Voter Revision: స్వేచ్చ బ్యూరో: ఓటరు జాబితాలోని తప్పులను సరి చేయటంతో పాటు బోగస్ ఓట్ల ఏరివేత కోసం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియ హైదరాబాద్ జిల్లాలో ఎట్టకేలకు గాడీన పడింది. ఈ నెల 11వ తేదీ వరకు కేవలం అయిదు శాతం కూడా పూర్తి కాని సర్ మంగళవారం నాటికి గడిచిన 26 రోజుల్లో దాదాపు 42.96 శాతం పూర్తయింది. ముఖ్యంగా సర్ ప్రక్రియకు సంబంధించిన జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ డైలీ ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తుండటంతో పాటు బూత్ లెవెల్ ఆఫీసర్లు క్షేత్ర స్థాయి విధులు నిర్వహించటం లేదన్న విషయం కమిషనర్ దృష్టికి రావటంతో బూత్ లెవెల్ ఆఫీసర్ల విధి నిర్వహణపై ఆరా తీసేందుకు జీహెచ్ఎంసీ విజిలెన్స్ ను రంగంలో దింపటంతో పోలీసులు తమదైన స్టైల్ లో బూత్ లెవెల్ ఆఫీసర్ల విధి నిర్వహణపై సమాచారం సేకరించారు.
కమిషనర్‌కు రోజువారీగా నివేదికలను పంపుతుండటంతో ఎట్టకేలకు ప్రక్రియ ఊపందుకుందనే చెప్పవచ్చు. గత నెల 25వ తేదీన మొదలైన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ఈ నెల 21వ తేదీ వరకు 42.96 శాతం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. హైదరాబాద్ జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని మొత్తం 47 లక్షల 36 వేల 669 మంది ఓటర్లకు ఇంటింటికి ఫారాల పంపిణీ నూటికి నూరు శాతం పూర్తి చేసిన 4062 మంది బూత్ లెవల్ ఆఫీసర్లు పూరించిన ఫారాలను కూడా ఇంటింటికెళ్లి స్వీకరిస్తున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో నేటికీ కొంత మేరకు బూత్ లెవెల్ ఆఫీసర్ల పనితీరు సంతృప్తి కరంగా లేకపోవటంతో ప్రక్రియ ముగిసిన తర్వాత చర్యలు తీసుకునేందుకు బూత్ లెవెల్ ఆఫీసర్ల జాబితాను సిద్దం చేసినట్లు విశ్వసనీయ సమాచారం.
ఓటర్లకు పంపిణీ చేసిన ఎన్యుమరేషన్ ఫారాలను మంగళవారం వరకు దాదాపు 20 లక్షల 34 వేల 849 మంది తిరిగి బూత్ లెవెల్ ఆఫీసర్లకు సమర్పించగా, ఆ మొత్తం దరఖాస్తులను డిటైజ్డ్ చేసినట్లు కూడా అధికారులు తెలిపారు. వీరితో పాటు ఆన్ లైన్ లో ఎన్యుమరేషన్ ఫారాన్ని సమర్పించి సర్ 2026 ప్రక్రియను పూర్తి చేసుకున్న ఓటర్లు సుమారు 4 లక్షల 54 వేల 327 మంది (9.59 శాతం) ఉన్నట్లు అధికారులు తెలిపారు. మొత్తం 15 నియోజకవర్గాలు 4062 పోలింగ్ స్టేషన్లలో ఇంకా 24 లక్షల 41 వేల 227 మంది ఓటర్లు ఎన్యుమరేషన్ ఫారాలను సమర్పించాల్సి ఉంది. వచ్చే నెల 3 వరకు నిర్వహించనున్న సర్ ప్రక్రియలో భాగంగా ఈ మొత్తం ఓటర్ల ఫారాలను స్వీకరించటంతో పాటు ఆ ఫారాలను డిజిటలైజేనష్ కూడా చేయాల్సి ఉంది.
Also Read: Operation Akarsh: బీఆర్ఎస్ పార్టీకి బీజేపీ మాస్టర్ స్ట్రోక్.. పల్లా, మల్లారెడ్డి, గంగుల లిస్ట్ రెడీ?
సర్ ప్రక్రియకు సంబంధించి హైదరాబాద్ జిల్లాలోని చాంద్రాయణగుట్టలో మొత్తం ఓటర్లు 3 లక్షల 77 వేల 300 మంది ఓటర్లుండగా, ఇప్పటి వరకు అత్యధికంగా సుమారు లక్షా 86 వేల 229 మంది (49.36 శాతం) ఓటర్లకు సర్ ప్రక్రియ ముగిసింది. వారి ఫారాలు డిజిటలైజేషన్ కూడా పూర్తయింది. జిల్లాలోని 15 నియోజకవర్గాల్లో అత్యల్పంగా ముషీరాబాద్ నియోజకవర్గంలో సర్ ప్రక్రియ పూర్తయింది. ఈ నియోజకవర్గంలో మొత్తం 3 లక్షల 10 వేల 116 మంది ఓటర్లుండగా, వీరిలో సర్ ప్రక్రియ లక్షా 18 వేల 601 మంది ఓటర్లకు పూర్తయింది. అంటే అన్ని నియోజకవర్గాల కన్నా తక్కువగా 38.24 శాతం సర్ పూర్తయింది. మొత్తం 15 నియోజకవర్గాల్లో ఆబ్సెంట్, డెత్, షిఫ్టెడ్ ఓటర్లు సుమారు 2 లక్షల 60 వేల 593 మంది ఉన్నట్లు జిల్లా ఎన్నికల అధికారులు గుర్తించారు.
వచ్చే నెల 3వ తేదీ వరకు కొనసాగనున్న సర్ ప్రక్రియలో భాగంగా అంతకన్నా ముందే ఓటర్లు తమ ఎన్యుమరేషన్ ఫారాలను సమర్పించాలని అధికారులు సూచిస్తున్నారు. చాలా మంది ఓటర్లు ఫారాలను పూర్తించినా, చివరి తేదీ వరకు వేచి ఉండకుండా బూత్ లెవెల్ ఆఫీసర్ కు వీలైనంత త్వరగా సమర్పిస్తే, ఆ ఫారాలను బూత్ లెవెల్ ఆఫీసర్లు మళ్లీ డిజిటలైజేషన్ చేయాల్సి ఉంటుందని అధికారులు సూచిస్తున్నారు. ముందుగా ప్రకటించిన సర్ షెడ్యూల్ ప్రకారం ఈ నెల 24వ తేదీన ముగించాల్సిన సర్ ప్రక్రియకు భారత ఎన్నికల సంఘం వచ్చే నెల 3వ తేదీ వరకు గడువు పెంచిన సంగతి తెల్సిందే. మళ్లీ గడువు పెరిగే అవకాశం ఉందా? అన్న ప్రశ్నకు ఎట్టి పరిస్థితుల్లో పెంచే అవకాశం లేదని ఎలక్షన్ వింగ్ అధికారులు చెబుతున్నారు.
Also read: Paddy Procurement: తెలంగాణ ప్రభుత్వానికి గుడ్ న్యూస్.. కేంద్రం గ్రీన్ సిగ్నల్..?
సర్ ప్రక్రియలో భాగంగా ఓటర్ల నుంచి పూరించిన ఎన్యుమరేషన్ ఫారాలతో పాటు కొత్త ఓటర్ల నమోదు కోసం ఫారం-6 ల స్వీకరణకు సంబంధించి ప్రతిరోజు అయిదు శాతం పెంచేలా విధులు నిర్వర్తించాలని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ టార్గెట్ పెట్టినట్లు సమాచారం. స్వీకరించిన ఫారాలను అప్పటికపుడే డిజిటలైజ్ చేసేందుకు వీలుగా బూత్ లెవెల్ ఆఫీసర్లకు తగిన సౌకర్యాలను కల్పించారు. వచ్చే నెల 3 వరకు ఇంకా 13 రోజుల గడువులో బూత్ లెవెల్ ఆఫీసర్లు దాదాపు 24 లక్షల 41 వేల 227 మంది ఓటర్ల నుంచి ఎన్యుమరేషన్ ఫారాల స్వీకరణ, డిజిటలైజేషన్ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంది.
వచ్చే నెల 3వ తేదీ వరకు కొనసాగనున్న సర్ ప్రక్రియలో భాగంగా ఆగస్టు 10న ఓటరు జాబితా ముసాయిదాను విడుదల చేసి, అదే రోజు నుంచి అభ్యంతరాలు, ఫిర్యాదులను స్వీకరించి, వాటిని అక్టోబర్ 10వ తేదీ వరకు అభ్యంతరాలు, క్లెయిమ్ లను పరిష్కరించి, అక్టోబర్ 12న ఓటరు తుది జాబితాను విడుదల చేయనున్నారు.
Also read: Rahul Gandhi: మోదీ సర్కార్‌కు రాహుల్ గాంధీ వార్నింగ్.. పేపర్ లీకుల లెక్కలు బయటపెట్టిన రాహుల్!