E-Paper
Advertisement

Daren Sammy : మా జ‌ట్టులో అంద‌రూ బాహుబ‌లులే..టీమిండియాపై మీద ప‌డిపోతారు, న‌ర‌కం చూపిస్తారు

Daren Sammy : మా జ‌ట్టులో అంద‌రూ బాహుబ‌లులే..టీమిండియాపై మీద ప‌డిపోతారు, న‌ర‌కం చూపిస్తారు

Daren Sammy :  టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో ( T20 World Cup 2026 tournament) భాగంగా ఇవాళ మరో కీలక మ్యాచ్ జరగనుంది. టీమిండియా వర్సెస్ వెస్టిండీస్ ( India vs West Indies) మధ్య సూపర్ 8 మ్యాచ్ ఇవాళ సాయంత్రం నిర్వహిస్తారు. కోల్కత్తాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ( Eden Gardens, Kolkata) రాత్రి 7 గంటలకు ఇండియా వర్సెస్ వెస్టిండీస్ మధ్య మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఇందులో గెలిచిన జట్టు సెమీ ఫైనల్ కు దూసుకు వెళ్తుంది. ఒకవేళ ఓడితే ఇంటిదారి పట్టాల్సిందే. ఈ నేపథ్యంలో రెండు జట్లు కసిగా ఆడేందుకు సిద్ధమయ్యాయి.

Also Read: Fakhar Zaman : పాకిస్తాన్ తో శ్రీలంక మ్యాచ్ ఫిక్సింగ్‌..లైవ్ మ్యాచ్ లోనే అండంగా దొరికిపోయారు, ఇదిగో వీడియో

మా జ‌ట్టులో అంద‌రూ బాహుబ‌లులే..టీమిండియాపై మీద ప‌డిపోతారు

టీమిండియా వర్సెస్ వెస్టిండీస్ మధ్య ఇవాళ ఈడెన్ గార్డెన్స్ వేదికగా మ్యాచ్ ఉన్న నేపథ్యంలో వెస్టిండీస్ జట్టు కోచ్ డారెన్ సమీ ( West Indies head coach Daren Sammy) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. టీమిండియాను ఓడించేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. తమ జట్టులో ఉన్న వాళ్లందరూ సైనికులు, బాహుబలులు అంటూ వ్యాఖ్యానించారు. మ్యాచ్ ప్రారంభం కాగానే టీమిండియాపైన పడిపోతారని, ఈ దెబ్బకు వాళ్ళు ఉక్కిరి బిక్కిరి అవుతారని వార్నింగ్ ఇచ్చాడు. యుద్ధానికి సిద్ధం అన్నట్లుగానే మా సైనికులు అందరూ రెడీ అయ్యారని వెల్లడించారు.

మా వాళ్లు రంగంలోకి దిగారు అంటే ఇండియాకు చుక్కలు చూపించడం గ్యారంటీ అంటూ ఓవర్ గా రియాక్ట్ అయ్యాడు డారెన్ సమీ. టీమిండియా మైనస్ పాయింట్లన్నీ తమకు తెలుసు అంటూ వ్యాఖ్యానించారు డారెన్ సమీ (Daren Sammy). అయితే వెస్టిండీస్ బ్యాటర్లు రెచ్చిపోతారన్న విషయం ఇప్పటికే గ్రహించిన టీమిండియా యాజమాన్యం.. వాళ్లను కట్టడి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. వరుణ్ చక్రవర్తిని వినియోగించి వెస్టిండీస్ జట్టును దెబ్బతీయాలన్న కుట్ర చేస్తోంది ఇండియా. కేకేఆర్ జట్టు ( KKR Team) తరఫున ఈడెన్ గార్డెన్స్ వేదికగా ( Eden Gardens, Kolkata) చాలా మ్యాచులు ఆడాడు వరుణ్ చక్రవర్తి ( Varun Chakravarthy). అందుకే అతనిని వాడి వెస్టిండీస్ ను దెబ్బ కొట్టేందుకు సిద్ధమైంది ఇండియా.

ఇండియా వ‌ర్సెస్ వెస్టిండీస్ జ‌ట్ల అంచ‌నా

ఇండియా ప్రాబబుల్ XI: సంజూ శాంసన్ (WK), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (c), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్

వెస్టిండీస్ ప్రాబబుల్ XI: బ్రాండన్ కింగ్, షాయ్ హోప్ (c & wk), షిమ్రాన్ హెట్మెయర్, రోవ్‌మన్ పావెల్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, రోస్టన్ చేజ్, రొమారియో షెపర్డ్, జాసన్ హోల్డర్, మాథ్యూ ఫోర్డే/అకేల్ హోసేన్, గుడాకేష్ మోటీ, షమర్ జోసెఫ్

Also Read: US Israel Iran War: టీ20 వ‌రల్డ్ క‌ప్ పై వార్ ఎఫెక్ట్..గ‌జ గ‌జ వ‌ణికిపోతోన్న ప్లేయ‌ర్లు..రంగంలోకి ఐసీసీ ( Eden Gardens, Kolkata)

 

Related News

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

బాబ‌ర్ పై ట్రోల్స్‌..ఇండియ‌న్స్ అనుకుని, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పాక్ !

మైదానంలోనే స్మోకింగ్..మ‌రో వివాదంలో టిమ్ డేవిడ్, ఇక ప‌ర్మినెంట్ బ్యాన్ !

టీమిండియాకు బిగ్ షాక్‌..బంగ్లాదేశ్ లోనే ఆసియా కప్ 2027, షెడ్యూల్ ఇదే

ఎలిమినేట‌ర్ లో ఓడిపోయిన‌ SRHకు ఊపిరిపోసిన పాకిస్తాన్ ప్లేయ‌ర్

రెండోసారి ఛాంపియ‌న్ గా RCB..ప్ర‌మాదంలో సూర్య‌, శ్రేయ‌స్ అయ్య‌ర్ భ‌విష్య‌త్తు !

Tanveer Ahmed: విరాట్ కోహ్లీ మ‌గాడైతే, పాకిస్తాన్ పిచ్ ల‌పై ఆడి చూపించాలి

లాహోర్ గ‌డ్డ‌పై విరాట్ కోహ్లీ ప్లకార్డులు…గూస్ బంప్స్ రావాల్సిందే

Big Stories

×