Ajmal Zadran On Haris Rauf Vs Will Jacks Clash: వన్డే ట్రై సిరీస్ (Pakistan ODI Tri-Series, 2026) నేపథ్యంలో ఆదివారం పాకిస్తాన్ వర్సెస్ ఇంగ్లాండ్ (Pakistan vs England, 4th Match) మధ్య నాలుగవ మ్యాచ్ జరిగింది. ఇందులో షాబాద్ ఖాన్ ఒంటరి పోరాటం చేసి పాకిస్తాన్ జట్టును గెలిపించాడు. ఈ క్రమంలో ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ విల్ జాక్స్ ( Will Jacks ), హారిస్ రవూఫ్ ( Haris Rauf ) మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సామ్ కరణ్ వేసిన బౌన్సర్ ను ఎందుకు వైడ్ ఇవ్వలేదని హారిస్ రవూఫ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు.
ఈ క్రమంలోనే విల్ జాక్స్ ను బ్యాట్ తో కొట్టేందుకు మీద మీదకు వెళ్లాడు. ఈ సంఘటనపై తాజాగా ఆఫ్ఘాన్ ప్లేయర్ అజ్మల్ జద్రాన్ ఫైరయ్యారు. పాకిస్తాన్ సన్యాసులకు ఇక జన్మలో సిగ్గురాదని హారిస్ రవూఫ్ పై మండిపడ్డారు. ఆతిథ్య జట్టు ప్లేయర్లను ఇలా బెదిరిస్తారా ? అంటూ ఫైర్ అయ్యారు. రౌడీల లాగా ప్రవర్తించి విల్ జాక్స్ ను అవమానించాడని ఫైర్ అయ్యారు. ఇలాంటోళ్ళను ఉరితీయాల్సిందేనని డిమాండ్ చేశారు. దీంతో ఆఫ్ఘాన్ ప్లేయర్ అజ్మల్ జద్రాన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
విల్ జాక్స్, హారిస్ రవూఫ్ గొడవపై ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు ఆఫ్ఘాన్ ప్లేయర్ అజ్మల్ జద్రాన్ (Ajmal Zadran) ఫైర్ అయ్యారు. పాకిస్తాన్ తీరు మొదటి నుంచి ఇలాగే ఉండేదని ఆగ్రహించారు. ఇప్పటికీ అలాగే ఓవరాక్షన్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. జావేద్ మియందాద్, షాహిద్ అఫ్రిది కాలం నుంచి హారిస్ రవూఫ్, షాహీన్ అఫ్రిది ఇప్పటి వరకూ మైదానంలో దూకుడుగా వ్యవహరిస్తూ వివాదాలకు తెర లేపుతూనే ఉన్నారని సీరియస్ అయ్యారు.
అతిధి ఆటగాళ్లకు ఇవ్వాల్సిన గౌరవం పాకిస్తాన్ లో దక్కదని విమర్శలు చేశారు. అతిథులకు ఇవ్వాల్సిన గౌరవం ఇస్తేనే మళ్లీ పాకిస్తాన్ కు వస్తారని.. లేకపోతే ఆ దేశం వైపు తలెత్తి కూడా చూడాలని ఆగ్రహించారు. హారిస్ రవూఫ్ పై వెంటనే ఐసీసీ చర్యలు తీసుకోవాలని ఆఫ్ఘాన్ ప్లేయర్ అజ్మల్ జద్రాన్ డిమాండ్ చేశారు. ఇది ఇలా ఉండగా ఆదివారం జరిగిన మ్యాచ్ లో ఇంగ్లాండ్ పై ఒకే ఒక్క వికెట్ తేడాతో పాకిస్తాన్ విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో 241 పరుగులు చేయగా ఈ లక్ష్యాన్ని తొమ్మిది వికెట్లు నష్టపోయి ఛేదించింది పాకిస్తాన్. షాబాద్ ఖాన్ ఒక్కడే 113 పరుగులు చేసి పాకిస్తాన్ గెలిపించాడు.
Pakistani cricket has always been full of bad behavior. From Miandad and Afridi to Shaheen and Haris Rauf, they have no discipline and no respect for guests. Haris Rauf’s disrespect towards guest player Will Jacks proves they always fail to show manners to guests in their own… https://t.co/lKTPxz8APJ
— Ajmal Zadran (@Ajmalzadran18) October 25, 2026