UFP Area 51: గ్రహాంతర వాసులు ఉన్నారని ఫ్లయింగ్ సాసర్స్ లో అప్పుడప్పుడూ భూమిపైకి వస్తుంటారని తరచూ వార్తల్లో వినిపిస్తుంటుంది. వీటికి సంబంధించి వైరల్ వీడియోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటాయి. అయితే అమెరికాలోని అతి రహస్యమైన ఏరియా 51కు ఏలియన్స్ కు సంబంధం ఉందని అంటుంటారు. ఇక్కడ అమెరికా ఏలియన్స్ ను బంధించిందని ప్రచారంలో ఉంది. ఈ విషయాలపై యూఎస్ మాజీ అధ్యక్షుడు బరక్ ఒబామా ఓ పాడ్ కాస్ట్ లో స్పందించారు.
గ్రహాంతర జీవులు ఉన్నాయని తాను నమ్ముతున్నానని, అయితే గ్రహాంతర జీవులను ఏరియా 51లో దాచిపెట్టారనే ప్రచారాల్లో వాస్తవం లేదని బరక్ ఒబామా తేల్చిచెప్పారు. శనివారం విడుదలైన ఓ ఇంటర్వ్యూలో ఒబామాను ఏలియన్స్, మానవేతర మేధస్సు గురించి స్పందించారు. “ఏలియన్స్ నిజమే, కానీ నేను వాటిని చూడలేదు. వాటిని ఏరియా 51లో ఉంచలేదు. యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడికి తెలియకుండా దాచిపెడితే తప్ప. ఏరియా 51లో ఎలాంటి భూగర్భ సౌకర్యం లేదు” అని ఒబామా అన్నారు.
తాను అధ్యక్ష పదవిలో ఉన్నప్పుడు గ్రహాంతర వాసుల గురించి ఎలాంటి రహస్య ప్రదేశాలు లేదా వాటిని దాచిన సాంకేతికత గురించి తనకు తెలియదని స్పష్టం చేశారు. ఒబామా ప్రస్తావించిన ఏరియా 51.. నెవాడాలోని అత్యంత రహస్యమైన ప్రదేశాలలో ఒకటి. ఇది యూఎస్ వైమానిక దళానికి చెందిన ప్రదేశం. ఇక్కడ గ్రహాంతర అంతరిక్ష నౌకను స్వాధీనం చేసుకున్నారనే ప్రచారం ఉంది. వీటిలో 1947 రోస్‌వెల్ సంఘటనతో సంబంధం ఉందనే శిథిలాలు కూడా ఉన్నాయి.
ఇటీవల యూఎస్ అధికారులు.. గుర్తించలేని ఓ ఫ్లయింగ్సాసర్ ఫుటేజ్‌ను విడుదల చేసింది. దీంతో ఏలియన్స్ ప్రచారం మరింత తీవ్రమైంది. గతంలో ఆ వీడియోలను చూశానని ఒబామా అన్నారు. అయితే ప్రభుత్వం వివరించలేని విధంగా అవి కదులుతున్నట్లు తెలిపారు. అయినప్పటికీ, గ్రహాంతర వాసులను దాచినట్లు ఎటువంటి రుజువు లేదని ఆయన అన్నారు.
Also Read: అమెరికాలో తెలుగు యువతి దారుణ హత్య.. హైదరాబాద్ చేరుకున్న నిఖిత మృతదేహం
అమెరికాలోని నెవాడలో ఉన్న “ఏరియా 51” యూఎస్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన అత్యంత రహస్య ప్రదేశం. ఇక్కడ అమెరికా సైన్యం, శాస్త్రవేత్తలు.. అత్యాధునిక టెక్నాలజీతో కూడిన వెపన్స్, టెక్నాలజీలను పరీక్షిస్తుంది. అలాగే సైనికులకు శిక్షణ ఇస్తుంది. ఈ రహస్య స్థావరాన్ని అమెరికా 1955లో ఏర్పాటు చేసింది. నెవాడ ఎడారిలో 200 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఏరియా 51 ఉంది. గతంలో లాక్‌హీడ్ మార్టిన్ U-2 విమానాలను పరీక్షించారు. రహస్య ఫైటర్ జెట్లను పరీక్షిస్తారు.