E-Paper
Advertisement

Padi Kaushik Reddy: 15 రోజులే గడువు.. లేదంటే అసెంబ్లీలో వీడియోలు రిలీజ్ చేస్తా.. కరీంనగర్ సీపీకి కౌశిక్ రెడ్డి అల్టిమేటం

Padi Kaushik Reddy: 15 రోజులే గడువు.. లేదంటే అసెంబ్లీలో వీడియోలు రిలీజ్ చేస్తా.. కరీంనగర్ సీపీకి కౌశిక్ రెడ్డి అల్టిమేటం
Advertisement

Padi Kaushik Reddy: హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలంపై విరుచుకుపడ్డారు. సీపీ తన అధికార పరిధిని దాటి వ్యవహరిస్తున్నారని.. ప్రభుత్వ ఆస్తులను వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని ఆరోపించారు. సీపీ చేస్తున్న అక్రమాలకు సంబంధించిన వీడియోలు తన వద్ద ఉన్నాయని.. త్వరలోనే వాటిని అసెంబ్లీ వేదికగా బహిర్గతం చేస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. 15 రోజుల్లోగా ప్రభుత్వం స్పందించి సీపీపై చర్యలు తీసుకోకపోతే ఆధారాలన్నీ ప్రజల ముందు ఉంచుతానని అల్టిమేటం జారీ చేశారు.

ప్రభుత్వ వాహనాల దుర్వినియోగంపై కౌశిక్ రెడ్డి నంబర్లతో సహా వివరాలను బయటపెట్టారు. కరీంనగర్ సీపీకి కేటాయించిన ఇన్నోవా వాహనం (TS 09 PA 4195) హైదరాబాద్‌ ప్రాంతంలో తిరుగుతోందని.. దీనిని ఐఆర్ఎస్ అధికారి వికాస్ అగర్వాల్ తండ్రి కోసం ఉపయోగిస్తున్నారని దుయ్యబట్టారు. అలాగే మరో ప్రభుత్వ వాహనాన్ని (TS 09 PA 5601) గౌస్ ఆలం తన సోదరుడి వ్యక్తిగత పనుల కోసం వాడుతున్నారని విమర్శించారు. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ప్రభుత్వ నిధులను.. వనరులను ఇష్టారాజ్యంగా ఖర్చు చేయడం అధికార దుర్వినియోగమేనని ఆయన మండిపడ్డారు.

Advertisement

పోలీస్ కమిషనర్ తన కుటుంబ సభ్యుల కోసం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని కౌశిక్ రెడ్డి ఆరోపించారు. తన సతీమణికి కరీంనగర్‌లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగం ఇప్పించడమే కాకుండా.. ఆమె భద్రత కోసం ఇద్దరు కానిస్టేబుళ్లను నియమించారని తెలిపారు. సీపీ ఇంట్లోనే సుమారు 20 మంది కానిస్టేబుళ్లు పని చేస్తున్నారని.. శాంతిభద్రతలు కాపాడాల్సిన పోలీసులను ఇంటి పనులకు వాడుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. ఇలాంటి ఘటనల వల్ల ఐపీఎస్ అధికారుల అసోసియేషన్ పరువు మంటగలిసే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

త్వరలోనే ఈ వ్యవహారమంతా అసెంబ్లీ సాక్షిగా బయటపడుతుందని కౌశిక్ రెడ్డి హెచ్చరించారు. గౌస్ ఆలం వ్యవహరిస్తున్న తీరుపై ఉన్నతాధికారులు.. ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. పోలీసు వ్యవస్థలో జరుగుతున్న ఇటువంటి అక్రమాలను సహించేది లేదని.. బాధ్యులపై చర్యలు తీసుకునే వరకు తన పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

Advertisement

Read Also: AP CM : ఏపీ, తెలంగాణ మధ్య 5 గ్రామాల పంచాయితీ.. బాబు నిర్ణయంపై ఉత్కంఠ?

Related News

Medchal: నడి రోడ్డు పై వరి నాట్లు.. బీఆర్ఎస్ నాయకుల వినూత్న నిరసన..!

ఎండిపోతున్న ప్రాజెక్టులు.. హైదరాబాద్‌కు తగ్గిన నీటి సరఫరా.. రాబోయే రోజుల్లో తిప్పలు తప్పవా?

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ ఆత్మహత్యాయత్నం.. వెంటనే ఆసుపత్రికి తరలింపు

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

Big Stories

Advertisement
×