E-Paper
Advertisement

Telangana Assembly session 2026: తెలంగాణ అసెంబ్లీలో మూసీ మంటలు.. బీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్య

Telangana Assembly session 2026: తెలంగాణ అసెంబ్లీలో మూసీ మంటలు.. బీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్య
Advertisement

Telangana Assembly session 2026: గ్రేటర్ హైదరాబాద్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూసీ సుందరీకరణకు సంబంధించి తెలంగాణలో అసెంబ్లీలో వాడి వేడీగా చిన్నపాటి చర్చ జరిగింది. ఈ విషయంలో బీఆర్ఎస్ సభ్యులు లేవనెత్తిన అంశాలపై ధీటుగా బదులిచ్చింది అధికార పార్టీ. ముఖ్యంగా నిధుల విషయంలో పలు అంశాలను లేవనెత్తింది బీఆర్ఎస్.

తెలంగాణ అసెంబ్లీలో మూసీ ప్రాజెక్టుపై మంటలు

Advertisement

తెలంగాణ అసెంబ్లీలో మూడో రోజు మూసీ సుందరీకరణ ప్రాజెక్టు నిధులపై హాట్ హాట్ చర్చ జరిగింది. దీనిపై బీఆర్ఎస్ మాజీ మంత్రి కేసీఆర్ మూడు ప్రశ్నలు ప్రభుత్వానికి సంధించారు. ఈ ఏడాది జనవరిలో మూసీ సుందరీకరణకు సంబంధించి సభలో మంత్రి చెప్పిన మాటలను ప్రస్తావిస్తూ పలు ప్రశ్నలు రైజ్ చేశారు బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్.

డీపీఆర్ ప్రిపరేషన్‌కు సంబంధించి మెయిన్ హార్ట్ కంపెనీకి ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఆ కంపెనీని వివిధ దేశాల్లో నిషేధించారని, అలాంటి కంపెనీకి ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. డీపీఆర్ ప్రిపరేషన్ కు 18 నెలలు పడుతుందని జనవరిలో మంత్రి చెప్పారని వివరించారు. అది నిజమే అయితే.. అకస్మాత్తుగా డీపీఆర్ ఎక్కడి నుంచి వచ్చిందన్నారు. దాన్ని సభ ముందు పెట్టాలని డిమాండ్ చేశారు.

Advertisement

మూసీ ప్రాజెక్టు కోసం ఏషియన్ బ్యాంక్ డెవలప్‌మెంట్-ఏడీబీ రుణం మంజూరు చేసినట్టు అప్పట్లో చెప్పారని అన్నారు. ఎంఆర్‌డీసీఎల్ సంస్థ డీపీఆర్ సబ్మిట్ చేయలేదని, ఏడీబీ రుణం మంజూరు చేయలేదని సమాధానం ఇచ్చిందన్నారు. ఈ సంస్థ మీద ఎందుకంత ప్రేమ తెలియడం లేదన్నారు.

పలు ప్రశ్నలు లేవనెత్తిన కేటీఆర్.. ధీటుగా బదులిచ్చిన మంత్రి శ్రీధర్‌బాబు 

16 వేల కోట్లతో ఖర్చయ్యే మూసీ సుందరీకరణ ప్రాజెక్టుకు లక్షన్నర కోట్లని సీఎం ప్రకటన చేశారన్నారు గుర్తు చేశారు. మొదటి ఫేస్ తర్వాత ఇంకా ఎన్ని ఫేజ్ లుంటాయని లేవనెత్తారు. దీనికి సంబంధించి ఆస్తులను ఏ విధంగా తీసుకుంటారు? ఎంతమంది ఇళ్లు కూల్చుతారు? వాటి కోసం లక్షన్నర కోట్లు ఎక్కడ ఖర్చు చేయనున్నారని ప్రశ్నించారు.

మూసీ సుందరీకరణ ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ సభ్యులు లేవనెత్తిన పలు ప్రశ్నలకు రిప్లై ఇచ్చారు మంత్రి శ్రీధర్‌బాబు. మూసీ నదికి ఇరువైపులా 50 మీటర్ల బఫర్ జోన్‌కు సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను తాము కంటిన్యూ చేస్తున్నామని అన్నారు.

ఏడీబీకి సంబంధించిన అప్రూవర్ లెటర్ రానున్న బోర్డు మీటింగ్‌లో వస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు. టెక్నికల్ విషయాలను సభలో ప్రస్తావిస్తున్నారని అన్నారు. ఏడీబీ కాకుండా వేరే సంస్థ ద్వారా ముందుకు వెళ్తామన్నారు. కచ్చితంగా మూసీ సుందరీకరణ చేపట్టాలని ముందుకు వెళ్తున్నట్లు చెప్పుకొచ్చారు.

ALSO READ: తెలంగాణలో పర్యాటకులకు గుడ్ న్యూస్.. ఇక హరిత హోటల్స్‌లో మందు కిక్కు..!

డీపీఆర్‌కు సంబంధించి ఆ సంస్థ గతేడాది పని మొదలు పెట్టిందని, ఈ ఏడాది ఫిబ్రవరిలో సమర్పించిందన్నారు. నిధుల కోసం ప్రతిపాదన పంపామని, ప్రాథమికంగా ఓకే చేసిన తర్వాత పరిశీలిస్తామని తెలిపారు. మెయిన్ హార్ట్ అనే సంస్థ దేశంలో అనేక ప్రాజెక్టులు చేపట్టిందన్నారు. ఇతర దేశాల్లో కూడా పలు ప్రాజెక్టులు చేపట్టిన విషయాన్ని ఈ సందర్భగా గుర్తు చేశారు.

గ్రేటర్ హైదరాబాద్ కు సంబంధించి 32 ఎస్టీపీలకు ప్రతిపాదన బీఆర్ఎస్ చేసిందన్నారు. 20 వరకు పరిమితం చేసి పనులు మొదలు పెట్టారన్నారు. అందులో 20 శాతం పనులు మాత్రమే అయ్యాయని అన్నారు. తాము రికార్డుల్లో ఉన్నది మాత్రమే చెబుతున్నామని మంత్రి అన్నారు.

 

Related News

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

మేడ్చల్‌లో పార్కింగ్ రగడ కలకలం.. హెచ్చరికలు జారీ చేసిన సీఐ క్రాంతి కుమార్!

తెలంగాణలో కొత్త పింఛన్‌‌దారులకు బిగ్ రిలీఫ్.. ఆ విషయంపై క్లారిటీ!

కాంగ్రెస్‌కు కొండా‌ గుడ్‌బై? త్వరలో భారీ అప్‌డేట్ అంటూ పోస్ట్, వాస్తవం ఏమిటంటే?

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

Big Stories

Advertisement
×