E-Paper
Advertisement

Spotify Smart Glasses: మ్యూజిక్ లవర్స్ కోసం కొత్త స్మార్ట్‌గ్లాసెస్.. త్వరలోనే లాంచ్ చేయనున్న స్పాటిఫై

Spotify Smart Glasses: మ్యూజిక్ లవర్స్ కోసం కొత్త స్మార్ట్‌గ్లాసెస్.. త్వరలోనే లాంచ్ చేయనున్న స్పాటిఫై
Advertisement

Spotify Smart Glasses| ప్రముఖ మ్యూజిక్ స్ట్రీమింగ్ యాప్ స్పాటిఫై, త్వరలోనే XR స్మార్ట్ గ్లాసెస్ విడుదల చేయనుంది. గూగుల్, శాంసంగ్ వంటి కంపెనీలు ఇప్పటికే స్మార్ట్ గ్లాసెస్ రంగంలో అడుగుపెట్టాయి. అయితే స్పాటిఫై స్మార్ట్ గ్లాసెస్ మ్యూజిక్ లవర్స్‌ కోసం ప్రత్యేకం. ఇటీవల ఓ లీక్ ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

లీక్‌లో వెల్లడైన కీలక విషయాలు

ఆండ్రాయిడ్ అథారిటీ రిపోర్ట్ ప్రకారం.. స్పాటిఫై బీటా యాప్ కోడ్‌లో ఉన్న కొన్ని విషయాలు బయటపడ్డాయి. ఈ కోడ్ XR గ్లాసెస్ సపోర్ట్ చేస్తున్నట్లు సూచిస్తోంది. త్వరలోనే యూజర్లు తమ స్మార్ట్ గ్లాసెస్ స్క్రీన్‌పై నేరుగా ‘ఇప్పుడు ప్లే అవుతున్న పాట’ (Now Playing) చూడొచ్చు. దీనివల్ల ఫోన్ తీయాల్సిన అవసరం లేకుండా, మరింత సౌకర్యవంతంగా పాటలను కంట్రోల్ చేయవచ్చు.

స్మార్ట్ గ్లాసెస్‌లో పాటల లిరిక్స్ కూడా!

Advertisement

స్మార్ట్‌గ్లాసెస్‌లో ఒక సరికొత్త ఫీచర్ కూడా ఉంది. ఈ ఫీచర్‌లో పాటల లిరిక్స్ కూడా XR గ్లాసెస్‌లో చూసే అవకాశం ఉంది. దీంతో యూజర్లు పాట వింటూనే అందులోని సాహిత్యాన్ని చదివే అవకాశం ఉంది. అప్పుడే సులువుగా పాట పాడేసుకోవచ్చు. దీంతో ఫోన్ స్క్రీన్‌పై ఆధారపడడం తగ్గుతుంది. అంతే కాకుండా, వినికిడి లోపం ఉన్నవారికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీనివల్ల మ్యూజిక్ ఎక్స్‌పీరియన్స్‌లో మరింత లీనమయ్యేలా మారుతుంది.

స్మార్ట్‌ఫోన్‌తో గ్లాసెస్ ఎలా కనెక్ట్ చేయాలి?

గూగుల్ రిపోర్ట్ ప్రకారం.. XR యాప్‌లు నేరుగా స్మార్ట్ గ్లాసెస్‌లో రన్ కావు. అవి యూజర్ల స్మార్ట్‌ఫోన్‌లోనే పనిచేస్తాయి. గ్లాసెస్ కేవలం ఆ స్క్రీన్‌ని మన కళ్ల ముందు ప్రదర్శించే డిస్ప్లేగా మాత్రమే పనిచేస్తాయి. అంటే ఈ ఫీచర్‌ని వాడాలంటే ఫోన్ దగ్గర్లో ఉండాల్సిందే.

AI స్మార్ట్ గ్లాసెస్ ట్రెండ్

Advertisement

ఈ రోజుల్లో వచ్చే స్మార్ట్ గ్లాసెస్ AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)తో మరింత అడ్వాన్స్‌గా మారుతున్నాయి. మెటా కంపెనీ ఇప్పటికే AI పవర్డ్ గ్లాసెస్‌ని ప్రవేశపెట్టింది. ఏఐ గ్లాసెస్ స్పాటిఫై‌తో మెర్జ్ (విలీనం) అయి ఉండడంతో.. “ప్లే మ్యూజిక్” అని చెప్పగానే వాయిస్ కమాండ్లతో పాటలు ప్లే అవుతాయి.

చుట్టూ ఉన్న వాతావరణానికి తగినట్లు పాటల సూచన

మెటా గ్లాసెస్‌లో మరో ప్రత్యేకత ఉంది. అవి యూజర్ చుట్టూ ఉన్న వాతావరణాన్ని నిజ సమయంలో (real-time) విశ్లేషించి, యూజర్ మూడ్‌ అనుగుణంగా పాటలు సూచిస్తాయి. ఇది సాధారణంగా మన స్పాటిఫై హిస్టరీ ఆధారంగా పాటలు సూచించే పద్ధతికి భిన్నంగా, మరింత ప్రైవేట్ ఎక్స్‌పీరియన్స్‌ని కల్పిస్తుంది.

యూజర్ల కోసం బెనిఫిట్స్

స్పాటిఫై XR గ్లాసెస్‌లో.. యూజర్లు తమ ఫోన్ ముట్టుకోకుండానే మ్యూజిక్ ఎంజాయ్ చేయవచ్చు. పాట వివరాలు, సాహిత్యం కళ్లముందే కనిపిస్తాయి. ఇది సంగీతాన్ని వినడాన్ని మరింత సులభతరం చేస్తుంది.

Also Read: ఏఐతో డబ్బు సంపాదించడం ఎలా? సింపుల్ టిప్స్ ఇవిగో

ప్లాట్‌ఫామ్‌గా స్మార్ట్‌గ్లాసెస్

స్పాటిఫై అధికారికంగా ఈ ఫీచర్లను ప్రకటించకపోయినా, లీక్ అయిన సమాచారం ప్రకారం ఈ ఫీచర్లపై టెస్టింగ్ జరుగుతోంది. సమీప భవిష్యత్తులో రోజుల్లో స్మార్ట్ గ్లాసెస్ ఒక ముఖ్యమైన ప్లాట్‌ఫామ్‌గా మారవచ్చు.

స్పాటిఫై XR స్మార్ట్ గ్లాసెస్ ఇంటిగ్రేషన్‌తో మ్యూజిక్ ఎక్స్‌పీరియన్స్ పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. AI, XR టెక్నాలజీలతో సంగీతం మరింత లీనమై ఎంజాయ్ చేయొచ్చు.

Related News

వేగంగా కదులుతోన్న ఆస్ట్రేలియా ఖండం.. ఆసియాలోని ఆ దేశాలను ఢీకొట్టనుందా?

ఈ మ్యూజిక్ బీట్స్ చూస్తే.. మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే!

పాకెట్ ఫ్రెండ్లీ ప్రైస్‌లో.. డైనమిక్ థండర్ సౌండ్!

కొత్త మోడల్ వచ్చేలోపే శాంసంగ్ మాస్టర్ ప్లాన్.. బెస్ట్ AI ఫోన్‌పై ఊహించని డిస్కౌంట్!

భారీ బ్యాటరీ, అల్టిమేట్ లుక్.. మార్కెట్‌ను షేక్ చేయడానికి Redmi 17 5G వచ్చేసింది!

రూ.15,799లకే 43ఇంచుల టీవీ..ఆఫర్ అంటే ఇలా ఉండాలి

చైనా ఫోన్లకు చెక్ పెడుతూ.. హైదరాబాద్‌లోనే తయారైన తొలి Mivi 5G ఫోన్ వచ్చేస్తోంది!

రూ.వెయ్యిలోపు బెస్ట్ గేమింగ్ ఇయర్ బడ్స్..వెంటనే కొనేయండి

Big Stories

Advertisement
×