E-Paper
Advertisement

Xiaomi Door Lock: దొంగలను పట్టించే ఏఐ టెక్నాలజీ.. షావోమీ కొత్త డోర్ లాక్ వచ్చేసింది..

Xiaomi Door Lock: దొంగలను పట్టించే ఏఐ టెక్నాలజీ.. షావోమీ కొత్త డోర్ లాక్ వచ్చేసింది..
Advertisement

Xiaomi Smart Door Lock| చైనా టెక్ కంపెనీ షావోమీ ఏఐ టెక్నాలజీతో కొత్త స్మార్ట్ డోర్ లాక్ M40ని ఇటీవలే లాంచ్ చేసింది. దొంగలు ఇంట్లో ప్రవేశించకుండా టెక్నాలజీతో ఒక్క మీటరు దూరం నుంచే ప్రమాదాన్ని పసిగట్టేస్తుంది. దొంగలు వచ్చినా, లేదా ఎవరైనా డెలివరీ బాయ్ వచ్చినా లోపలి ఉన్నవారికి ముందే తెలిసిపోతుంది. అంటే మీ ఇల్లు ఎప్పుడూ సురక్షితంగా ఉంటుంది!

రెండు AI కెమెరాలతో 24 గంటలు మానిటరింగ్

షావోమి డోర్ లాక్‌లో ముందువైపు ప్యానల్‌లో 3MP ప్రధాన కెమెరా – 175 డిగ్రీ వైడ్ వ్యూ ఉంది. కిందివైపు 2MP కెమెరా ఉండగా.. 128 డిగ్రీ వ్యూ ఇస్తుంది. AI స్మార్ట్ గా మనిషిని, డెలివరీ బాయ్‌ ని, అనుమానస్పదంగా ఉండే కదలికల్ని ముందుగానే గుర్తిస్తుంది. రాత్రివేళ 6 ఇన్ఫ్రారెడ్ లైట్స్ తో స్పష్టంగా కనిపిస్తుంది.

Advertisement

తలుపు తెరవకుండానే బయట ఎవరో చూడొచ్చు. ఇది ఒకవిధంగా పాతకాలపు పీప్‌హోల్ ఇప్పుడు హైటెక్ గా మారింది. డోర్ లాక్‌లో పెద్ద 4.94 అంగుళాల డిస్‌ప్లే లోపల ఉంటుంది. బయట ఎవరు నిలబడ్డారో పూర్తి వ్యూలో ముందే కనిపిస్తుంది. చీకట్లో కూడా క్లియర్ గా కనిపిస్తుందిజ

ఫోన్ కి ఇన్‌స్టంట్ అలర్ట్ – వీడియో కాల్ కూడా చేయొచ్చు

ఎవరైనా ఎక్కువ సేపు నిలబడితే ఫోన్ కి నోటిఫికేషన్ వస్తుంది. వెంటనే వీడియో కాల్ చేసి మాట్లాడొచ్చు. HyperOS తో లైట్స్, ఏసీ, కారు స్క్రీన్ కి కనెక్ట్ అవుతుంది.

ఆటోమేటిక్ లాక్ – హ్యాకింగ్ అసాధ్యం

Advertisement

మీరు బయటకి వెళ్తే తలుపు ఆటోమేటిక్ గా లాక్ అవుతుంది. పవర్ పోయినా C-గ్రేడ్ మెకానికల్ కీ పనిచేస్తుంది. స్పెషల్ సేఫ్టీ చిప్ తో హ్యాకింగ్, ట్యాంపరింగ్ జరిగే అవకాశమే ఉండదు.

బలమైన బిల్డ్, పెద్ద బ్యాటరీ

ఈ డోర్ లాక్‌లో 8000mAh బ్యాటరీ – నెలల తరబడి నడుస్తుంది. -10°C టెంపరేచర్ నుంచి 55°C వరకు పనిచేస్తుంది. ఈ స్మార్ట్ డోర్ లాక్ బరువు కేవలం 5.18 కేజీలు. దీన్ని ఇన్‌స్టాల్ చేయడం చాలా సులువు. వర్షం, ఎండ, దుమ్ము ఎలాంటి వాతావరణం అయినా సమస్య ఏమీ ఉండదు.

12 రకాలుగా తెరుచుకునే డోర్ లాక్

  • ముఖం చూసి (ఫేస్ రికగ్నిషన్)
  • వేలిముద్ర (ఫింగర్ ప్రింట్)
  • పాస్‌వర్డ్, NFC కార్డ్, ఫిజికల్ కీ
  • ఫోన్ యాప్, బ్లూటూత్ తో కూడా ఓపెన్ అవుతుంది

ధర, ఎక్కడ కొనాలి?

ఈ లాక్ ప్రస్తుతానికి చైనాలో ధర 3,299 యువాన్ (సుమారు రూ.38,000) అందుబాటులో ఉంది. ఇండియాలో కూడా త్వరలోనే లాంచ్ అవుతుంది. షావోమీ అఫీషియల్ వెబ్‌సైట్, JD.com లో ఇప్పుడే కొనొచ్చు.

ఇంటి భద్రత కోసం ఈ స్మార్ట్‌డోర్ లాక్ 2025 లో బెస్ట్ ఆప్షన్. దొంగలకి షాక్ ఇవ్వాలంటే షావోమీ M40 త్వరగా ఇన్‌స్టాల్ చేయించుకోండి!

Also Read:  గూగుల్ కొత్త టివి రిమోట్.. బ్యాటరీలు అవసరం లేదు, జీవితకాలం చార్జింగ్‌లోనే ఉంటుంది

Related News

ట్రాయ్ దెబ్బకు దిగొచ్చిన Airtel.. కేవలం కాల్స్, ఎస్‌ఎంఎస్‌ల కోసం కొత్త రీఛార్జ్ ప్లాన్లు!

పిక్సెల్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే న్యూస్.. దీపావళి సేల్‌లో భారీ తగ్గింపులు, నవంబర్ 8 వరకే ఛాన్స్!

ఫ్లిప్‌కార్ట్‌లో iPhone 17పై ఊహించని భారీ తగ్గింపు.. ఇంత తక్కువ ధరకు ఎప్పుడూ చూడలేదు!

వెదర్ రిపోర్ట్స్ ఇకపై వంద శాతం పక్కా.. మైక్రోసాఫ్ట్ సంచలన ప్రయోగం!

ఆకాశంలో ఓ అరుదైన నక్షత్రాన్ని కనిపెట్టిన సైంటిస్టులు.. ఇది ఎరంగులో ఉందంటే..?

సెకండ్ హ్యాండ్ మొబైల్ కొంటున్నారా? మోసపోకూడదంటే ఈ 5 విషయాలు కచ్చితంగా చెక్ చేయండి!

ఓటీపీ షేర్ చేసి పొరపాటు చేశారా? మీ డబ్బు కాపాడుకోవడానికి.. వెంటనే ఈ 5 పనులు చేయండి!

స్మార్ట్‌వాచ్‌ vs ఫిట్‌నెస్ బ్యాండ్.. రెండింటిలో ఫీచర్లు ఒకటేనా? ఏది కొంటే మన డబ్బులు వృధా కావు?

Big Stories

Advertisement
×