E-Paper
Advertisement

రేపు తెలంగాణ కేబినెట్ కీలక భేటీ.. ఈ అంశాలపై స్పెషల్ ఫోకస్..!

రేపు తెలంగాణ కేబినెట్ కీలక భేటీ.. ఈ అంశాలపై స్పెషల్ ఫోకస్..!
Advertisement

Cabinet Meeting: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల 4వ తేదీన (సోమవారం)జరగనుంది. ముఖ్యమంత్రి అధ్యక్షతన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలోని ఆరో అంతస్తులో ఉన్న కేబినెట్ సమావేశ మందిరంలో మధ్యాహ్నం 3:00 గంటలకు ఈ భేటీ ప్రారంభం కానుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.

శ్రీపాద ఎల్లంపల్లికి..

ప్రధానం గా తుమ్మిడిహెట్టి బ్యారేజీపై కేబినెట్ చర్చించనున్నట్లు తెలుస్తోంది. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా తుమ్మిడిహెట్టి వద్ద 150 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మించి శ్రీపాద ఎల్లంపల్లికి నీటిని తరలించాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఇటీవల నిర్వహించిన సమావేశంలో నిర్ణయించారు. ఈ నేపథ్యంలో తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లికి నీటిని తరలించేందుకు నాలుగు మార్గాలు ప్రతిపాదనలో ఉన్నాయి. వీటిపై కేబినెట్​ చర్చించి, నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.

Advertisement

Also read: తక్కువ బడ్జెట్‌లో బెస్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్ కావాలా? అయితే ఈ చిట్కాలు మీ కోసమే

100 రోజుల్లో క్లియర్..

ఇక ఉద్యోగులు, ఫించనర్ల సమస్యలు, డిమాండ్లపై మంత్రి మండలి చర్చించనున్నట్లుగా తెలుస్తోంది. ఉద్యోగులు, పింఛనర్ల పెండింగ్ బిల్లులు 100 రోజుల్లో క్లియర్ చేయాలని భావిస్తున్న ప్రభుత్వం, అందుకు సంబంధించిన కార్యాచరణపై కేబినెట్​ భేటీలో నిర్ణయం తీసుకోనుంది. పెండింగ్ డీఏలు, ప్రభుత్వం నగదు రహిత చికిత్సలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం, కొత్త ఆసరా ఫించన్లు, తెలంగాణ ఉద్యమకారుల కోసం కార్యక్రమాలు, ఇందిరమ్మ బీమా పథకం తదితర అంశాలపై కూడా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం.

Advertisement

Also read: ఆపరేషన్‌తో ప్రాణం.. చదువుతో విజయం.. కేటీఆర్ అండతో శరణ్య సాధించిన అద్భుతం!

Related News

హైదరాబాద్‌వాసులకు బిగ్ అలర్ట్.. నేడు-రేపు ట్రాఫిక్ ఆంక్షలు, ఆ రోడ్లు పూర్తిగా క్లోజ్!

యువతకు కాంగ్రెస్ ఇచ్చిన గిఫ్ట్ ఇదేనా.. సర్కార్ పై రాంచందర్ రావు ఫైర్!

క్వాలిటీ థాట్ ఫ్యూచర్ స్కిల్స్ ఈవెంట్‌లో.. యువతపై మంత్రి వివేక్ కీలక వ్యాఖ్యలు!

ఆర్టీసీ బస్సు రన్నింగ్‌లో ఉండగానే డ్రైవర్‌కు ఫిట్స్.. స్పాట్‌లో ప్రయాణికులు..!

రెంట్ ఆన్ బాయ్‌ఫ్రెండ్ పేరుతో కొత్త సైబర్ స్కామ్.. యువతను అలర్ట్ చేసిన సీపీ సజ్జనార్!

తెలంగాణలో ఇందిరమ్మ ఇడ్ల పై బిగ్ అప్‌డేట్.. తొలి విడత లాటరీ తేదీలు ఇవే!

పెద్ది కుటుంబానికి అండగా కేసీఆర్.. ఫ్యామిలీకి రూ.2.25 కోట్ల ఆర్థిక సాయం!

తెలంగాణలో సదరం సర్టిఫికెట్ల స్కామ్ లీక్.. 89 మంది ఉద్యోగులపై వేటు!

Big Stories

Advertisement
×