E-Paper
Advertisement

Bigg Boss 9 Telugu : కళ్యాణ్ తల్లికి తనూజా స్పెషల్ గిఫ్ట్… పర్సనల్ కాదంటూనే ఇదేం పని పాపా?

Bigg Boss 9 Telugu : కళ్యాణ్ తల్లికి తనూజా స్పెషల్ గిఫ్ట్… పర్సనల్ కాదంటూనే ఇదేం పని పాపా?

Bigg Boss 9 Telugu : బిగ్ బాస్ సీజన్ 9లో రెండు ఇంట్రెస్టింగ్ లవ్ ట్రాక్స్ నడుస్తున్నాయి. ఒకటి డెమోన్ – రీతూ జంట, మరొకటి కళ్యాణ్ – తనూజ జంట. వీళ్ళు నలుగురూ తాము కేవలం ఫ్రెండ్స్ మాత్రమే అని చెప్పుకుంటున్నా, ఆడియన్స్ మాత్రం వాళ్ళను లవర్స్ లాగే చూస్తున్నారు. ముఖ్యంగా కళ్యాణ్ – తనూజ మధ్య నడుస్తున్న లవ్ ట్రాక్ ఈ సీజన్ కే స్పెషల్ అట్రాక్షన్. మెచ్యూర్డ్ గా బిహేవ్ చేస్తూనే ఒకరంటే ఒకరు బాగా కేరింగ్ తీసుకుంటారు. తాజాగా తనూజా కళ్యాణ్ తల్లికి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చి అందరి దృష్టిని ఆకర్షించింది.

కళ్యాణ్ తల్లికి చీర పెట్టి పంపిన తనూజ

కళ్యాణ్ – తనూజ ఒకరికొకరు దూరంగా ఉంటూనే కేరింగ్ చూపించుకుంటారు. ఎన్ని వివాదాలు చుట్టుముట్టినా వీళ్ళ బంధం బలపడిందే తప్ప బలహీనం కాలేదు. కానీ తాజాగా ఆ బంధం మరో మెట్టు ఎక్కినట్టుగా కన్పించింది. కళ్యాణ్ తల్లి లక్ష్మి ఫ్యామిలీ వీక్ సందర్భంగా హౌస్ లో సందడి చేసిన సంగతి తెలిసిందే. ఆ టైంలో కళ్యాణ్ ‘ఫ్యామిలీకి కొంచం ప్రైవసీ ఇవ్వండి’ అని హౌస్ మేట్స్ ను రిక్వెస్ట్ చేశాడు. తనూజా తప్ప అందరూ వెళ్లిపోయారు అక్కడి నుంచి. ఇక తనూజా కళ్యాణ్ తల్లితో ‘వీడి లవ్ స్టోరీ గురించి చూశారా ?’ అని అడిగింది. ‘పాత్రధారి, సూత్రధారి ఆవిడే. నేనేం మాట్లాడక పోయేవాడిని. వాళ్ళే ఎక్కువ మాట్లాడుకునే వాళ్ళు’ అని చెప్పాడు కళ్యాణ్. ‘మేమేం కావాలని ఆ అమ్మాయిని దూరం పెట్టలేదు’ అని చెప్పింది కళ్యాణ్ తల్లి. ఇక ఆమె వెళ్తుండగా, తనూజా చీర పెట్టి పంపించింది.

తనూజా ఎందుకలా చేసింది ?

సాధారణంగా ఇంటికి ప్రత్యేక అతిథులు వచ్చినప్పుడు మర్యాదల్లో భాగంగా చీరలు పెడుతూ ఉంటారు. తనూజ కూడా అదే విధంగా చేసింది. “అలా ఎందుకు చేశావ్ ? నీ నుంచి నేనేమీ ఎక్స్పెక్ట్ చేయను. నువ్వు బాగుండడానికి ఏమైనా చేస్తా” అని అన్నాడు కళ్యాణ్. “ఈ ఇంట్లో నన్ను సపోర్ట్ చేస్తూ, ఫ్యామిలీ మెంబర్ లాగా బాగా చూసుకున్నావ్. ఈ 4 వీక్స్ అయ్యాక ఎవరిదారి వాళ్ళది. అంతలోపే మీ అమ్మ వచ్చారు కదా అందుకే ఇలా. అంతేగానీ ఇందులో పర్సనల్ ఏమీ లేదు” అని క్లారిటీ ఇచ్చింది. కానీ తనూజా చేసిన ఈ పని వల్ల కళ్యాణ్ తో పాటు అతని అభిమానులు, ఆడియన్స్ కూడా ఫిదా అయ్యారు. మరి వీళ్ళ బంధం బయటకు వెళ్ళాక కూడా ఇలాగే సాగుతుందా ? లేదా హౌస్ లో మాత్రమే ఉంటుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.

Read Also : రీతూ తల్లి రియాక్షన్ తో బిక్క మొహం వేసిన డెమోన్… బంధానికి బ్రేక్ ?

Related News

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Bigg Boss : నటికి శాపంగా మారిన బిగ్ బాస్.. ఇప్పుడేం చేస్తుందంటే..?

ట్రోలర్స్ ఇనయా దిమ్మతిరిగే కౌంటర్.. కాన్ఫిడెంట్ కు మెచ్చుకోవాల్సిందే..!

Bigg Boss Soniya: గిన్నీస్ బుక్ లో సోనియా కూతురికి చోటు.. ఏం చేసిందో తెలుసా..?

Demon Pawan : వివాదంలో బిగ్ బాస్ కంటెస్టెంట్ డిమాన్.. ఆగని ట్రోల్స్..!

బిగ్ బాస్ నటితో సిరాజ్ డేటింగ్.. సంచలనం సృష్టిస్తున్న వీడియో!

Big Stories

×