BigTV English

Sachin – Gill: గిల్ కు ఎక్కడో మచ్చ ఉంది.. సచిన్ సంచలన పోస్ట్.. పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టేనా!

Sachin – Gill: గిల్ కు ఎక్కడో మచ్చ ఉంది.. సచిన్ సంచలన పోస్ట్.. పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టేనా!

Sachin – Gill: ఎడ్జ్ బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో జరిగిన రెండవ టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా నూతన కెప్టెన్ శుభ్ మన్ గిల్ 269 పరుగుల సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. కెప్టెన్ గా తన తొలి టెస్ట్ డబుల్ సెంచరీ తో దుమ్మురేపాడు. ఈ నేపథ్యంలో గిల్ పలు రికార్డులను బద్దలు కొట్టాడు. ఇంగ్లాండ్ లో భారత జట్టు తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోర్ నమోదు చేసిన ప్లేయర్ గా రికార్డ్ సాధించాడు. హెడింగ్లీ లో జరిగిన తొలి టెస్ట్ లో 147 పరుగులు చేసిన గిల్.. రెండవ టెస్ట్ లోను అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడాడు.


Also Read: Jasprit Bumrah: వద్దురా నాయనా… బుమ్రా ఆడకపోతేనే టీమిండియా గెలుస్తుందా…? ఇదిగో ఈ లెక్కలు చూస్తే షాక్ అవ్వాల్సిందే

రెండవ టెస్ట్ లో పిచ్ బ్యాటింగ్ కి అనుకూలంగా ఉండడంతో వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని అద్భుతమైన నాక్ ఆడాడు. దీంతో ఇప్పటివరకు ఇంగ్లాండ్ లో భారత ఆటగాడిగా అత్యధిక టెస్ట్ స్కోర్ నమోదు చేసిన ప్లేయర్ గా నిలిచాడు. ఇక 2వ టెస్టులో ఇంగ్లాండ్ ను 336 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసింది భారత్. ఈ విజయంతో సిరీస్ ని 1 – 1 తో సమం చేయడమే కాకుండా.. ఎడ్జ్ బాస్టన్ లో తొలిసారి టెస్ట్ గెలిచి భారత్ చరిత్ర సృష్టించింది. ఈ నేపథ్యంలో భారత జట్టు ప్రదర్శన పై క్రికెట్ దిగజాలు ప్రశంసల వర్షం కురిపించారు.


గిల్ పై సచిన్ టెండూల్కర్ ప్రశంసలు:

గిల్ ఇన్నింగ్స్ ను అద్భుతమని అభివర్ణించాడు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్. ” సిరీస్ ని సమం చేసేందుకు భారత్ అనుసరించిన వ్యూహం అమోఘం. బౌలర్ల ప్రదర్శన, జో రూట్ కి ఆకాష్ దీప్ వేసిన బంతి.. ” బాల్ ఆఫ్ ది సిరీస్”. ఒత్తిడిలోనూ కెప్టెన్ గిల్ కూల్ గా ఉంటూ అద్భుతమైన బ్యాటింగ్ తో సెంచరీ చేశాడు. యశస్వి జైస్వాల్ కూడా మొదటి బంతి నుండే తన బ్యాటింగ్ అంటే ఏంటో చూపించాడు. వీరిద్దరి ఇన్నింగ్స్ లు సూపర్ గా ఉన్నాయి. ఇద్దరు కుర్రాళ్ళు క్లాసిక్ గేమ్ తో అదరగొట్టారు” అని పొగిడాడు. ఇలా సచిన్ టెండుల్కర్ గిల్ ని పొగుడుతూ పోస్ట్ చెయ్యడంతో.. గిల్ కి ఎక్కడో మచ్చ ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్లు.

గిల్ – సారా పెళ్లికి సచిన్ గ్రీన్ సిగ్నల్..?

ఈ ట్వీట్ ద్వారా గిల్ – సారా పెళ్లికి సచిన్ టెండూల్కర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లేనని మరికొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. అయితే సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ తో గిల్ ప్రేమాయణం నడుపుతున్నాడని చాలా కాలంగా సోషల్ మీడియాలో పుకార్లు షికారులు చేస్తున్న విషయం తెలిసిందే.

Also Read: Trolls On Gambhir: మ్యాచ్ లు గెలవాలంటే మంచి బౌలర్స్ ఉండాలి అంకుల్.. గంభీర్ పై దారుణంగా ట్రోలింగ్

ఈ రూమర్లను బేస్ చేసుకుని మీడియాలో సైతం అనేక కథనాలు వచ్చాయి. ఆ తర్వాత కొంతకాలానికి వీరు విడిపోయారని కూడా వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడు గిల్ ని పొగుడుతూ సచిన్ టెండూల్కర్ ఓ ట్వీట్ చేయడంతో.. ఈ రూమర్స్ మరోసారి తెరపైకి వచ్చాయి.

Related News

IND Vs PAK : దుబాయ్ స్టేడియంలో పాకిస్థాన్ ఫ్యాన్ పై దాడి… రంగంలోకి పోలీసులు!

Fakhar Zaman catch : టీమిండియా తొండాట‌…ఐసీసీకి పాకిస్థాన్ ఫిర్యాదు

Abhishek Sharma: అభిషేక్ శ‌ర్మకు గ్రౌండ్ లోనే ప్ర‌పోజ్‌..ఫ్లయింగ్ కిస్సులు ఇచ్చి మ‌రీ !

IND VS PAK: మ‌రోసారి టీమిండియా వ‌ర్సెస్ పాక్ మ్యాచ్‌..చ‌చ్చిన పామును మ‌ళ్లీ చంప‌డ‌మే

AK-47 Celebration: ధోని చేస్తే క‌రెక్ట్‌.. మేం చేస్తే త‌ప్పా…!

Haris Rauf: రఫేల్ కూల్చేశామంటూ హ‌రీస్ ర‌ఫ్ సెలబ్రేషన్..ఆడుకున్న ఫ్యాన్స్‌

Ind Vs Pak: చ‌ల్ పోరా పో….షాహిన్ అఫ్రీదిని బండ బూతులు తిట్టిన అభిషేక్‌…సిక్స్ కొట్టి మ‌రీ

IND VS PAK: అభిషేక్‌ దుమ్ములేపాడు… సూప‌ర్ 4 లోనూ టీమిండియా విజ‌యం.. షేక్ హ్యాండ్ మళ్ళీ లేదు

Big Stories

×