E-Paper
Advertisement

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (21/11/2025) ఆ రాశి ఉద్యోగులకు ప్రమోషన్లు – నిరుద్యోగులకు శుభ వార్తలు

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (21/11/2025) ఆ రాశి ఉద్యోగులకు ప్రమోషన్లు – నిరుద్యోగులకు శుభ వార్తలు
Advertisement

Today Horoscope:

ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన నవంబర్‌ 21వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

మేష రాశి:  

వ్యాపార, ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి. బంధువులతో అకారణ వివాదాలు తప్పవు. పితృ వర్గీయులతో వివాదాలు కొంత చికాకు పరుస్తాయి. చేపట్టిన పనులలో ప్రతిష్టంభన కలుగుతాయి. రెండు రకములైన ఆలోచన వల్ల నష్టాలు తప్పవు. కొన్ని వ్యవహారాలు దైవానుగ్రహంతో పూర్తి చేస్తారు.

వృషభ రాశి:

Advertisement

ఇతరుల పై మీ ఆలోచనా విధానం మార్చుకోవడం మంచిది. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. పనుల్లో ప్రతిబంధకాలు ఉంటాయి. ఉద్యోగాలలో స్థానచలన సూచనలు ఉన్నవి. జీవిత భాగస్వామితో ఊహించని వివాదాలు కలుగుతాయి. సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు వాయిదా వేస్తారు.

మిథున రాశి:  

వ్యాపారాల్లో ఆశించిన విధంగా రాణిస్తాయి. నూతన విషయాలపై దృష్టి సారిస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగంలో అధికారులతో చర్చలు ఫలిస్తాయి. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.  

కర్కాటక రాశి:

Advertisement

ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. ఇంటా బయట అందరితో సఖ్యతగా వ్యవహరిస్తారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపార ఉద్యోగాలలో సమస్యలు అధిగమిస్తారు. ఒక వ్యవహారంలో సన్నిహితులు సహాయ సహకారాలు అందుతాయి. చేపట్టిన పనులలో యత్న కార్యసిద్ధి కలుగుతుంది.
.  

సింహరాశి:

చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. ఆర్థికంగా మరింత మెరుగైన పరిస్థితులు ఉంటాయి. సంతానానికి నూతన విద్యా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. 

కన్యారాశి :

ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు. బంధుమిత్రులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. బంధుమిత్రులు మీ మాటతో విబేదిస్తారు. వ్యాపార, ఉద్యోగాలు మందగిస్తాయి. నూతన ప్రయత్నాలు చేస్తారు. వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు నిలకడగా ఉండవు. 

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

తులారాశి:

స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. కొన్ని విషయాలలో ఆత్మీయుల సహాయ సహకారాలు అందుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు లోటు ఉండదు..

వృశ్చికరాశి:

వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుంచి ఒత్తిడి అధికమవుతుంది. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. నిరుద్యోగులకు ఒక వార్త సంతోషాన్నిస్తుంది. చేపట్టిన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి.

ధనస్సు రాశి:

బంధువులతో వివాదాలు పరిష్కారమవుతాయి. చిన్ననాటి మిత్రుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగుతారు. వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.

మకరరాశి:

దూరప్రయాణ సూచనలున్నవి. స్వల్ప ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు కలుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బంది కలిగిస్తుంది. నూతన ఋణప్రయత్నాలు కలసిరావు. చేపట్టిన పనులలో శ్రమపడ్డా ఫలితం కనిపించదు.

కుంభరాశి:

వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. ముఖ్యమైన పనులు సమయానికి పూర్తిచేస్తారు. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు ప్రారంభిస్తారు. అందరిలోనూ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఇంటా బయట ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి.
.

మీనరాశి:

వృత్తి ఉద్యోగాలలో అధికారులు అనుగ్రహంతో పదోన్నతులు పెరుగుతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. నూతన వ్యాపారాలు పెట్టుబడులు అందుతాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. మొండి బకాయిలు వసూలవుతాయి.

ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

 

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×