E-Paper
Advertisement

Mayor : మేయర్ పీఠంపై అన్ని పార్టీల గురి.. ఎవరికి చిక్కెనో!

Mayor : మేయర్ పీఠంపై అన్ని పార్టీల గురి.. ఎవరికి చిక్కెనో!
Advertisement

రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు ముగిశాయి.ఫలితాలు సైతం వెలువడ్డాయి. సుమారు 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో అధికార కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలను కైవసం చేసుకున్నది. మొత్తంగా ఎన్నికలు పూర్తవ్వడంతో తదుపరి ప్రక్రియ మేయర్, చైర్మన్‌ల ఎంపికపై అన్ని పార్టీలు ఫోకస్ పెట్టాయి. కాంగ్రెస్ పార్టీ 7 కార్పొరేషన్లను కైవసం చేసుకోవాలని ప్రయత్నిస్తుండగా.. కరీంనగర్ మేయర్ పీఠంపై తీవ్ర సస్పెన్స్ నెలకొన్నది. అక్కడ బీజేపీకి మెజార్టీ రాగా.. నలుగురు స్వతంత్ర అభ్యర్థులతో కలిసి మేయర్ పీఠం దక్కించుకోవాలని బీజేపీ చూస్తున్నది. ఇక మిగతా ఆరు కార్పొరేషన్లలో మూడింటిలో కాంగ్రెస్ పార్టీ నేరుగా మేయర్ స్థానాలను కైవసం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నది. మరో మూడింటిలో మాత్రం మిత్రపక్షాలతో కలిసి సీట్ షేరింగ్ కోసం కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.

కాంగ్రెస్‌కే చాన్స్..

రాష్ట్రంలో ప్రస్తుతం మేయర్ పీఠాలను ఏ పార్టీ కైవసం చేసుకోబోతున్నది అనే దానిపై తీవ్ర చర్చ జరుగుతున్నది. అధికార కాంగ్రెస్ మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటిన విషయం తెలిసిందే. నల్గొండ, మహబూబ్ నగర్, రామగుండం మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంది. సోమవారం మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగనుంది. ఇక కొత్తగూడెం కార్పొరేషన్‌లో సీపీఐ.. నిజామాబాద్‌ కార్పొరేషన్లో ఎంఐఎం పార్టీ మద్దతుతో పాలకవర్గాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ భావిస్తున్నది. చెరో రెండున్నరేండ్లు మేయర్ పదవులను మార్చుకునేలా ఒప్పందం చేసుకోబోతున్నారని చర్చ జరుగుతున్నది.ఇదే విషయంపై కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే సీపీఐతో చర్చలు జరపగా.. ఎంఐఎంతో త్వరలోనే చర్చలు జరపనున్నట్టు సమాచారం.

కరీంనగర్‌పై వీడని సస్పెన్స్..

Advertisement

కరీంనగర్ మేయర్ పీఠంపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతున్నది. మొత్తం 66 కార్పొరేటర్ స్థానాలు ఉండగా.. 30 వరకు బీజేపీ గెలుచుకున్నది. మిగతా నాలుగు నుంచి ఐదుగురు స్వతంత్ర అభ్యర్థులతో కలిసి మేయర్, డిప్యూటీ మేయర్ స్థానాలను పొందాలని బీజేపీ చూస్తున్నది. ఇప్పటికే నలుగురు స్వతంత్రులు బీజేపీలో చేరారు. అయితే, అందులో నుంచి ఇద్దరు స్వతంత్రులు బీజేపీ హ్యాండ్ ఇచ్చి అధికార పార్టీతో టచ్ లోకి వెళ్లినట్టు తెలుస్తున్నది. వీరితో పాటు ఎంఐఎం మద్దతు తీసుకుంటే కరీంనగర్ లోనూ కాంగ్రెస్ పాలక వర్గాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉన్నది.మరి కరీంనగర్ పీఠాన్ని బీజేపీ కైవసం ? కాంగ్రెస్ కైవలం చేసుకుంటుందా? అనేది రేపు తెలియనుంది. నిజామాబాద్, కరీంనగర్‌లో బీజేపీ పార్టీ మెజార్టీ స్థానాలు సాధించినా ఆ పార్టీకి మేయర్ పీఠం దక్కుతుందా? లేదా? అనేది సస్పెన్స్‌గా మారింది.

Congress Victory: రాష్ట్ర రాజకీయాలపై ఢిల్లీలో చర్చ.. రేవంత్ రెడ్డికి ప్రియాంక గాంధీ ప్రత్యేక అభినందనలు

బీఆర్ఎస్‌కు జీరో..

Advertisement

మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఒక్క కార్పొరేషన్‌లోనూ సత్తా చాటలేకపోయింది. కేవలం మున్సిపాలిటీల్లో మాత్రమే సత్తా చాటింది. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అన్నిమున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో సత్తా చాటిన గులాబీ పార్టీ ఈసారి మాత్రం కేవలం మున్సిపాలిటీల్లోనే ప్రభావం చూపింది. కార్పొరేషన్ ఎన్నికల్లో అతి తక్కువ స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. బీఆర్ఎస్ 15కు పైగా మున్సిపాలిటీల్లో సత్తా చాటగా.. కాంగ్రెస్ 50కు పైగా మున్సిపాలిటీలు కైవసం చేసుకుంది. మిగతా 34 మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడింది. ఈ స్థానాల్లో అధికార మార్పిడి ముఖ్యంగా బీఆర్ఎస్, బీజేపీ మధ్యే ఉంటుందని తెలుస్తోంది. కాంగ్రెస్ తన మిత్రపక్షమైన ఎంఐఎం, సీపీఐ పార్టీలతో కలిసి చైర్మన్, డిప్యూటీ చైర్మన్ స్థానాలను కైవసం చేసుకునే చాన్స్ ఉందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Related News

ఢిల్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026.. సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ వైరల్!

యూట్యూబ్‌లో చూసి నకిలీ నోట్ల తయారీ.. కానీ చివరికి ఎలా చిక్కాడంటే..?

హుజూరాబాద్‌లో మళ్లీ కాకరేపుతున్న రాజకీయ వేడి.. కాంగ్రెస్ వైఫల్యాలపై కౌశిక్ రెడ్డి భారీగా ధర్నా!

క్రికెట్ గ్రౌండ్ కోసం చెరువు కబ్జా చేస్తారా.. పట్టించుకోని అధికారులు!

ఆయనకు అన్నీ ఆశలు, కోరికలే ఉన్నాయి.. కేటీఆర్‌పై జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్!

తెలంగాణలో భారీ డిఫెన్స్ ఎక్స్‌పో.. రాజ్‌నాథ్ సింగ్‌కు రేవంత్ స్పెషల్ ఇన్విటేషన్!

కుషాయిగూడ పీహెచ్‌సీలో ఊహించని పరిణామం.. డాక్టర్‌గా మారిన డీఎంహెచ్‌ఓ!

సీఎం ఛాన్స్ వస్తే.. ఆ దేవుడు కూడా ఆపలేడు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Big Stories

Advertisement
×