E-Paper
Advertisement

Asia Cup Rising Stars 2026: శివ‌రాత్రి రోజున టీమిండియా తాండ‌వం…పాకిస్తాన్ ఘోర ఓట‌మి

Asia Cup Rising Stars 2026: శివ‌రాత్రి రోజున టీమిండియా తాండ‌వం…పాకిస్తాన్ ఘోర ఓట‌మి
Advertisement

Asia Cup Rising Stars 2026:  ACC మహిళల ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 టోర్నమెంట్ లో ( ACC Women’s Asia Cup Rising Stars 2026 ) భాగంగా టీమిండియా జట్టు అదిరిపోయే విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ టోర్నమెంట్ ఫిబ్రవరి 13వ తేదీన ప్రారంభం కాగా ఇవాళ టీమిండియా మహిళల ఏ, పాకిస్తాన్ మహిళల ఏ జట్లు ( India A Women vs Pakistan A Women) తలపడ్డాయి. ఇందులో అద్భుతంగా రాణించిన టీమిండియా మహిళల జట్టు ఏకంగా 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రాధా యాదవ్ ( Radha Yadav ) కెప్టెన్ వ్యవహరించిన ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ 93 పరుగులు సాధించింది. ఇక ఈ లక్ష్యాన్ని కేవలం రెండు వికెట్లు నష్టపోయి 10.1 ఓవర్లలో చేదించింది టీమిండియా మహిళల జట్టు. దీంతో ఈ టోర్నమెంట్ లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది ఇండియా మహిళల A జట్టు.

Also Read: Inzamam ul haq: రేపటి మ్యాచ్ లో టీమిండియా షేక్ హ్యాండ్ ఇవ్వకపోతే, BCCIని రోడ్డుకు ఈడ్చుతా… ఇంజమామ్ హాట్ కామెంట్స్

శివ‌రాత్రి రోజున టీమిండియా తాండ‌వం…పాకిస్తాన్ ఘోర ఓట‌మి

Advertisement

ఒకవైపు టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament) కొనసాగుతున్న నేపథ్యంలో, మరోవైపు ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 టోర్నమెంట్ కూడా కొనసాగుతోంది. ఫిబ్రవరి 13వ తేదీన ప్రారంభమైన ఈ టోర్నమెంట్ ఫిబ్రవరి 22వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ టోర్నమెంట్ మొత్తం ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి. ఈ 8 జట్లను రెండు గ్రూపులుగా విడదీశారు. ఈ నేపథ్యంలోనే ఇండియా మహిళల జట్టు, పాకిస్తాన్ రెండు గ్రూపుల్లో స్థానం దక్కించుకున్నాయి. ఇక గ్రూప్ స్టేజిలో ఈ రెండు జట్ల మధ్య తాజాగా మ్యాచ్ జరిగింది. బ్యాంకాక్ లోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మహిళల జట్ల మధ్య ఆరవ మ్యాచ్ నిర్వహించారు. ఇందులో పాకిస్తాన్ మహిళల ఏ జట్టు మొదట బ్యాటింగ్ చేసింది.

ఈ సందర్భంగా 18.5 ఓవర్లు ఆడింది పాకిస్తాన్ మహిళల జట్టు. ఈ నేపథ్యంలోనే 93 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది పాకిస్తాన్ మహిళల జట్టు. ఈ మ్యాచ్ లో షావాల్ 23 పరుగులు సాధించగా గుల్ 21 పరుగులు సాధించింది. అయితే 94 పరుగుల లక్ష్యాన్ని చేదించే క్రమంలో ఇండియా ఆచితూచి ఆడింది. 10.1 ఓవర్లు ఆడింది టీమిండియా. ఈ తరుణంలో రెండు వికెట్లు నష్టపోయి మ్యాచ్ గెలిచింది. టీమిండియా మహిళల జట్టులో వ్రింద దినేష్ 55 పరుగులు చేసి దుమ్ము లేపింది. అటు అనుష్క శర్మ 24 పరుగులతో రెచ్చిపోయింది. ఇలా పురుషుల టీమిండియా కంటే మొదటగా మహిళల టీమిండియా పాకిస్తాన్ పై విజయం సాధించింది. కాగా ఇవాళ పురుషుల టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్లో భాగంగా కొలంబో వేదికగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగనుంది.

Advertisement

Also Read: AUS vs ZIM-IND WC Wins: జింబాబ్వే చేతిలో ఆస్ట్రేలియా ఓట‌మి..టీమిండియానే ఈ సారి ఛాంపియ‌న్‌…ఊరిస్తోన్న 1983, 2007 సెంటిమెంట్‌

 

 

 

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్..త‌న డ్రీమ్ టీమిండియాను ప్ర‌క‌టించిన ర‌విశాస్త్రి

శ్రీలంక‌లో షాహీన్ అఫ్రిదికి ఘోర అవ‌మానం…ప్రీమియ‌ర్ బౌల‌ర్ కాస్త..మీడియం అయ్యాడు

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

Big Stories

Advertisement
×