E-Paper
Advertisement

లోకో పైలెట్ నిద్రపోతే ఏం జరుగుతుంది? భారతీయ రైల్వేలో ఈ సీక్రెట్ సిస్టమ్ గురించి తెలుసా!

లోకో పైలెట్ నిద్రపోతే ఏం జరుగుతుంది? భారతీయ రైల్వేలో ఈ సీక్రెట్ సిస్టమ్ గురించి తెలుసా!
Advertisement

Indian Railway Safety Features: భారతీయ రైల్వే ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే వ్యవస్థల్లో ఒకటి. ప్రతిరోజూ కోట్లాది మంది ప్రయాణికులు రైళ్ల ద్వారా తమ గమ్యస్థానాలకు చేరుకుంటారు. అయితే, రన్నింగ్ ట్రైన్ లో ఒకవేళ లోకో పైలెట్ నిద్రపోతే ఏమవుతుంది? రైలు పట్టాలు తప్పి పెను ప్రమాదం జరుగుతుందా? ఎంతో మంది ప్రాణాలు కోల్పోతారా? అసలు నిజం ఏంటంటే.. భారతీయ రైల్వే ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. ప్రమాదాలను తగ్గించేందుకు కవచ్, ఆటోమేటిక్ వార్నింగ్ సిస్టమ్, విజిలెన్స్ కంట్రోల్ డివైస్ లాంటి ఆధునిక భద్రతా వ్యవస్థలను ఉపయోగిస్తోంది. వీటిలో ముఖ్యంగా విజిలెన్స్ కంట్రోల్ డివైస్ అత్యవసర పరిస్థితుల్లో కీలక పాత్ర పోషిస్తుంది.

విజిలెన్స్ కంట్రోల్ డివైస్ అంటే ఏమిటి?

విజిలెన్స్ కంట్రోల్ డివైస్ అనేది లోకో పైలెట్ అప్రమత్తంగా ఉన్నాడా? లేదా? అనే విషయాన్ని నిరంతరం పర్యవేక్షించే ప్రత్యేక భద్రతా వ్యవస్థ. రైలు నడుస్తున్న సమయంలో డ్రైవర్‌ కు గుండెపోటు వచ్చినా, అనారోగ్యానికి గురైనా, లేదంటే నిద్రలోకి జారుకున్నా ఈ సిస్టమ్ వెంటనే అలర్ట్ అవుతుంది. లోకో పైలెట్ నుంచి ఎలాంటి స్పందన లేకపోతే రైలును ఆటోమేటిక్‌గా ఆపి ప్రమాదాన్ని నివారిస్తుంది.

విజిలెన్స్ కంట్రోల్ డివైస్ ఎలా పని చేస్తుంది?

Advertisement

రైలు ప్రయాణంలో లోకో పైలెట్ చేసే ప్రతి మూవ్ మెంట్ ను VCD గమనిస్తూ ఉంటుంది. థ్రోటిల్ మార్చడం, బ్రేక్ వేయడం, హారన్ వినిపించడం, ఇతర కంట్రోల్ స్విచ్‌ లను ఉపయోగించడం లాంటి పనులు జరుగుతుంటే డ్రైవర్ అప్రమత్తంగా ఉన్నాడని ఈ వ్యవస్థ గుర్తిస్తుంది. అయితే, సుమారు 60 సెకన్ల పాటు లోకో పైలెట్ నుంచి ఎలాంటి చర్య లేకపోతే ముందుగా క్యాబిన్‌ లో విజువల్ అలర్ట్ కనిపిస్తుంది. ఆ తర్వాత కొద్ది సెకన్లలో అలారం మోగుతుంది. ఈ హెచ్చరిక తర్వాత కూడా డ్రైవర్ స్పందించకపోతే VCD వెంటనే యాక్టివేట్ అవుతుంది. అప్పుడు రైలు నియంత్రణను తన కంట్రోల్ లోకి తీసుకుంటుంది. ఆటోమేటిక్‌గా ఎమర్జెన్సీ బ్రేక్‌ను అమలు చేసి రైలును పూర్తిగా నిలిపివేస్తుంది. దీంతో ఎదురయ్యే ప్రమాదాలను గణనీయంగా తగ్గించే అవకాశం ఉంటుంది.

VCD ఎందుకు అంత ముఖ్యమైనది?

ఈ వ్యవస్థ వల్ల లోకో పైలెట్ ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నా? లేదంటే అప్రమత్తంగా లేకపోయినా పెద్ద ప్రమాదాలు జరగకుండా నివారిస్తుంది. సిగ్నల్‌ ను దాటిపోవడం, స్పీడ్ కంట్రోల్ కోల్పోవడం లాంటి ప్రమాదకర పరిస్థితులను తగ్గించడంలో కూడా ఇది సహాయపడుతుంది. అందుకే భారతీయ రైల్వేలోని ఎలక్ట్రిక్, డీజిల్ లోకోమోటివ్‌లలో విజిలెన్స్ కంట్రోల్ డివైస్‌ ను తప్పనిసరిగా అమర్చారు. VCDతో పాటు భారతీయ రైల్వేలో ఆటోమేటిక్ వార్నింగ్ సిస్టమ్ (AWS) కూడా పనిచేస్తుంది. కొన్ని రూట్లలో రైలు వేగం పరిమితిని దాటినా, సిగ్నల్‌ను పట్టించుకోకపోయినా ఈ వ్యవస్థ ఆటోమేటిక్ గా హెచ్చరికలు ఇస్తుంది. అవసరమైతే ఆటోమేటిక్‌గా బ్రేక్ కూడా వేస్తుంది. అంతేకాదు, రైళ్లను కంట్రోల్ రూమ్ నుంచి కూడా నిరంతరం పర్యవేక్షిస్తుంటారు. రైలు వేగం, కదలికలు, మార్గంలో జరుగుతున్న మార్పులను అధికారులు గమనిస్తారు. ఏదైనా అసాధారణ పరిస్థితి కనిపిస్తే వెంటనే చర్యలు తీసుకుని సంబంధిత సిబ్బందిని అప్రమత్తం చేస్తారు.

Advertisement

Read Also: ఒక్క టికెట్ చాలు.. 56 రోజుల పాటు రైల్లో దేశమంతా చుట్టేయొచ్చు!

Related News

విమానాలతో పోటీపడి దూసుకెళ్తున్న రైళ్లు.. వీటి స్పీడ్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!

గోవా కంటే బెటర్.. పర్యాటకులను ఆకట్టుకుంటున్న 5 కొత్త టూరిస్ట్ డెస్టినేషన్స్

గంగమ్మ నిత్యం జలాభిషేకం చేసే అద్భుత శివలింగం.. ఈ దృశ్యం చూస్తే మైమరచిపోతారు!

సిరిసిల్ల జిల్లాలో మ‌రో పుణ్య‌క్షేత్రం..500 అడుగుల స‌ర్పం..ఏకంగా 5 త‌ల‌లు

ఆ దేశంలో గాజుతో రైలు నిర్మాణం చేసిన ఇంజినీర్లు.. దీనికి ప్రత్యేక కారణం మ్యాజిక్

ముస్లింలకు శుభవార్త.. ఒక్క ఉమ్రా వీసాతో ఎన్నిసార్లైనా మక్కా ఎంట్రీ.. కానీ చిన్న కండీషన్

పాత బంగ్లాలో అర్ధరాత్రి విడిది.. దెయ్యం లేదని నిరూపిస్తే.. రూ.52 వేలు మీవే!

Big Stories

Advertisement
×