BigTV English

Virat Kohli: గజదొంగగా మారిన కోహ్లీ… బుద్ధి చెప్పిన ధోని… RCB పరువు మొత్తం పోయిందిగా!

Virat Kohli: గజదొంగగా మారిన కోహ్లీ… బుద్ధి చెప్పిన ధోని… RCB పరువు మొత్తం పోయిందిగా!

Virat Kohli: ప్రస్తుతం ఎవరి నోట విన్న ఒకటే మాట.. అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ {ఏఐ}. ఈ టెక్నాలజీ హవా మామూలుగా లేదు. ఈ ఏఐ కి ప్రస్తుతం డిమాండ్ పెరుగుతుంది. ఇప్పుడు ఏ రంగంలో చూసినా ఈ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ఏఐ ప్రపంచాన్ని శాసించే దిశగా అడుగులు వేస్తుంది. ఈ సరికొత్త టెక్నాలజీ చేయని అద్భుతం లేదంటూ దూసుకుపోతుంది. ఇప్పటికే ఎన్నో రంగాలలో ఈ ఏఐ టెక్నాలజీ వినియోగం అనివార్యంగా మారింది. ఈ టెక్నాలజీని టెక్ కంపెనీలు మొదలు.. ఈ కామర్స్ కంపెనీల వరకు ఉపయోగిస్తున్నాయి. పలు కంపెనీలు సైతం ఏఐ కోసం భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి.


Also Read: Shubman Gill- Sara: ఇంగ్లాండ్ కు వెళ్లిన సారా… గిల్ కు ప్రేమ పాఠాలు చెబుతూ… వీడియో చేస్తే

ఓవైపు ఈ టెక్నాలజీ వల్ల ఉద్యోగాలు పోతాయన్న భయం ఉన్నా.. మరోవైపు కొత్త ఉద్యోగాలు లభిస్తాయి అన్న వార్తలు ఊరటనిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. ఈ ఏఐ టెక్నాలజీలో రోజురోజుకీ వస్తున్న మార్పులు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. గతంలో కేవలం మనం అడిగిన ప్రశ్నలకు మాత్రమే సమాధానాలు ఇచ్చే ఈ టెక్నాలజీ.. వీడియోలను కూడా అందిస్తుంది. ఇందులో భాగంగానే ఓపెన్ ఎఐ సంస్థ “సొర” అనే కొత్త ఏఐ మోడల్ ని పరిచయం చేసింది. ఇది మన ఊహకు వాస్తవ దృశ్య రూపాన్ని ఇస్తుంది. మనం ఎంటర్ చేసే టెక్స్ట్ కి వీడియోలను క్రియేట్ చేస్తుంది. మీ ఊహకు నచ్చిన విధంగా ఏదైనా టెక్స్ట్ ఇస్తే.. వెంటనే దానిని వీడియో రూపంలోకి మార్చేస్తుంది. వాస్తవానికి దగ్గరగా తీసుకువెళ్లే ఉద్దేశంలో భాగంగానే కంపెనీ ఈ సొరను పరిచయం చేసింది.


ప్రస్తుతం కేవలం తక్కువ సమయం నిడివి ఉండే వీడియోలను మాత్రమే క్రియేట్ చేసే ఈ టెక్నాలజీ.. భవిష్యత్తులో ఈ వీడియోల సమయాన్ని మరింత పెంచుతుందని ఓపెన్ ఏఐ చెబుతుంది. ఇప్పటికే ఈ టెక్నాలజీ రూపొందించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రూపొందించిన మార్ఫింగ్ వీడియోలు గతంలో సంచలనం సృష్టించాయి. వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలు కూడా వీటి బారిన పడ్డారు. అయితే ఇప్పుడు టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ టార్గెట్ గా ఇలాంటి ఏఐ ద్వారా క్రియేట్ చేసిన వీడియో బారిన పడ్డాడు. ఈ వీడియోలో విరాట్ కోహ్లీని ఓ గజదొంగ గా చూపించారు.

గజదొంగగా మారిన కోహ్లీ..?

వైరల్ గా మారిన ఈ వీడియో విషయానికి వస్తే.. ” విరాట్ కోహ్లీ.. ఓ చిన్న పాపతో అడుక్కుంటూ కనిపిస్తాడు. అయితే అతడిని చూస్తూ మరో భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ వెక్కిరిస్తాడు. దీంతో విరాట్ కోహ్లీ ఆగ్రహానికి గురవుతాడు. అనంతరం విరాట్ కోహ్లీ – ధోని ఒకరితో ఒకరు తలపడతారు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ డబ్బుల గురించి ఆలోచనలో పడతాడు. దీంతో దొంగతనం చేయాలని అతడిలో ఆలోచన వస్తుంది. అక్కడినుండి నేరుగా చెన్నై సూపర్ కింగ్స్ బంగ్లాలోకి ఎంటర్ అవుతాడు. ఆ బంగ్లాలో ఉన్న లాకర్ కి బాంబుని ఫిక్స్ చేసి.. అందులో ఉన్న డబ్బు, బంగారంతో బైక్ పై పారిపోతాడు. అందులో ఉన్న ఓ బంగారం బిస్కెట్ తో ఆ పాప కోసం పానీ పూరిని కొనుగోలు చేస్తాడు.

Also Read: Sachin – Gill: గిల్ కు ఎక్కడో మచ్చ ఉంది.. సచిన్ సంచలన పోస్ట్.. పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టేనా!

ఈ రాబరీ విషయం గురించి మహేంద్రసింగ్ ధోని పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. ఇక్కడ పోలీస్ ఆఫీసర్ గా సచిన్ టెండూల్కర్ ని చూపించారు. అనంతరం సచిన్ టెండుల్కర్ విరాట్ కోహ్లీని అరెస్ట్ చేసి తీసుకువెళ్తాడు. ఆ తర్వాత కోహ్లీ కొనుగోలు చేసిన ఆ పానీపూరీలని ఆ చిన్నారి వద్దకు చేరుస్తారు. అనంతరం టీవీలో కోహ్లీ అరెస్ట్ ని చూసి ఆ చిన్నారి బాధపడుతుంది”. ఈ వీడియోని {CRVK} అనే పేజ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వీడియో చూసిన కొంతమంది నెటిజన్లు నవ్వుకుంటూ ఉంటే.. విరాట్ కోహ్లీ అభిమానులు మాత్రం తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

?utm_source=ig_web_copy_link

Related News

Rahul Dravid : రాహుల్ ద్రావిడ్ ఎప్పుడైనా సిక్స్ లు కొట్టడం చూశారా.. ఇదిగో వరుసగా 6,6,6… వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే

Mohammed Siraj : ప్రియురాలితో రాఖీ కట్టించుకున్న టీమిండియా ఫాస్ట్ బౌలర్!

Free Hit : ఇకపై వైడ్ బాల్ కు కూడా Free Hit ఇవ్వాల్సిందే.. ఎప్పటినుంచి అంటే ?

Sanju Samson : ఆ 14 ఏళ్ల కుర్రాడి వల్లే….RR నుంచి సంజూ బయటకు వెళ్తున్నాడా!

Akash deep Car : రక్షాబంధన్… 50 లక్షల కారు గిఫ్ట్ ఇచ్చిన టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఆకాష్

RCB – Kohli: ఛత్తీస్‌గఢ్ బుడ్డోడికి కోహ్లీ, డివిలియర్స్ కాల్స్.. రజత్ ఫోన్ దొంగతనం చేసారా ?

Big Stories

×