టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య నవంబర్ 14వ తేదీ నుంచి సిరీస్ ప్రారంభం కానుంది. 14వ తేదీ నుంచి ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈ రెండు జట్ల మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతుంది. టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య రెండు టెస్టులు జరిగిన తర్వాత వెంటనే వన్డే సిరీస్ ప్రారంభమవుతుంది. నవంబర్ 30వ తేదీ నుంచి 3 వన్డేల సిరీస్ జరగనుంది. అయితే శ్రేయాస్ అయ్యర్ కోలుకోవడానికి మరో 30 రోజుల సమయం పడుతుందట. ఆ తర్వాత ఫిట్నెస్ టెస్ట్, యోయో టెస్టులు ఉంటాయి. ఆలోపు దక్షిణాఫ్రికాతో జరిగే మూడు వన్డేల సిరీస్ పూర్తి అవుతుంది. టీ20 సిరీస్ ప్రారంభం అవుతుంది.
Also Read: IPL 2026: SRH నుంచి ట్రావిస్ హెడ్ ఔట్…రంగంలోకి రోహిత్ శర్మ..కావ్య పాప ప్లాన్ అదుర్స్ ?
అంటే ఈ లెక్కన టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య జరిగే వన్డే సిరీస్ కు దూరం కాబోతున్నాడు శ్రేయాస్ అయ్యర్. ఇక ఈ వన్డేలు ఆడకపోతే, మరో ఏడు నుంచి ఎనిమిది నెలల వరకు టీమిండియా తరఫున ఆడే అవకాశం శ్రేయాస్ అయ్యర్ కోల్పోయే ప్రమాదం ఉంది. టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో శ్రేయాస్ అయ్యర్ కు జట్టులో అవకాశం వస్తే, మళ్లీ ఫిబ్రవరిలో టీమిండియా తరఫున ఆడుతాడు.
టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన మూడవ వన్డే సందర్భంగా శ్రేయాస్ అయ్యర్ కు తీవ్ర గాయం అయింది. ఈ గాయం నేపథ్యంలో అతనికి ఐసీయూలో చికిత్స అందించారు. దాదాపు రెండు రోజులపాటు ఐసీయూలో ఉన్న శ్రేయాస్ అయ్యర్ ఆ తర్వాత కోలుకున్నాడు. ఇంటర్నల్ బ్లీడింగ్ వల్ల శ్రేయాస్ అయ్యర్ ప్రమాదపు అంచు వరకు వెళ్లి వచ్చాడు. ఇక ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన శ్రేయాస్ అయ్యర్ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నాడు. దాదాపు నెల రోజుల తర్వాత మళ్లీ గ్రౌండ్ లో అడుగుపెట్టనున్నాడు.
Also Read: Virat Kohli Restaurant: గోవాపై కన్నేసిన విరాట్ కోహ్లీ..అదిరిపోయే హోటల్ లాంచ్, ధరలు వాచిపోతాయి
🚨 NO SHREYAS IYER IN SOUTH AFRICA SERIES 🚨
– Shreyas Iyer is doubtful for the ODI series against South Africa. (Express Sports). pic.twitter.com/CLQuV9tTlr
— Tanuj (@ImTanujSingh) November 11, 2025