E-Paper
Advertisement

YouTube Premium vs Premium Lite: యుట్యూబ్‌లో యాడ్స్ లేకుండా ఏ ప్లాన్ తీసుకుంటే బెటర్.. రెండింటి మధ్య తేడా ఇదే

YouTube Premium vs Premium Lite: యుట్యూబ్‌లో యాడ్స్ లేకుండా ఏ ప్లాన్ తీసుకుంటే బెటర్.. రెండింటి మధ్య తేడా ఇదే
Advertisement

YouTube Premium vs Premium Lite| ప్రపంచవ్యాప్తంగా కోట్ల సంఖ్యలో యూజర్లు ప్రతిరోజు యుట్యూబ్‌లో వీడియోలు చూస్తుంటారు. కానీ మధ్యలో వచ్చే యాడ్స్ చాలా ఇబ్బంది కలిగిస్తాయి. ఈ సమస్యకు పరిష్కారంగా యుట్యూబ్ రెండు పెయిడ్ ప్లాన్లు ఆఫర్ చేస్తోంది. యుట్యూబ్ ప్రిమియం, యుట్యూబ్ ప్రిమియం లైట్. రెండూ యాడ్స్ తగ్గిస్తాయి కానీ ఫీచర్లు, ధరలు భిన్నంగా ఉంటాయి.

యుట్యూబ్ ప్రీమియం ఫీచర్లు ఇవే

యుట్యూబ్ ప్రీమియం అనేది పూర్తి స్థాయి సబ్‌స్క్రిప్షన్. ఈ ప్లాన్ తీసుకుంటే దాదాపు అన్ని వీడియోలు పూర్తిగా యాడ్-ఫ్రీగా చూడవచ్చు. అంటే ఎలాంటి యాడ్స్ రావు. YouTube Music Premium కూడా ఉచితంగా వస్తుంది. యాడ్స్ లేకుండా పాటలు ప్రశాంతంగా వినవచ్చు. బ్యాక్‌గ్రౌండ్ ప్లేబ్యాక్ ఫీచర్ కూడా ఉంది. స్క్రీన్ ఆఫ్ చేసినా వీడియో లేదా మ్యూజిక్ ప్లే అవుతూనే ఉంటుంది. ఆఫ్‌లైన్ డౌన్‌లోడ్ సౌలభ్యం కూడా ఉంది. ఇంటర్నెట్ లేకుండా తర్వాత చూడవచ్చు. పిక్చర్-ఇన్-పిక్చర్ మోడ్‌తో ఇతర యాప్స్ ఉపయోగిస్తున్నప్పుడు చిన్న విండోలో వీడియో చూడవచ్చు. ఆడియో క్వాలిటీ 256 kbps వరకు ఉంటుంది. కొత్త ఎక్స్‌పెరిమెంటల్ ఫీచర్లు ముందుగా వస్తాయి.

యుట్యూబ్ ప్రీమియం లైట్ ఫీచర్లు

Advertisement

యుట్యూబ్ ప్రీమియం అనేది చౌకైన ఆప్షన్. దీని ప్రధాన లక్ష్యం యాడ్స్ తగ్గించడం. సాధారణ వీడియోలు యాడ్-ఫ్రీగా చూడవచ్చు. కానీ మ్యూజిక్ వీడియోలు, సాంగ్ కవర్లు, డాన్స్ వీడియోలు, ఎంటర్‌టైన్‌మెంట్ కంటెంట్‌లో కొన్ని యాడ్స్ రావచ్చు. యుట్యూబ్ షార్ట్స్‌లో కూడా యాడ్స్ ఉండవచ్చు. బ్రౌజింగ్, సెర్చ్ చేసేటప్పుడు కొన్ని ప్రకటనలు కనిపిస్తాయి. ఇటీవల అప్‌డేట్‌తో ఆఫ్‌లైన్ డౌన్‌లోడ్, బ్యాక్‌గ్రౌండ్ ప్లేబ్యాక్ జోడించారు. కానీ ఇందులో యుట్యూబ్ మ్యూజిక్ ప్రీమియం బెనిఫిట్ ఉండదు. మ్యూజిక్ యాప్‌లో యాడ్స్ ఉంటాయి. బడ్జెట్‌లో తక్కువ యాడ్స్ కావాలనుకునే వారికి ఇది మంచి ఆప్షన్.

రెండు ప్లాన్ల ధరలు ఎంత?

భారత్‌లో యుట్యూబ్ ప్రీమియం నెలకు రూ.159. సంవత్సరానికి రూ.1,490 చెల్లిస్తే కొంత సేవింగ్స్ పొందవచ్చు. ప్రీమియం లైట్ నెలకు రూ.89 మాత్రమే. ఇది చాలా చౌక. కానీ ఏడాది వాలిడిటీ ప్లాన్ ఇప్పటికీ లేదు. నెలవారీగానే చెల్లించాలి.

Advertisement

Also Read: మీ ఫోన్‌లో ఈ యాప్స్ ఉంటే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్.. ఇల్లు, ఆఫీస్ రెండింటికీ ఉపయోగకరం

ఏ ప్లాన్ ఎంచుకోవాలి?

మీరు ఎలా యుట్యూబ్ ఉపయోగిస్తారనేది ఆధారంగా ఎంచుకోవాలి. రోజూ ఎక్కువ వీడియోలు, మ్యూజిక్ చూసేవారు, పూర్తి యాడ్-ఫ్రీ ఎక్స్‌పీరియన్స్ కావాలనుకునేవారు ప్రీమియం ప్లాన్ తీసుకోవడం మంచిది. మ్యూజిక్ లవర్స్‌కు ఇది బెస్ట్. కానీ బడ్జెట్ తక్కువ ఉంటే, చాలా వీడియోలు యాడ్-ఫ్రీగా చూడాలనుకుంటే Premium Lite సరిపోతుంది. కొన్ని యాడ్స్ వచ్చినా సమస్య లేనివారికి ఇది చాలా విలువైనది. మీ అవసరాలు, బడ్జెట్ బట్టి సరైన ప్లాన్ ఎంచుకోండి.

Related News

ఈ సీక్రెట్ ట్రిక్స్ తెలిస్తే.. రోజంతా ఏసీ, ఫ్రిజ్ వాడినా కరెంట్ బిల్లు సగమే!

ట్రెండింగ్ vs యూజ్‌ఫుల్.. గ్యాడ్జెట్స్ కొనేముందు ఈ క్లారిటీ లేకపోతే డబ్బులు వేస్టే!

ఫోన్ ధర రూ.1.68 లక్షలు.. అయినా తగ్గదేలే అంటున్న జనాలు, iPhone Duoలో అంతలా ఏముంది?

చేతిలో ఇమిడిపోయే ప్రింటర్‌ తెచ్చిన షావోమీ.. దీని స్మార్ట్ ఫీచర్లు చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే!

మన మాటల్ని సీక్రెట్‌గా రికార్డ్ చేసే AI డివైజ్‌లు.. అమెజాన్ కొత్త ప్రయోగం ఇదే!

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా క్రెడిట్ కార్డ్ పాయింట్లను క్యాష్‌గా మార్చడం ఎలా?

నకిలీ QR కోడ్‌లను స్కాన్ చేసే ముందే ఇలా కనిపెట్టండి.. ఈ చిన్న ట్రిక్ తెలిస్తే మీ డబ్బు సేఫ్!

గూగుల్ ప్లేస్టోర్‌లో ఫేక్ వాట్సప్ యాప్.. అసలైనదో కాదో ఎలా గుర్తించాలి?

Big Stories

Advertisement
×