US Israel Iran War: అమెరికా వర్సెస్ ఇరాన్ ( US-Israel’s Iran strikes) మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. అమెరికా అలాగే ఇజ్రాయెల్ ఉమ్మడిగా కలిసి ఇరాన్ ను టార్గెట్ చేశాయి. భారీగా వైమానిక దాడులు చేస్తూ ఇరాన్ కు చుక్కలు చూపించే ప్రయత్నం చేస్తున్నాయి అమెరికా అలాగే ఇజ్రాయిల్. దానికి తగ్గట్టుగానే ఇరాన్ కూడా రివర్స్ అటాక్ చేస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్ పై ప్రతీకారంతో యూఏఈపై కూడా ఇరాన్ విరుచుకుపడుతున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఆ దేశంలోని అమెరికా ఏర్ బేస్ లు లక్ష్యంగా ఇరాన్ దాడులకు దిగుతోంది. ఈ నేపథ్యంలో దుబాయ్ పైన కూడా దాడులు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
Also Read: Abhishek Sharma-Yuvraj Singh: అభిషేక్ శర్మకు ఘోర అవమానం…చెప్పులు చూపించిన యువరాజు
దీంతో ప్రపంచంలోనే ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫాలో నుంచి అధికారులను కూడా ఖాళీ చేయించారు. ఇరాన్ దాడి చేస్తుందన్న సమాచారంతో సైరన్లు మోగించి మరీ, అందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అటు దుబాయ్ ఇంటర్నేషనల్ విమానాశ్రయం మూతపడింది. అయితే ఈ యుద్ధం టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ పైన పడింది. ఈ ఉద్రిక్తతల కారణంగా పశ్చిమాసియాలో విమానాశ్రయాలు మూతపడుతున్నాయి. ఇప్పటికే దుబాయ్ అలాగే టెలి అవివ్ లాంటి ప్రధాన విమానాశ్రయాలు ( flight plans ) కూడా మూతపడ్డాయి. దీంతో అంతర్జాతీయ ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు జరుగుతున్నాయి.
టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament ) చివరి దశకు వచ్చింది. ప్రస్తుతం సూపర్ 8 మ్యాచ్ లు కొనసాగుతున్నాయి. అలాగే కొన్ని జట్లు ఇప్పటికే ఎలిమినేట్ అయి ఇండియాలోనే ఉన్నాయి. మరికొన్ని శ్రీలంకలో బస చేస్తున్నాయి. ఎలిమినేట్ అయిన జట్లు తమ దేశాలకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో యుద్ధం ప్రారంభమైంది. ముఖ్యంగా దుబాయ్ విమానాశ్రయం మూతపడడంతో విదేశీ క్రికెటర్లు ఎటు వెళ్ళని పరిస్థితి నెలకొంది. అటు సూపర్ 8 ముగిసిన తర్వాత మరికొన్ని జట్లు తమ దేశాలకు వెళ్లాల్సి ఉంటుంది. అయితే విదేశీ క్రికెటర్లు అందరినీ సురక్షితంగా తమ దేశాలకు చేర్చుతామని తాజాగా ఐసీసీ బాస్ జై షా సంచలన ప్రకటన చేశారు. ఈ మేరకు తాజాగా ఐసీసీ ( ICC ) అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి.. ఈ నిర్ణయం తీసుకున్నారు. విదేశీ ప్లేయర్లను తమ దేశాలకు చేర్చే బాధ్యత ఐసీసీ తీసుకుందని.. ఎవరు ఆందోళన చెందాల్సిన పనిలేదని పేర్కొన్నారు జై షా.
అమెరికా – ఇరాన్ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఐసీసీ కీలక చర్యలు తీసుకుంటోంది. ఆటగాళ్లు, సిబ్బంది, అభిమానులను సురక్షితంగా వారి దేశాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. వారి భద్రతకే ఐసీసీ ప్రాధాన్యత ఇస్తున్నట్లు జైషా వెల్లడించారు.