Liam Livingstone: సాధారణంగా క్రికెట్ లో ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు. ఎటువంటి అనుభవం లేని బౌలర్ చేతిలో ఓ సీనియర్ బ్యాటర్ వికెట్ కోల్పోవడం.. ఎంతటి సీనియర్ బౌలర్ అయినా పెద్ద ఎత్తున పరుగులు సమర్పించుకోవడం క్రికెట్ లో సర్వసాధారణం. సరిగ్గా ఇలాంటి సంఘటనే ది హండ్రెడ్ లీగ్ లో చోటుచేసుకుంది. ప్రస్తుతం జరుగుతున్న “ది హండ్రెడ్ లీగ్” ఆసక్తికరంగా సాగుతోంది. ఈ టోర్నీలో ఆగస్టు 12న ఓవల్ ఇన్విన్సిబుల్స్ – బర్మింగ్ హమ్ ఫీనిక్స్ జట్ల మధ్య ఆసక్తికర పోరు జరిగింది.
ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ విధ్వంసకర బ్యాటర్ లియామ్ లివింగ్ స్టోన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఈ లీగ్ లో బర్మింగ్ హమ్ ఫినిక్స్ కి ప్రతినిత్యం వహిస్తున్న లివింగ్ స్టోన్.. ఓవల్ ఇన్విన్సీబుల్స్ తో జరిగిన మ్యాచ్ లో విధ్వంసం సృష్టించాడు. కేవలం 27 బంతుల్లోనే 7 ఫోర్లు, ఐదు సిక్సుల సాయంతో 69 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచి తన జట్టును గెలిపించాడు. ఓవల్ ఇన్విన్సిబుల్స్ బౌలర్ రషీద్ ఖాన్ పై విచక్షణారాహిత్యంగా విరుచుకుపడ్డాడు. ఒకే ఓవర్ లో వరుసగా 5 బంతుల్లో 26 పరుగులు బాదాడు.
రషీద్ ఖాన్ వేసిన ఓవర్ లో వరుసగా 5 బంతుల్లో 4,6,6,6,4 తో ఊచకోత కోశాడు. ఈ మ్యాచ్ లో తన కోట 20 బంతులు వేసిన రషీద్ ఖాన్.. ఏకంగా 59 పరుగులు సమర్పించుకున్నాడు. ఇప్పటివరకు 100 లీగ్ లో ఇదే అత్యంత ఖరీదైన స్పెల్. దీనికంటే ముందు రషీద్ ఖాన్ టి-20 గణాంకాలు 2018 ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ పై నాలుగు ఓవర్లలో 55 పరుగులు నమోదయ్యాయి. ఇక తాజాగా రషీద్ ఖాన్ నమోదు చేసిన ఈ చెత్త స్పెల్ మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాయి. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఓవల్ ఇన్వెన్సీబుల్స్ 100 బంతుల్లో 8 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. ఓవల్ ఇన్విన్సిబుల్స్ బ్యాటర్లలో జోర్ధన్ కాక్స్ {44}, సామ్ కరణ్ {14}, బిల్లింగ్స్ {17}, డోనోవన్ ఫెర్రేయిర {63}, రషీద్ ఖాన్ {16} పరుగులు చేశారు. ఇక బర్మింగ్ హమ్ బౌలర్లలో బౌల్ట్ 2, మిల్నే 2, హోవెల్ 2, లివింగ్ స్టోన్, మౌస్లేయ్ చెరో వికెట్ పడగొట్టారు.
Also Read: Priya Saroj: రింకూ సింగ్ కు కాబోయే భార్య ఢిల్లీ గడ్డపై ఎలా రెచ్చిపోయిందో చూడండి
అనంతరం 181 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బర్మింగ్ హమ్.. 98 బంతుల్లోనే ఆరు వికెట్ల నష్టానికి లక్ష్యాన్ని చేదించింది. బర్మింగ్ హమ్ బ్యాటర్లలో స్మీద్ {51}, క్లర్క్ {27}, లివింగ్ స్టోన్ {69}, మౌస్లేయ్ {11} పరుగులు చేశారు. అయితే చివరి 25 బంతుల్లో 61 పరుగులు చేయాల్సిన తరుణంలో లివింగ్ స్టోన్ విధ్వంసం సృష్టించడంతో.. మ్యాచ్ ఒక్కసారిగా ఫీనిక్స్ వైపు తిరిగింది. చివరి ఓవర్ ఐదు బంతుల్లో.. తొలి రెండు బంతులకు వికెట్లు కోల్పోయినా.. బెన్నీ హోవెల్ బౌండరీ బాధి ఫీనిక్స్ ని విజయతీరాలకు చేర్చాడు. దీంతో ఆ జట్టు నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది.
4,6,6,6,4 BY LIAM LIVINGSTONE AGAINST RASHID KHAN 🥶
– 26 runs from just 5 balls by the Captain. pic.twitter.com/DioUvlipWk
— Johns. (@CricCrazyJohns) August 13, 2025