Imran – Fish Venkat: టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా, కమెడీయన్ గా ఎన్నో అద్భుతమైన పాత్రలలో నటించి ప్రేక్షకులను కడుపుబ్బా నవించిన వారిలో నటుడు ఫిష్ వెంకట్ (Fish Venkat)ఒకరు. ఆది సినిమాతో వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చిన ఈయన తెలుగులో స్టార్ హీరోలు అందరి సరసన నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ముఖ్యంగా గబ్బర్ సింగ్ సినిమా ఈయనకు ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను తీసుకువచ్చాయి. ఇలా కెరియర్ పరంగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్న ఫిష్ వెంకట్ గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న నేపథ్యంలో సినిమాలకు కూడా దూరంగా ఉన్నారు.
వెంటిలేటర్ పై ఫిష్ వెంకట్..
ఇలా గతంలో అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఈయన ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న పవన్ కళ్యాణ్(Pawan Kalyan) సుమారు రెండు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేశారు. అయితే ఇటీవల ఈయన రెండు కిడ్నీలో పూర్తిగా పాడవడంతో డయాలసిస్ చేయించుకుంటూ కాలం వెళ్ళదీస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించిన నేపథ్యంలో హైదరాబాదులోని బోడుప్పల్ RBM హాస్పిటల్లో చేర్పించి వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు. ఇలా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఈయనకు ఆర్థిక సహాయం చేయాలంటూ ఆయన భార్య కుమార్తె రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలతో పాటు సినిమా ఇండస్ట్రీని కూడా వేడుకున్నారు.
అండగా నిలిచిన ఇమ్రాన్ ఖాన్..
ఇలా ఫిష్ వెంకట్ ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న ప్రభాస్(Prabhas) పిఏ కాల్ చేశారంటూ వార్తలు వచ్చాయి కానీ అది పూర్తిగా ఫేక్ కాల్ అని వెళ్లడయ్యింది. ఇలా ఫిష్ వెంకట్ గురించి గత వారం రోజులుగా పెద్ద ఎత్తున మీడియాలోనూ, సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నా ఇప్పటివరకు మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఏ ఒక్క సెలబ్రిటీ కూడా స్పందించకపోవడం విడ్డూరం. అయితే ఫిష్ వెంకట్ ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న ప్రముఖ యూట్యూబర్ ఇమ్రాన్ ఖాన్(Imran Khan) స్పందిస్తూ స్వయంగా హాస్పిటల్ కి వెళ్లి ఫిష్ వెంకట్ ని పరామర్శించి ఆయన కుటుంబ సభ్యులకు కొంతమేర ఆర్థిక సహాయం చేశారు.
ఇమ్రాన్ ఖాన్ ఆర్థిక సహాయం
ఇమ్రాన్ ఖాన్ వెంకట్ కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ ప్రస్తుతానికి తాను ఈ సహాయం చేశానని అవసరమైతే వెంటనే తనకు ఫోన్ చేయమని కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు. చిన్నప్పుడు నుంచి ఫిష్ వెంకట్ అన్నని చూస్తున్నాను తన కామెడీతో అందరినీ నవ్వించారు కానీ ఇప్పుడు తనని ఇలా చూసి తట్టుకోలేకపోయాను అంటూ ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. ఇలా ఒక యూట్యూబర్ ఫిష్ వెంకట్ కు ఆర్థిక సహాయం చేయడంతో ఈయనపై పెద్ద ఎత్తున ప్రశంసలు కురిపించడమే కాకుండా టాలీవుడ్ హీరోలపై తీవ్రస్థాయిలో విమర్శలు కురిపిస్తున్నారు. ఫిష్ వెంకట్ దాదాపు అందరి హీరోలతో పనిచేశారు కనీసం ఒక్క హీరో కూడా ఆయన విషయంలో స్పందించకపోవడం నిజంగా బాధాకరమైన విషయమనే చెప్పాలి. మరి ఇప్పటికైనా టాలీవుడ్ హీరోలు స్పందిస్తారా? ఫిష్ వెంకట్ కు అండగా నిలుస్తారా అనేది తెలియాల్సి ఉంది.
Also Read: కన్నప్ప భక్తి కోసం కాదు డబ్బు కోసమే.. వాళ్లని చూస్తే చిరాకేస్తుంది!