E-Paper
Advertisement

Xiaomi Watch 5: 18 రోజులు బ్యాటరీ లైఫ్ ఇచ్చే షియోమి వాచ్ 5.. eSIM సపోర్ట్‌తో మార్కెట్‌లోకి వచ్చేసిందోచ్!

Xiaomi Watch 5: 18 రోజులు బ్యాటరీ లైఫ్ ఇచ్చే షియోమి వాచ్ 5..  eSIM సపోర్ట్‌తో మార్కెట్‌లోకి వచ్చేసిందోచ్!
Advertisement

Xiaomi Watch 5: షియోమీ తన తాజా స్మార్ట్‌వాచ్ ‘షియోమి వాచ్ 5’ను చైనా మార్కెట్లో అధికారికంగా లాంచ్ చేసింది. ప్రీమియం డిజైన్‌తో పాటు అడ్వాన్స్‌డ్ హెల్త్ ఫీచర్లు, eSIM సపోర్ట్ వంటి కీలక అప్‌గ్రేడ్స్‌తో ఈ వాచ్‌ను తీసుకువచ్చింది. ముఖ్యంగా, స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ చేయకుండానే కాల్స్ చేసుకునే అవకాశం ఉండటం ఈ వాచ్‌ను ప్రత్యేకంగా నిలబెడుతోంది. ఈ వాచ్ పూర్తి విరాల్లోకి వెళితే..

ప్రీమియం డిజైన్:

ఈ షియోమి వాచ్ 5లో 1.54 అంగుళాల AMOLED డిస్‌ప్లేను అందించారు. ఈ స్క్రీన్ 60Hz రిఫ్రెష్ రేట్‌తో పాటు 1500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను సపోర్ట్ చేస్తుంది. సన్నని బెజెల్స్‌తో కూడిన 47mm స్టెయిన్‌లెస్ స్టీల్ డయల్ ఈ వాచ్‌కు ప్రీమియం లుక్‌ను ఇస్తుంది. అవుట్‌డోర్‌లో కూడా డిస్‌ప్లే క్లారిటీ బాగా కనిపించేలా డిజైన్ చేశారు.

 eSIM సపోర్ట్:

Advertisement

ఈ స్మార్ట్‌వాచ్‌లో 4nm టెక్నాలజీపై రూపొందించిన Snapdragon W5 wearable ప్రాసెసర్‌ను ఉపయోగించారు. eSIM సపోర్ట్ ఉండటంతో 4G నెట్‌వర్క్ ద్వారా నేరుగా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక స్మార్ట్‌ఫోన్ లేకుండానే కాల్స్ చేయడం, మెసేజ్‌లు రావడం వంటి సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. ఇది ECG, EMG సిగ్నల్ కంట్రోల్‌కు మద్దతు ఇవ్వడం మరో హైలైట్.

Also Read: ఎదురుచూపులకు తెర.. 100W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP ట్రిపుల్ కెమెరాలతో హువాయి నోవా 15 ఎంట్రీ!

హెల్త్ ఫీచర్లపై ప్రత్యేక దృష్టి:

Advertisement

హెల్త్ ట్రాకింగ్ విషయంలో Xiaomi Watch 5 చాలా అడ్వాన్స్‌డ్ ఫీచర్లను అందిస్తుంది. ఇందులో హృదయ స్పందన పర్యవేక్షణ, ECG విశ్లేషణ, SpO2 మానిటరింగ్, నిద్ర ట్రాకింగ్, ఒత్తిడి స్థాయి విశ్లేషణ, వన్-ట్యాప్ హెల్త్ స్కాన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ముఖ్యంగా EMG కండరాల సిగ్నల్ సెన్సార్‌ను అందించిన తొలి స్మార్ట్‌వాచ్‌గా ఇది గుర్తింపు పొందుతోంది.

150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్:

ఇక ఫిట్‌నెస్ లవర్స్ కోసం ఈ వాచ్‌లో ఇండోర్ జిమ్ యాక్టివిటీలతో పాటు 150కి పైగా స్పోర్ట్స్ మోడ్‌లు ఉన్నాయి. దీంతోపాటు ఆఫ్‌లైన్ మ్యాప్‌లు, రూట్ నావిగేషన్, డీవియేషన్ అలర్ట్స్, హైకింగ్‌కు అనుకూలమైన ట్రాక్-బేస్డ్ గైడెన్స్ వంటి ఫీచర్లను కూడా అందించారు. ఇది Xiaomi Hyper OS పై పనిచేస్తుంది. ఈ వాచ్‌ Super Xiao Ai వాయిస్ అసిస్టెంట్‌కు మద్దతు ఇస్తుంది.

18 రోజుల బ్యాటరీ లైఫ్:

పవర్ సేవింగ్ మోడ్‌లో ఈ Xiaomi Watch 5ను ఒక్కసారి చార్జ్ చేస్తే 18 రోజుల వరకు బ్యాటరీ లైఫ్ అందుతుందని కంపెనీ చెబుతోంది. ఇక ధర విషయానికి వస్తే.. స్టాండర్డ్ వేరియంట్ ధర సుమారు రూ.25,500 కాగా.. eSIM వేరియంట్ ధర రూ. 29,300. ఈ స్మార్ట్‌వాచ్‌ను షియోమీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

Also Read: 7000mAh బ్యాటరీతో ఐటెల్ విస్టా టాబ్.. 11 అంగుళాల FHD+ డిస్‌ప్లే, ఆధునిక ఫీచర్లు, ధర వివరాలిలా!

Related News

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

రెడ్‌మీ నోట్ 17కు రీబ్రాండెడ్‌గా Poco X8, M8 పవర్.. ఫీచర్లు, ధరల వివరాలు ఇవే!

ఇంటిని థియేటర్‌గా మార్చే బెస్ట్ బడ్జెట్ పోర్టబుల్ ప్రొజెక్టర్లు.. ధరలు కూడా బడ్జెట్‌లోనే!

Facebook వాడే ప్రతి ఒక్కరూ మార్చాల్సిన 5 సీక్రెట్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇవే!

iPhone 18 Pro Max లీక్స్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే, కానీ ఆ ఒక్కటే పెద్ద ట్విస్ట్!

గేమర్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న Oppo K15.. నీళ్లలో పడినా, రఫ్ అండ్ టఫ్ వాడినా తగ్గేదే లేదంట!

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

Big Stories

Advertisement
×