E-Paper
Advertisement

ఒరేయ్ వాహాబ్ రియాజ్…మాకు ఆసియా క‌ప్ వ‌ద్దు రా, ద‌మ్ముంటే టీమిండియాను ఓడించండి

ఒరేయ్ వాహాబ్ రియాజ్…మాకు ఆసియా క‌ప్ వ‌ద్దు రా, ద‌మ్ముంటే టీమిండియాను ఓడించండి
Advertisement

Pak Fans Trolls Wahab Riaz:  ఉమెన్స్ ఆసియా కప్ 2026 టోర్నమెంట్ (Women’s Asia Cup 2026 Tournament) చివరి అంకానికి చేరుకుంది. అయితే ఈ టోర్నమెంట్ లో మొన్న శనివారం టీమిండియాతో తలపడగా… చిత్తుగా ఓడిపోయింది పాకిస్తాన్ ఉమెన్స్ టీమ్. కానీ నిన్న హాంకాంగ్ తో జరిగిన మ్యాచ్ లో మాత్రం అద్భుతంగా రాణించి విజయం సాధించింది పాకిస్తాన్ మహిళల జట్టు. ఈ క్రమంలో సెమీ ఫైనల్ కు కూడా దూసుకువెల్లింది. సెమిస్ లో బంగ్లాదేశ్ లేదా శ్రీలంక జట్టుతో పాకిస్తాన్ తలపడే ఛాన్సులు కనిపిస్తున్నాయి. అయితే హాంగ్కాంగ్ తో మ్యాచ్ ఫినిష్ అయిన తర్వాత పాకిస్తాన్ మహిళల కోచ్ రియాజ్ ను కొంతమంది అభిమానులు నిలదీశారు. మాకు ఆసియా కప్ వద్దని… కేవలం ఇండియాను ఓడించాలంటూ సరికొత్త డిమాండ్ చేశారు.

మాకు ఆసియా క‌ప్ వ‌ద్దు రా, ద‌మ్ముంటే టీమిండియాను ఓడించండి

ఆసియా కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో నిన్న దుబాయ్ వేదికగా పాకిస్తాన్ వర్సెస్ హంకాంగ్ ( Pakistan Women vs Hong Kong, China Women) మధ్య బిగ్ ఫైట్ జరిగింది. ఇందులో అద్భుతంగా రాణించిన పాకిస్తాన్ ఉమెన్స్ టీం… 72 పరుగుల తేడాతో విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ క్రమంలో సెమీ ఫైనల్ కు దూసుకు వెళ్ళింది పాకిస్తాన్. అయితే సెమీ ఫైనల్ కు పాకిస్తాన్ వెళ్లిన నేపథ్యంలో.. కోచ్ వహాబ్ రియాజ్ స్టేడియం చుట్టూ తిరుగుతూ, అభిమానులకు అభివాదం చేస్తూ సందడి చేశారు.

Advertisement

PCB confiscate mobile phones of Pakistan cricketers : పాకిస్తాన్ జ‌ట్టులో పెను ప్ర‌కంప‌న‌లు…ప్లేయ‌ర్ల మొబైల్ ఫోన్లను లాగేసుకున్న PCB

అయితే ఈ సందర్భంగా వహాబ్ రియాజ్ ను కొంత మంది పాకిస్తాన్ అభిమానులు నిలదీశారు. హాంకాంగ్ పైన గెలవడం… ఆసియా కప్ 2026 టోర్నమెంట్ సాధించడం మాకు వద్దంటూ పాక్ అభిమానులు రచ్చ చేశారు. ఫైనల్స్ లో టీమిండియాను ఓడించడమే తమకు కావాలని డిమాండ్ చేశారు. అప్పటి వరకు తాము నిద్రపోమని స్పష్టం చేశారు. ఆ దిశగా పాకిస్తాన్ ఆటగాళ్లు అడుగులు వేయాలని రియాజ్ ను నిల‌దీశారు. ఇక రియాజ్ కూడా క‌చ్చితంగా టీమిండియాను ఓడిస్తామ‌ని వెల్ల‌డించారు. ఈ సంఘ‌ట‌నకు సంబంధించిన వీడియో వైర‌ల్ గా మారింది.

ఫైనల్స్ లో టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ ఉండే ఛాన్స్

Advertisement

ఉమెన్స్ ఆసియా కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఫైనల్ మ్యాచ్ ఉండే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు క్రీడా విశ్లేషకులు. గ్రూప్ ఏ లో పాకిస్తాన్ అలాగే టీమిండియా రెండు జట్లు సెమీ ఫైనల్ కు దూసుకు వెళ్ళాయి. అటు గ్రూపు బీలో శ్రీలంకతో పాటు బంగ్లాదేశ్ సెమీ ఫైనల్ కు వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంటే సెమీ ఫైనల్ లో టీమిండియాతో పాటు పాకిస్తాన్ విజయం సాధిస్తే ఫైనల్స్ లో మరోసారి తలపడతాయి. అప్పుడు టైటిల్ గెలిచిన వాళ్ళు… ఛాంపియన్ కానున్నారు.

Tanveer Ahmed On IND VS PAK: అదరగొట్టిన ఇండియా, పాకిస్తాన్ మరో ఘోర ఓటమి…ఫిక్సింగ్ చేశారంటూ త‌న్వీర్ ఆరోప‌ణ‌లు

 

Related News

నేను రాజ‌కీయాల్లోకి వ‌స్తే, ఇమ్రాన్ ఖాన్ లాగా కుక్క చావు చ‌చ్చేవాడిని

పాకిస్తాన్ ప‌త‌నానికి ఆకిబ్ జావేదే కార‌ణం..ఆ 7 గురు క్రికెట‌ర్ల జీవితాల‌తో ఆడుకుంటున్నాడు

PSL ర‌ద్దు అయ్యేలా బీసీసీఐ కుట్ర‌లు…విదేశీ క్రికెట‌ర్లను టార్చ‌ర్ చేసి మ‌రీ

పాకిస్తాన్ లో ప‌ర్య‌టించనున్న టీమిండియా..మోడీ స‌ర్కార్ గ్రీన్ సిగ్నల్ ?

నా ముందు గిల్ క్రిస్ట్, హేడెన్, ఏబీ డివిలియర్స్ పిల్ల బ‌చ్చాగాళ్లు

కోహ్లీ దుర్మార్గుడు..అంబ‌టి, యువ‌రాజ్ సింగ్ ల‌ కెరీర్ నాశ‌నం చేశాడు

నా బ్యాటింగ్ ఆర్డ‌ర్ మార్చి, గంగూలీ టార్చ‌ర్ చేశాడు

Big Stories

Advertisement
×