BigTV English

Women’s ODI World Cup : మహిళల ప్రపంచ కప్ లో కూడా ఆస్ట్రేలియా డామినేట్.. ఈ లెక్కలు చూస్తే వణుకు పుట్టాల్సిందే

Women’s ODI World Cup : మహిళల ప్రపంచ కప్ లో కూడా ఆస్ట్రేలియా డామినేట్.. ఈ లెక్కలు చూస్తే వణుకు పుట్టాల్సిందే

Women’s ODI World Cup : సాధారణంగా క్రికెట్ లో వరల్డ్ కప్ అంటే ఉండే ఆ క్రేజే వేరు. ప్రతీ ఐదేళ్లకొకసారి వరల్డ్ కప్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే పురుషులు ఆడే క్రికెట్ కి క్రేజ్ కాస్త ఎక్కువగా ఉంటుంది. అయితే పురుషుల కంటే ముందే తొలిసారిగా 1973లో మహిళల వన్డే క్రికెట్ వరల్డ్ కప్ ప్రారంభం అయిందని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. తొలి ప్రపంచ కప్ లో 7 జట్లు పాల్గొన్నాయి. ఇంగ్లాండ్ జట్టు ఆతిథ్యం ఇచ్చింది. 1973లో జరిగిన వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు ప్రత్యర్థి ఆస్ట్రేలియా జట్టును ఓడించి తొలి ఐసీసీ మహిళా క్రికెట్ ప్రపంచ కప్ టైటిల్ ను కైవసం చేసుకుంది. ఇప్పటివరకు జరిగిన 12 ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ ఎడిషన్లలో ఆస్ట్రేలియా జట్టు 7 సార్లు టైటిళ్లతో విజయం సాధించింది. ఇక ఇంగ్లాండ్ జట్టు నాలుగు ట్రోఫీలతో టాప్ 2 జట్టుగా కొనసాగుతోంది.


Also Read : Kashish Kapoor : ఒక నైట్ కు వస్తావా? అని అడిగాడు… టీమిండియా క్రికెటర్ పై హాట్ బ్యూటీ సంచలన ఆరోపణలు!

7 సార్లు విజేతగా ఆస్ట్రేలియా 


అయితే ఉమెన్స్ టీమిండియా ఇప్పటివరకు వన్డే వరల్డ్ కప్, టీ-20 వరల్డ్ కప్ సాధించలేదు. ఆస్ట్రేలియా జట్టు మాత్రం అత్యధికంగా 7 సార్లు విజేతగా నిలవడం విశేషం. ఆస్ట్రేలియా ఉమెన్స్ జట్టు 1978, 1982, 1988, 1997, 2005, 2013, 2022లో ఆస్ట్రేలియా జట్టు వరల్డ్ కప్ లో విజయం సాధించింది. ఇక ఇంగ్లాండ్ జట్టు నాలుగు సార్లు విజేతగా నిలిచింది. వాటిలో తొలిసారి 1973 కాగా.. ఆ తరువాత 20 సంవత్సరాలకు రెండోసారి 1993లో వన్డే వరల్డ్ కప్ లో విజయం సాధించింది ఇంగ్లాండ్. మళ్లీ 16 సంవత్సరాల తరువాత 2009, 2017 సంవత్సరాల్లో ఉమెన్స్ వరల్డ్ కప్ గెలిచింది ఇంగ్లాండ్. మహిళల క్రికెట్ ప్రపంచ కప్ చరిత్రల ఆస్ట్రేలియా 7 సార్లు, ఇంగ్లాండ్ 4 సార్లు విజేతలుగా నిలిస్తే.. న్యూజిలాండ్ జట్టు కేవలం 2000లో మాత్రం ఆతిథ్య జట్టుగా టైటిల్ గెలుచుకుంది. అయితే న్యూజిలాండ్ జట్టు మాత్రం మూడుసార్లు రన్నరప్ గా నిలవడం విశేషం. 1993, 1997, 2009 మూడుసార్లు కివీస్ రన్నరప్ గా నిలిచింది.

అప్పట్లో 60 ఓవర్ల మ్యాచ్.. 

1978లో తప్ప 1973 నుంచి 1993 వరకు జరిగిన అన్ని మ్యాచ్ ల్లో 60 ఓవర్ల మ్యాచ్ లు జరిగాయి. 1997 నుంచి 50 ఓవర్ల ఫార్మాట్ ను అనుసరించారు. 1997 నుంచి నాకౌట్ మ్యాచ్ లు కూడా ప్రవేశపెట్టబడ్డాయి. ఈ టోర్నమెంట్ ఫార్మాట్ సంవత్సరాలుగా అనేకసార్లు మారిపోయింది. ఇక భారత మహిళా క్రికెట్ జట్టు 1978లో మొదటిసారిగా మహిళా క్రికెట్ ప్రపంచ కప్ ను ప్రారంభించింది. కానీ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలవకపోవడం గమనార్హం. 1978లో భారత్ తొలిసారిగా ఆతిథ్యం ఇచ్చింది. ఉమెన్స్ వరల్డ్ కప్ లో  భారత్ రెండుసార్లు ఫైనల్ కి చేరుకుంది. 2005లో ఆస్ట్రేలియా, 2017లో ఇంగ్లాండ్ చేతిలో ఓటమి పాలైంది. 2005లో ఆస్ట్రేలియా చేతిలో 98 పరుగుల తేడాతో ఓడిపోగా.. 2017లో ఇంగ్లాండ్ పై కేవలం 9 పరుగుల తేడాతోనే టైటిల్ ను చేజార్చుకుంది భారత మహిళల జట్టు. 12 వరల్డ్ కప్ లలో 5 వేర్వేరు దేశాలు నిర్వహించగా.. భారత్, ఇంగ్లాండ్ జట్లు మాత్రం మూడు సార్లు నిర్వహించాయి. ఈసారి భారత్ ఆతిథ్య దేశం కావడంతో ఎక్కువ సార్లు నిర్వహించిన దేశంగా భారత్ రికార్డు నెలకొల్పనుంది. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా వంటి దేశాలు ఇతర ఆతిథ్య దేశాలుగా ఉన్నాయి. ఈ ఏడాది శ్రీలంక, భారత్ కలిసి ఆతిథ్యం నిర్వహించడం విశేషం.

Related News

Kashish Kapoor : ఒక నైట్ కు వస్తావా? అని అడిగాడు… టీమిండియా క్రికెటర్ పై హాట్ బ్యూటీ సంచలన ఆరోపణలు!

Women’s World Cup 2025 : చిన్నస్వామిలో మ్యాచ్ లు బ్యాన్.. తిరువనంతపురంకు షిఫ్ట్.. షాక్ లో RCB!

Kohli Beard : కోహ్లీకి తెల్ల గడ్డం… దారుణంగా ట్రోలింగ్ చేస్తున్న అనుష్క శర్మ !

Salman Khan IPL Team RCB : జట్టును కొనబోతున్న కండల వీరుడు సల్మాన్ ఖాన్?

Dewald Brevis : డెవాల్డ్ బ్రెవిస్ ఊచకోత.. ఏకంగా 8 సిక్స్ లతో రచ్చ..CSK ఇక తిరుగులేదు

Big Stories

×