగ్స్ లోకి వెళ్లి అకౌంట్ లో టూ స్టెప్ వెరిఫికేషన్ ఆప్షన్ లోకి వెళ్లాలి. దాన్ని ఎనేబుల్ చేసుకొని పిన్ నెంబర్ ఇస్తే చాలు.. మీ వాట్సప్ కు పటిష్టమైన సెక్యూరిటీ లభించినట్లే.

ఫేస్ లాక్, ఫింగర్ ప్రింట్

Advertisement

పాస్‌వర్డ్‌లు, ఓటీపీల కంటే పాస్‌కీస్ వ్యవస్థ అత్యంత సురక్షితమైనది. దీని ద్వారా మీ ఫోన్ ఫేస్ లాక్, ఫింగర్‌ప్రింట్, స్క్రీన్ లాక్ పిన్‌ను ఉపయోగించి వాట్సాప్‌లోకి లాగిన్ అవ్వవచ్చు. దీనివల్ల ఓటీపీ స్కామ్‌ల నుండి మీ అకౌంట్‌ను సులభంగా కాపాడుకోవచ్చు. దీనిని సెట్టింగ్స్ > అకౌంట్ > పాస్‌కీస్ లోకి వెళ్లి సెటప్ చేసుకోండి.

అనుమానాస్పద లింక్స్

ఎంతటి సెక్యూరిటీ ఉన్నా కొందరు చేసే చిన్న పొరపాటు వల్ల అకౌంట్ హ్యాక్ అయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వాట్సాప్‌కు వచ్చే ఆరు అంకెల ఓటీపీ (SMS Code) ని ఎవరితోనూ, ఏ పరిస్థితిలోనూ పంచుకోవద్దు. అలాగే ‘రూ.10 లక్షల లాటరీ తగిలింది’, ‘ఉచిత రీఛార్’ అంటూ వచ్చే సైబర్ క్రిమినల్స్ మెసేజ్ లింక్‌లను ఎట్టి పరిస్థితుల్లో క్లిక్ చేయవద్దని నిపుణులు సూచిస్తున్నారు.

Advertisement

Also Read: SanDisk సంచలనం.. సరికొత్త USB-C డ్రైవ్‌లు లాంచ్.. ఇక డేటా ట్రాన్స్‌ఫర్ మరింత ఈజీ!

లింక్డ్ డివైజెస్ (Linked Devices)

ఒక్కోసారి మన ప్రమేయం లేకుండానే వాట్సాప్ అకౌంట్ వేరే కంప్యూటర్, వెబ్ బ్రౌజర్‌లో ఓపెన్ అయ్యి ఉండొచ్చు. కాబట్టి ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండాలి. ఇందు కోసం వాట్సాప్ లో రైట్ సైడ్ ఉన్న మూడు చుక్కలపై క్లిక్ చేసి ‘Linked Devices’ ఆప్షన్‌ లోకి వెళ్లండి. అక్కడ మీకు తెలియని డివైజ్ ఏదైనా కనిపిస్తే వెంటనే దానిపై క్లిక్ చేసి ‘లాగౌట్’ చేయండి. ఇలా పైన పేర్కొన్న టిప్స్ పాటించడం ద్వారా స్కామర్ల మోసాలకు చెక్ పెట్టవచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

Also Read: వానలో ఆఫీస్‌కి వెళ్తున్నారా? రూ.300 లోపున్న ఈ గ్యాడ్జెట్స్ లేకపోతే.. రూ.వేలల్లో నష్టపోవాల్సిందే!

Related News

గేమింగ్ పీక్స్ చూపిస్తాయ్.. రూ.1.5 లక్షలలోపు బెస్ట్ లాప్‌టాప్స్ ఇవే భయ్యా!

సామ్‌సంగ్ 43 ఇంచుల టీవీపై భారీ డిస్కౌంట్..ఆఫర్ ముగిసేలోపే కొనేయండి

ఫిట్‌నెస్ లవర్స్‌కు పండగే.. మతిపోగొట్టే ఫీచర్లతో Motorola Watch Ultra గ్లోబల్ ఎంట్రీ!

వావ్ అనిపిస్తున్న మోటరోలా తొలి వైడ్ ఫోల్డబుల్ ఫోన్.. ఈ ఫీచర్లకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే!

కిచెన్ పనులు చిటికెలో అయిపోవాలా? వీటిపై ఓ లుక్కేయండి

హెల్తీ లైఫ్ కోసం కాపర్ vs ఆల్కలైన్ వాటర్ ప్యూరిఫైయర్..ఏది బెస్ట్?

AirPods కంటే దుమ్మురేపే బేస్ కావాలా? ఈ 4 బెస్ట్ ఇయర్ బడ్స్‌పై ఒక లుక్కేయండి!

చూస్తేనే దిమ్మతిరిగిపోయే లుక్.. 16GB ర్యామ్‌తో వచ్చేస్తోన్న Xiaomi 18 Fold!

Big Stories

Advertisement
×