Nindu Noorella Saavasam Serial Today Episode: మనోహరి షాపింగ్ అని చెప్పి బయటకు వెళ్లగానే అమర్ కూడా వెనకాలే మనోహరిని ఫాలో అవుతుంటాడు. మనోహరి షాపింగ్‌కు వెళ్లకుండా శ్రీశైలం హైవేలో వెళ్తుంది. అమర్ షాక్ అవుతాడు. మనోహరిని పూర్తిగా అనుమానిస్తాడు. షాపింగ్‌కు అని చెప్పి ఎక్కడకు వెళ్తుంది. మనోహరి ఏదో దాస్తుంది అనుకుంటాడు అమర్.
అప్పుడే ఇంటికి వెళ్లిన పార్థు ఇంట్లో మొత్తం వెతికినా అమర్ కనిపించడు.. అమర్‌కు ఫోన్ చేసి ఎక్కడికి వెళ్లావు అని అడుగుతాడు. అందుకు అమర్ తాను మనోహరిని ఫాలో అవుతున్నానని.. మన దగ్గర షాపింగ్ కు వెళ్తున్నానని చెప్పిన మనోహరి షాపింగ్‌కు కాకుండా శ్రీశైలం రూట్‌లో వెళ్తుందని చెప్తాడు. అమర్ మాటలకు పార్థు షాక్ అవుతాడు. షాపింగ్‌కు కాకుండా శ్రీశైలం రూట్ లో వెళ్తుందా..? ఎందుకు అని ప్రశ్నిస్తే.. నాకు అదే అర్తం కావడం లేదు నిన్నటి నుంచి మనోహరి ప్రవర్తనలో ఏదో తేడా కనిపిస్తుందని ఇవాళ మనం ఆ రౌడీల గురించి మాట్లాడుకున్నప్పుడు కూడా మనోహరి చాలా భయపడిందని చెప్తాడు. ఎందుకై ఉండొచ్చని పార్థు అడిగితే.. ఏమో మనోహరికి ఏదో నిజం తెలిసి ఉండొచ్చని డౌటుగా ఉందని తనకు ఏదైనా అవసరం అయితే ఫోన్ చేస్తాను అంటూ చెప్పి కాల్ కట్ చేస్తాడు అమర్.
కారులో వెళ్తున్న మనోహరి ఇంకాసేపట్లో తాను మిస్సమ్మ చావు చూడబోతున్నానని సంతోషంగా ఫీలవుతుంది. ఎన్నాళ్లో వేచిన తన కల నెరవేరబోతుందని అనుకుంటూ వెళ్తుంది. వెనకాలే అమర్ ఫాలో అవుతుంటాడు. మరోవైపు బస్సులో ఉన్న రాథోడ్‌ను ప్రచండ పంపించిన ఆత్మ ఆవహిస్తుంది. దాంతో రాథోడ్ పిల్లలను కోపంగా చూస్తుంటాడు.
ఇంట్లో ఉన్న పార్థు యాదమ్మను పిలిచి మనోహరి ఎందుకు శ్రీశైలం వెళ్తుంది అని అడిగితే.. ఆ విషయం మీకెలా తెలిసింది అని యాదమ్మ అంటుంది. అందుకు పార్థు అనుమానంగా మీకెలా తెలుసు అంటే నీకు ముందే తెలుసా.? అంటాడు. యాదమ్మ భయపడి లేదు సార్ మీకు ఎలా తెలుసని అడుగుతున్నాను అనగానే.. పార్థు తనకు అమర్ చెప్పాడని ఇప్పుడు అమర్, మనోహరిని ఫాలో అవుతున్నాడని చెప్తాడు. దీంతో యాదమ్మ అలియాస్ చంభా కంగారు పడుతుంది. వెంటనే మనోహరి రూంలోకి వెళ్లి ఫోన్ చేస్తుంది. మనోహరి ఫోన్ రూంలోనే రింగ్ అవుతుంది. ఆ ఫోన్ చూసిన యాదమ్మ నీ కర్మ మనోహరి ఇవాళ నిన్ను ఆ దేవుడే కాపాడాలి అనుకుంటుంది.
ప్రచండ తన శిష్యుడితో కలిసి అడవిలో ఉన్న పాడుబడిన బంగ్లా దగ్గరకు వెళ్తాడు. బుజ్జమ్మ శక్తులు ఇక్కడే హరిస్తానని చెప్తాడు. శిష్యుడు అనుమానంగా అయితే మీరు పంపించిన ఆత్మ ఆ పిల్లలను ఇక్కడకు తీసుకొస్తుందా మాంత్రిక అని అడిగితే అవునని ప్రచండ చెప్తాడు. ప్రచండ చెప్పినట్టుగానే.. రాథోడ్ లో ఉన్న ఆత్మ బస్సు రూట్ మార్చేందుకు ప్రయత్నిస్తుంది. మిస్సమ్మ వద్దని వారిస్తుంది. దీంతో రాథోడ్ మిస్సమ్మను కోపంగా చూస్తుంటాడు. రాథోడ్ తాను చెప్పిన రూట్లో వెళితే త్వరగా సాగర్ వెళ్లొచ్చని పైగా అడవిలో వన్యమృగాలను చూస్తూ వెళ్లొచ్చని చెప్తాడు. దీంతో పిల్లలు కూడా అడవి మార్గంలోనే వెళ్దామని మారాం చేస్తుంటారు. సరస్వతి వార్డెన్ రాజు కూడా అడవి మార్గంలోనే వెళ్లాలని మిస్సమ్మను కన్వీన్స్ చేస్తారు. అయినా మిస్సమ్మ ఒప్పుకోదు.. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.