E-Paper
Advertisement

ఇదెక్కడి మాస్ రా నాయనా…మొగుడు, పెళ్లాం మ‌ధ్య చిచ్చు పెట్టిన ముంబై, CSK మ్యాచ్‌

ఇదెక్కడి మాస్ రా నాయనా…మొగుడు, పెళ్లాం మ‌ధ్య చిచ్చు పెట్టిన ముంబై, CSK మ్యాచ్‌
Advertisement

CSK VS MI:   ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో   (Indian Premier League 2026 Tournament) భాగంగా ఇవాళ కీలక మ్యాచ్ జరిగింది. చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ ( Mumbai Indians vs Chennai Super Kings) మధ్య వాంఖడే స్టేడియం ( Wankhede Stadium, Mumbai) వేదికగా బిగ్ ఫైట్ నిర్వహించారు. సాయంత్రం ఏడున్నర గంటలకు ప్రారంభమైన ఈ మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన చెన్నై సూపర్ కింగ్స్ ఏకంగా 103 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా జరిగిన ఓ సంఘటన వైరల్ గా మారింది. ఈ మ్యాచ్ ఇద్దరు మొగుడు పెళ్ళాల మధ్య గొడవ పెట్టింది. ముంబై ఇండియన్స్ ఓడిపోతున్న నేపథ్యంలో డాన్స్ చేసినందుకు తన భార్యపై మండిపడ్డాడు ఓ అభిమాని. ఈ సంఘటనకు సంబంధించిన ఫోటో వైరల్ గా మారింది. దీంతో పచ్చడి కాపురంలో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ చిచ్చు పెట్టిందని సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు క్రికెట్ అభిమానులు.

Also Read: Rohit Sharma Fitness Video : గంట‌కు 100 Push-Ups..రోహిత్ శ‌ర్మ 2.0 మాములుగా లేదు, గూస్ బంప్స్ రావాల్సిందే

మొగుడు, పెళ్లాం మ‌ధ్య చిచ్చు పెట్టిన ముంబై, CSK మ్యాచ్‌

Advertisement

ముంబై ఇండియన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఇవాళ బిగ్ మ్యాచ్ జరిగింది. ముంబై వేదికగా ఈ మ్యాచ్ జరిగిన నేపథ్యంలో క్రికెట్ అభిమానులు ఎగబడి స్టేడియానికి వచ్చారు. దీంతో స్టేడియం మొత్తం హౌస్ ఫుల్ అయింది. అయితే, ఈ మ్యాచ్ చూసేందుకు ఇద్దరు భార్యాభర్తలు కూడా వచ్చారు. ఇందులో భార్య చెన్నై సూపర్ కింగ్స్ అభిమాని కాగా… భ‌ర్త‌ మాత్రం ముంబై ఇండియన్స్ ను సపోర్ట్ చేస్తున్నాడు. అయితే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన చెన్నై భారీ స్కోర్ నమోదు చేయగా.. లక్ష్యాన్ని చేదించే క్రమంలో ముంబై ఇండియన్స్ తేలిపోయింది.

అకేల్ హోసేన్ అద్భుతమైన బౌలింగ్ చేసిన నేపథ్యంలో ముంబై ఇండియన్స్ బ్యాటర్లు విలవిలలాడిపోయారు. అదే ముంబై ఇండియన్స్ వికెట్లు వరుసగా పడుతున్న నేపథ్యంలో స్టేడియానికి వచ్చిన పైన పేర్కొన్న‌ లేడీ, చెన్నైకి సపోర్ట్ చేస్తూ డాన్స్ చేసింది. ఇక ఆమె డాన్స్ చూసిన భర్త.. గట్టిగా అరిచేశాడు. ముంబై ఓడిపోతుంటే డాన్స్ చేస్తావా ? అంటూ మండిపడ్డాడు. తనకు చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించాలని ఉందని అతని భార్య మరింత రెచ్చిపోయింది. ఈ సంఘటన వైరల్ గా మారింది. ఇది చూసిన క్రికెట్ అభిమానులు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

చిత్తుగా ఓడిపోయిన ముంబై ఇండియన్స్

Advertisement

చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది ముంబై ఇండియన్స్. ఈ మ్యాచ్లో చెన్నై మొదట బ్యాటింగ్ చేసి ఆరు వికెట్ల నష్టానికి 207 పరుగులు సాధించింది. ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో 19 ఓవర్లు వాడిన ముంబై ఇండియన్స్ 104 పరుగుల వద్ద ఆల్ అవుట్ అయింది.

 

 

 

Also Read: Chris Gayle Controversal Comments ON PBKS: చిన్నపిల్లాడిని చేసిన న‌ర‌కం చూపించారు…పంజాబ్ ఓన‌ర్లు దుర్మార్గులు

 

Related News

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

Big Stories

Advertisement
×