Abhishek Sharma: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ (Indian Premier League 2026 Tournament) నేపథ్యంలో అభిషేక్ శర్మ ( Abhishek Sharma) దుమ్ము లేపే బ్యాటింగ్ తో రెచ్చిపోయాడు. చాలా రోజులుగా భారీ ఇన్నింగ్స్ ఆడేందుకు కష్టపడుతున్న అభిషేక్ శర్మ, ఢిల్లీ క్యాపిటల్స్ పైన ( Delhi Capitals) సెంచరీ చేసి ఇరగదీశాడు. 68 బంతుల్లోనే 135 పరుగులు చేసి చుక్కలు చూపించాడు. అయితే ఈ సెంచరీ నమోదు చేసిన నేపథ్యంలో అభిషేక్ శర్మ సరికొత్త వివాదంలో చిక్కుకున్నాడు. తన డ్రెస్సింగ్ రూమ్ లో పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ వసీం అక్రమ్ ( Wasim Akram)తో అభిషేక్ శర్మ చర్చలు జరిపినట్లు ఓ వీడియో వైరల్ గా మారింది. వసీం అక్రమ్ సలహాలు ఇస్తుంటే.. నేను నిన్నే ఫాలో అవుతా అంటూ అభిషేక్ శర్మ రియాక్ట్ కూడా అయినట్లు వీడియోలో కనిపించింది. దీంతో అభిషేక్ శర్మపై ఇండియన్ ఫ్యాన్స్ చాలా సీరియస్ అవుతున్నారు. పాకిస్తాన్ కుక్కలతో నీకేంటి పని? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డ్రెస్సింగ్ రూమ్ లో దాకా పాకిస్తాన్ వాడిని ఎందుకు తీసుకువచ్చావని నిలదీస్తున్నారు. దీంతో ఈ సంఘటన హాట్ టాపిక్ అయింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్లో భాగంగా నిన్న హైదరాబాద్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య 31వ మ్యాచ్ జరిగింది. ఈ సందర్భంగా 47 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ అద్భుతమైన విక్టరీ అందుకుంది. ఈ మ్యాచ్ లో 47 బంతుల్లోనే సెంచరీ నమోదు చేసిన అభిషేక్ శర్మ మొత్తం 135 పరుగులు సాధించాడు. ఈ దెబ్బకు ఢిల్లీ క్యాపిటల్స్ పైన హైదరాబాద్ అవలీలగా విజయం సాధించింది. అభిషేక్ శర్మ సూపర్ సెంచరీ చేసిన నేపథ్యంలో అతనికి సంబంధించిన ఓ కాంట్రవర్సీ వీడియో వైరల్ గా మారింది. పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ వసీం అక్రమ్ తో అభిషేక్ శర్మ చర్చలు జరిపినట్లు వీడియో బయటకు వచ్చింది. అభిషేక్ శర్మ డ్రెస్సింగ్ రూమ్ లో ఉన్న సమయంలో వసీం అక్రమ్ అక్కడికి వెళ్ళాడు.
ఆ తర్వాత బేటా.. నువ్వు బాగా ఆడుతున్నావు.. ఇలాగే కొనసాగు, నా టిప్స్ ఫాలో అవ్వు.. ఇక నీకు తిరుగు ఉండదు అంటూ సలహా సూచనలు ఇచ్చాడు వసీం అక్రమ్. భుజాలపై చేయి వేసి మరి అభిషేక్ శర్మతో ఓవర్ గా మాట్లాడాడు వసీం అక్రమ్. అయితే ఈ సంఘటన గతంలో జరగగా… అభిషేక్ శర్మ సెంచరీ చేయగానే దీన్ని వైరల్ చేశారు. దీంతో అభిషేక్ శర్మ ట్రోలింగ్ కు గురవుతున్నాడు. పాకిస్తాన్ వాళ్లతో అభిషేక్ శర్మకు సంబంధాలు ఉన్నాయని.. కావ్య పాప కూడా మొన్న అబ్రార్ విషయంలో అలాగే ప్రవర్తించిందని ట్రోల్స్ చేస్తున్నారు. అయితే ఇది పాత వీడియోనని… అభిషేక్ శర్మ స్వచ్ఛమైన భారతీయుడు అంటూ అతని అభిమానులు కౌంటర్లు ఇవ్వడం మొదలుపెట్టారు. సెంచరీ చేయవలసిన నేపథ్యంలో అభిషేక్ శర్మకు మంచి పేరు వస్తుందని.. ఇలా నెగిటివ్ వీడియోలను వైరల్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Abhishek Sharma took Wasim Akbar advice seriously. Head down, move forward. #SRHvsDC pic.twitter.com/I2B8DVCUkA
— Shipra (@mehtasaab19) April 21, 2026