India Asia Cup Squad: ఇంగ్లాండ్ తో 5 టెస్టుల సిరీస్ ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి ఆసియా కప్ 2025 పైనే పడింది. ఈ మెగా టోర్ని సెప్టెంబర్ 9 నుండి ప్రారంభం కానుంది. వచ్చే ఏడాది టి-20 ప్రపంచ కప్ జరగనుండడంతో.. ఈ మెగా టోర్ని ని టి-20 ఫార్మాట్ లో నిర్వహించనున్నారు. గతంలో ఈ టైటిల్ ని భారత జట్టు గెలుచుకుంది. అందువల్ల ఈసారి కూడా సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్సీలో భారత జట్టు దీనిని కైవసం చేసుకోవడానికి సిద్ధంగా ఉంది. సెప్టెంబర్ 9 నుండి ఈ టోర్నీ ప్రారంభం అవుతుంది. అయితే ఈ టోర్నీలో సెప్టెంబరు 10న భారత్ తన తొలి మ్యాచ్ ఆడాల్సి ఉంది.
Also Read: Priya Saroj: రింకూ సింగ్ కు కాబోయే భార్య ఢిల్లీ గడ్డపై ఎలా రెచ్చిపోయిందో చూడండి
ఈ నేపథ్యంలో ఆసియా కప్ 2025 కోసం 15 మంది ఆటగాళ్లతో కూడిన భారత జట్టు ఎలా ఉండనుందో..? అంటూ ఇప్పటికే అంచనాలు మొదలయ్యాయి. టి-20 కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ సర్జరీ అనంతరం కోలుకొని.. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఇప్పటికే ప్రాక్టీస్ ప్రారంభించాడు. త్వరలోనే అతడి ఫిట్నెస్ ని సెలెక్టర్లు పరిశీలించనున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలను సూర్యకుమార్ యాదవ్ కి అప్పగించే అవకాశం ఉంది. అయితే భారత జట్టులో చెప్పుకోదగ్గ మార్పులు ఏమీ ఉండకపోవచ్చు. మరోవైపు చాలా గ్యాప్ తర్వాత బుమ్రా టి-20 ఫార్మాట్ లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది.
అయితే వైస్ కెప్టెన్ విషయంలో మాత్రం బీసీసీఐ మల్లగుల్లాలు పడుతున్నట్లు సమాచారం. వైస్ కెప్టెన్ గా అక్షర్ పటేల్ ని కొనసాగించాలా..? లేక అతడి స్థానంలో గిల్ కి బాధ్యతలు అప్పగించాలా..? అన్న సందిగ్ధంలో బీసీసీఐ ఉన్నట్లు సమాచారం. ఇక అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ లతో కూడిన బ్యాటింగ్ లైనప్ దాదాపుగా ఖాయం అంటున్నారు. ప్రస్తుతం టి-20 ర్యాంకింగ్స్ లో అభిషేక్ శర్మ అగ్రస్థానంలో ఉన్నాడు. ఇక ఓ పేస్ బౌలర్ బెర్త్ కోసం హర్షిత్ రానా, ప్రసిద్ద్ కృష్ణ మధ్య పోటీ ఉన్నట్లు సమాచారం. రెండో వికెట్ కీపర్ గా దృవ్ జురెల్, జితేష్ శర్మ పోటీ పడుతున్నారు. అలాగే ఆల్రౌండర్ల కోటాలో శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ తుది జట్టులో ఉంటారు.
Also Read: Poonam Kaur – Siraj: టాలీవుడ్ హాట్ బ్యూటీతో మహమ్మద్ సిరాజ్… బిజెపిలోకి వెళ్తున్నాడా ?
స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి కొనసాగుతారు. అలాగే స్పెషలిస్ట్ పేస్ బౌలర్ గా అర్షదీప్ సింగ్ స్థానం పక్కా. ఆల్ రౌండర్ల హవా పెరగడంతో రింకు సింగ్ స్థానం ప్రశ్నార్థకంగా మారింది. అటు టాప్ ఆర్డర్ లో చాలామంది ఆటగాళ్లు ఉండడంతో యువ ఆటగాళ్లు యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్ లకు చోటు దక్కడం కష్టంగా మారింది. ఇక ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ లో నితీష్ కుమార్ రెడ్డికి గాయం అయిన విషయం తెలిసిందే. అతడు గాయం నుంచి ఇంకా కోలుకోలేదు. దీంతో అతడిని సెలెక్టర్లు పరిగణలోకి తీసుకునే అవకాశాలు లేవు. మొత్తంగా ఆసియా కప్ కోసం నలుగురు ఆల్ రౌండర్లు, ఆరుగురు బౌలర్లు బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఆసియా కప్ 2025 కోసం భారత జట్టు {అంచనా}:
సూర్య కుమార్ యాదవ్ {కెప్టెన్}, గిల్, అక్షర్ పటేల్, సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, బుమ్రా, అర్షదీప్ సింగ్, ప్రసిద్ద్ కృష్ణ/హర్షిత్ రానా, జితేష్ శర్మ/ దృవ్ జురెల్.