Fakhar Zaman : టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament ) నేపథ్యంలో ఇవాళ శ్రీలంక వర్సెస్ పాకిస్తాన్ ( Pakistan vs Sri Lanka) మధ్య మ్యాచ్ జరుగుతోంది. తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ అద్భుతంగా ఆడింది. శ్రీలంక ముందు భారీ టార్గెట్ పెట్టింది. అయితే, ఈ మ్యాచ్ లో ఫిక్సింగ్ ఆరోపణలు కూడా తెరపైకి వచ్చాయి. ఫఖార్ జమాన్ ( Fakhar Zaman) ఔట్ అయినప్పటికీ, ఫీల్డ్ అంపైర్ ఔట్ ఇవ్వలేదు. అటు క్లియర్ గా బ్యాట్ తగిలినప్పటికీ కూడా శ్రీలంక రివ్యూ తీసుకోలేదు. ఫలితంగా ఫఖార్ జమాన్ ఏకంగా 84 పరుగులు చేసి ఇరగదీశాడు. ఈ దెబ్బకు పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 212 పరుగులు సాధించగలిగింది. దీంతో ఫఖార్ జమాన్ ( Fakhar Zaman) ఔట్ వివాదంపై అంతర్జాతీయంగా చర్చ జరుగుతోంది. దీనిపై ఐసీసీ ( ICC) విచారణ చేయాలని నెటిజెన్స్ కోరుతున్నారు.
Also Read: Abhishek Sharma-Yuvraj Singh: అభిషేక్ శర్మకు ఘోర అవమానం…చెప్పులు చూపించిన యువరాజు
టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో భాగంగా పల్లెకెలే వేదికగా ( Pallekele International Cricket Stadium, Pallekele) వేదికగా శ్రీలంక వర్సెస్ పాకిస్తాన్ మధ్య సూపర్ 8 మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో అద్భుతంగా పాకిస్తాన్ రాణించింది. మొదటి బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లు ఆడింది. ఈ సందర్భంగా ఎనిమిది వికెట్ల నష్టానికి 212 పరుగులు సాధించింది పాకిస్తాన్. శ్రీలంక ఓపెనర్ ఫర్హాన్ ( Sahibzada Farhan) మరోసారి సెంచరీ తో రెచ్చిపోయాడు.
166 స్ట్రైక్ రేట్ సాధించిన ఫర్హాన్, 100 పరుగులు సాధించాడు. 60 బంతుల్లోనే సెంచరీ చేయడం గమనార్హం. ఇందులో 5 సిక్సర్లు అలాగే తొమ్మిది బౌండరీలు ఉన్నాయి. అటు మరో ఓపెనర్ ఫఖార్ జమాన్ ( Fakhar Zaman) 42 బంతుల్లో 84 పరుగులు చేసి ఇరగదీశాడు. అయితే ఫఖార్ జమాన్ ( Fakhar Zaman) బ్యాటింగ్ చేస్తున్న సమయంలో జరిగిన ఓ సంఘటన ఇప్పుడు వివాదంగా మారింది. అతడు 20 లోపే పరుగులు ఉన్నప్పుడు కీపర్ క్యాచ్ అవుట్ అయ్యాడు. కానీ ఫీల్డ్ అంపైర్ మాత్రం అవుట్ ఇవ్వలేదు. అటు శ్రీలంక క్రికెటర్లు కూడా రివ్యూ తీసుకోలేదు. తీరా ఆల్ట్రా ఎడ్జ్ లో మాత్రం బ్యాట్ ను బంతి తగిలినట్లు స్పష్టంగా కనిపించింది. దీంతో ఫిక్సింగ్ ఆరోపణలు తెరపైకి వస్తున్నాయి.
అంపైర్లు అలాగే శ్రీలంక ప్లేయర్లు, పాకిస్తాన్ కు అమ్ముడుపోయారని నెటిజెన్స్ సీరియస్ అవుతున్నారు. పాకిస్తాన్ ను సెమీ ఫైనల్ కు పంపించేందుకు శ్రీలంక ఇలాంటి కుట్రలకు తెరలేపిందని అంటున్నారు. ఇది ఇలా ఉండగా… ఇవాల్టి మ్యాచ్ లో పాకిస్తాన్ భారీ పరుగుల తేడాతో విజయం సాధించాలి. ఇవాల్టి మ్యాచ్ లో 148 పరుగులకే శ్రీలంకను కట్టడి చేయాలి. లేకపోతే పాకిస్తాన్ ఎలిమినేట్ అవుతుంది. ఒకవేళ 148 పరుగులకు కంటే తక్కువ శ్రీలంకను కట్టడి చేయగలిగితే.. పాకిస్తాన్ సెమీ ఫైనల్ లోకి ఎంట్రీ ఇస్తుంది.
?utm_source=ig_web_copy_link
At least don’t make it so obvious, act a little better 😂 pic.twitter.com/aiuWViqmZQ
— Out Of Context Cricket (@GemsOfCricket) February 28, 2026
🚨BIG BREAKING FROM PALLEKELE SRI LANKA VS PAKISTAN 🚨
– Fakhar Zaman was out and neither on field Umpire gave it out nor Sri Lanka went for review, this is clear fixing in broad daylight.!!😔
– Documentary Sahibzada Farhan another hundred & Pak is semis & New Zealand,… pic.twitter.com/jO72ktY6pL
— MANU. (@IMManu_18) February 28, 2026