Priya Saroj: బీహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ {SIR} తో పాటు దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాలో అక్రమాలు, ఓట్ల చోరీ, గత లోక్ సభ ఎన్నికల్లో రిగ్గింగ్ పై విపక్ష ఇండియా కూటమి పోరుబాట పట్టిన విషయం తెలిసిందే. ఓట్ల చోరీని వెంటనే ఆపాలని డిమాండ్ చేస్తూ లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ సహా ప్రతిపక్ష ఎంపీలు సోమవారం దేశ రాజధాని ఢిల్లీలో ఫ్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శిస్తూ భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు.
Also Read: Poonam Kaur – Siraj: టాలీవుడ్ హాట్ బ్యూటీతో మహమ్మద్ సిరాజ్… బిజెపిలోకి వెళ్తున్నాడా ?
సోమవారం ఉదయం ప్రతిపక్షం పార్లమెంట్ నుండి ఎన్నికల సంఘం కార్యాలయం వరకు పాదయాత్ర చేపట్టింది. అయితే ఇండియా కూటమి ఎంపీలను పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు. ఈ క్రమంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ర్యాలీకి అనుమతి లేదని పిటిఐ భవన్ ఎదుట పోలీసులు ఏర్పాటు చేసిన భారీకేడ్లను పక్కకు తొలగించేందుకు ఎంపీలు ప్రయత్నించారు. అనంతరం కేవలం 30 మందిని మాత్రమే అనుమతిస్తానని పోలీసులు తెలిపారు. దీనికి విపక్ష ఎంపీలు అంగీకరించలేదు. ఎన్నికల సంఘానికి వినతిపత్రం అందజేయడానికి శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తున్న తమను అడ్డుకోవడం ఏంటని ఎంపీలు మండిపడ్డారు.
కొంతమంది ఎంపీలు రోడ్డుపై బైఠాయించి ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మహిళా ఎంపీలు మహువ మోహిత్రా, సాగరికా గోష్, సుస్మిత దేవ్, ప్రియాంక గాంధీ, సంజనా జాతవ్, జ్యోతిమనితో పాటు సమాజ్ వాదీ పార్టీ సభ్యుడు అఖిలేష్ యాదవ్ భారీకేడ్ల పైకి ఎక్కారు. ఎన్నికల సంఘం తీరుపై నిప్పులు చెరిగారు. ఆ తర్వాత పోలీసులు నిరసనకారులను బస్సుల్లోకి ఎక్కించి, పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. అనంతరం రెండు గంటల తర్వాత వీరిని విడుదల చేశారు. అయితే ఈ నిరసనలో సమాజ్వాది పార్టీ ఎంపీ, టీమిండియా యంగ్ క్రికెటర్ రింకు సింగ్ కి కాబోయే భార్య ఢిల్లీ గడ్డపై రెచ్చిపోయింది.
ఇండియా కూటమి చేపట్టిన ఈ ధర్నాలో ఆమె కూడా పాల్గొని పెద్ద ఎత్తున నిరసన తెలియజేసింది. దీంతో ప్రియా సరోజ్ చేపట్టిన నిరసన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక టీమిండియా క్రికెటర్ రింకూ సింగ్ – ఎంపీ ప్రియా సరోజ్ నిశ్చితార్థం ఉత్తరప్రదేశ్లోని ఓ ప్రైవేట్ హోటల్ లో జూన్ 8, 2025న అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. త్వరలోనే వీరి వివాహం జరగనున్నట్లు సమాచారం. ప్రియా సరోజ్ 2024 పార్లమెంట్ ఎన్నికలలో సమాజ్ వాదీ పార్టీ నుండి మచ్లీ షహర్ సెగ్మెంట్ నుండి బరిలోకి దిగి విజయం సాధించింది. బిజెపి అభ్యర్థి బీపీ సరోజ్ ని 35,850 ఓట్ల తేడాతో ఓడించి.. పార్లమెంట్ దిగువ సభకు ఎన్నికైన రెండవ అతి చిన్న వయస్కురాలిగా ప్రియా సరోజ్ చరిత్ర సృష్టించింది.
?utm_source=ig_web_copy_link