BigTV English

Shubman Gill- Sara: ఇంగ్లాండ్ కు వెళ్లిన సారా… గిల్ కు ప్రేమ పాఠాలు చెబుతూ… వీడియో చేస్తే

Shubman Gill- Sara: ఇంగ్లాండ్ కు వెళ్లిన సారా… గిల్ కు ప్రేమ పాఠాలు చెబుతూ… వీడియో చేస్తే

Shubman Gill- Sara: శుభ్ మన్ గిల్ భారత టెస్ట్ క్రికెట్ కి కెప్టెన్ అయిన తర్వాత టీమిండియా ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ పర్యటనలోని తొలి టెస్ట్ లో అద్భుత ప్రదర్శన చేసిన భారత జట్టు.. ఫీల్డింగ్ తోపాటు లోయర్ ఆర్డర్ బ్యాటింగ్ తప్పిదాలతో తొలి టెస్ట్ ని కోల్పోయింది. అయితే రెండవ టెస్టులో మాత్రం పుంజుకుని బ్యాటింగ్, బౌలింగ్ లో అదరగొట్టింది. బర్మింగ్ హమ్ లోని ఎడ్జ్ బాస్టన్ వేదికగా జరిగిన రెండవ టెస్టులో తొలి విజయాన్ని అందుకుంది.


Also Read: Sachin – Gill: గిల్ కు ఎక్కడో మచ్చ ఉంది.. సచిన్ సంచలన పోస్ట్.. పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టేనా!

భారత జట్టుకు చాలామంది లెజెండరీ ప్లేయర్లు కెప్టెన్ గా చేసినా.. ఈ ఎడ్జ్ బాస్టన్ లో విజయాన్ని అందించలేకపోయారు. కానీ గిల్ కెప్టెన్ గా తన తొలి సిరీస్ లోనే ఇక్కడ భారత్ కి విజయాన్ని అందించాడు. ఇప్పటివరకు ఈ స్టేడియంలో 8సార్లు ఆడిన భారత్ కి బంగపాటు ఎదురవగా.. తొమ్మిదవ సారి విజయం సాధించింది. అంతకుముందు ఓవర్ నైట్ స్కోర్ 72/3 తో 2వ ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లాండ్.. 68.1 ఓవర్లలో 271 పరుగులకు ఆల్ అవుట్ అయింది. దీంతో భారత జట్టు 337 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.


గిల్ రికార్డ్:

గిల్ ఒక్క టెస్ట్ మ్యాచ్ లో 430 పరుగులు చేయడం ద్వారా ఆసియా ఖండానికి చెందిన ఆటగాళ్లలో ఇప్పటివరకు ఎవరు చేయలేని రికార్డుని నెలకొల్పాడు. ప్రపంచవ్యాప్తంగా ఈ ఘనతను సాధించిన రెండవ ఆటగాడిగా నిలిచాడు. గిల్ కి ముందు కేవలం గ్రాహమ్ గూచ్ మాత్రమే 1990లో లార్డ్స్ వేదికగా భారత్ పై 456 పరుగులు చేశాడు. ఇక గిల్ కెప్టెన్సీలో భారత జట్టు పూర్తి సమన్వయంతో విజయాన్ని అందుకుంది. కెప్టెన్ గా గిల్ చేసిన స్ట్రాటజీలు, అతడు తీసుకున్న నిర్ణయాలు మ్యాచ్ పై ప్రభావం చూపించాయి.

ఎందరో సీనియర్ కెప్టెన్లు సాధించలేని రికార్డును కేవలం రెండు మ్యాచ్లలోనే సాధించడం అతడి భవిష్యత్తు కెప్టెన్సీకి మైలురాయిగా నిలవనుంది. దీంతో టీమిండియా మిగతా మూడు టెస్ట్ లలో కూడా గెలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇక ఈ రెండవ టెస్ట్ లో అద్భుత ప్రదర్శనతో గిల్ హాట్ టాపిక్ గా మారాడు. తొలి టెస్ట్ లో సెంచరీ తో ఆకట్టుకున్న అతడు.. రెండో టెస్ట్ లో రికార్డుల మూత మోగించే ఇన్నింగ్స్ ఆడాడు. రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో డబుల్ సెంచరీ, రెండవ ఇన్నింగ్స్ లో మరో సెంచరీతో అదరగొట్టాడు. ఇలా తన క్రికెట్ కెరీర్ లో రికార్డుల మీద రికార్డు నమోదు చేస్తున్న ఈ 25 ఏళ్ల ఈ యంగ్ క్రికెటర్.. ఇప్పుడు సోషల్ మీడియా గాసిప్స్ లోను హాట్ టాపిక్ గా మారాడు.

గిల్ – సారా వీడియో వైరల్:

దీంతో ఇప్పుడు మరోసారి గిల్ లవ్ గాసిప్స్ వైరల్ గా మారాయి. క్రికెట్ లెజెండ్ సచిన్ టెండుల్కర్ కూతురు సారా టెండూల్కర్ తో డేటింగ్ చేస్తున్నాడని గత కొద్ది సంవత్సరాలుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. గతంలో సోషల్ మీడియాలో వీరి ఫోటోలు కూడా వైరల్ కావడంతో ఈ రూమర్స్ ఊపందుకున్నాయి. దీంతో ఈ రూమర్స్ పై గిల్ స్పందిస్తూ.. ” నేను సంవత్సరాలుగా ఒంటరిగా ఉంటున్నాను. దయచేసి ఇలాంటి రూమర్స్ ని ఆపండి ” అని స్పష్టం చేశాడు.

Also Read: Jasprit Bumrah: వద్దురా నాయనా… బుమ్రా ఆడకపోతేనే టీమిండియా గెలుస్తుందా…? ఇదిగో ఈ లెక్కలు చూస్తే షాక్ అవ్వాల్సిందే

ఈ నేపథ్యంలో గిల్ – సారా డేటింగ్ పుకార్లకు ఎండ్ కార్డ్ పడింది. అయితే తాజాగా గిల్ – సారా గురించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ {ఏఐ} ద్వారా క్రియేటి చేసిన ఓ వీడియోని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. రెండో టెస్ట్ అనంతరం సారా.. మైదానంలోనే గిల్ కి ప్రేమ పాటలు చెబుతుందని కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

?utm_source=ig_web_copy_link

Related News

Akash deep Car : రక్షాబంధన్… 50 లక్షల కారు గిఫ్ట్ ఇచ్చిన టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఆకాష్

RCB – Kohli: ఛత్తీస్‌గఢ్ బుడ్డోడికి కోహ్లీ, డివిలియర్స్ కాల్స్.. రజత్ ఫోన్ దొంగతనం చేసారా ?

BCCI: కోహ్లీ, రోహిత్ కు ఎదురుదెబ్బ…2027 కోసం బీసీసీఐ కొత్త ఫార్ములా…గంభీర్ కుట్రలేనా ?

Rohit Sharma Lamborghini : రోహిత్ శర్మ కారు నెంబర్ వెనుక ఉన్న సీక్రెట్ ఇదే.. వాళ్లపై ప్రేమతో

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Big Stories

×