E-Paper
Advertisement

PCBకి మ‌రో త‌ల‌నొప్పి..పాకిస్తాన్ మ‌హిళా క్రికెట‌ర్ల‌ను వేధించిన వహాబ్ రియాజ్

PCBకి మ‌రో త‌ల‌నొప్పి..పాకిస్తాన్ మ‌హిళా క్రికెట‌ర్ల‌ను వేధించిన వహాబ్ రియాజ్
Advertisement

Wahab Riaz Abusing Players: మహిళల టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ (ICC Women’s T20 World Cup 2026) రేపటి నుంచి ప్రారంభం కానుంది. దాదాపు 25 రోజుల పాటు కొనసాగే ఈ మెగా టోర్నమెంట్ ఇంగ్లాండ్ వేదికగా జరుగుతోంది. రేపు ఇంగ్లాండు వర్సెస్ శ్రీలంక మహిళల జట్ల మధ్య తొలి మ్యాచ్ అర్ధరాత్రి ప్రారంభం కానుంది. అలాగే ఈ టోర్నమెంట్ లో భాగంగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జూన్ 14వ తేదీన అంటే ఆదివారం ఉంటుంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చాలా ఫాస్ట్ గా జరుగుతున్నాయి. ఇలాంటి క్రమంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు కొత్త తలనొప్పి వచ్చి పడింది. పాకిస్తాన్ మహిళా క్రికెటర్లను మెంటల్ గా ఉన్న మాజీ ఫాస్ట్ బౌలర్ వహాబ్ రియాజ్ ( Wahab Riaz ) దారుణంగా వేధిస్తున్నాడట. నోటికి వ‌చ్చిన బూతులు ( Wahab Riaz Abusing Players) తిడుతున్నాడ‌ట‌. డ్రెస్సింగ్ రూమ్ లో చుక్కలు చూపిస్తున్నాడట. ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

Also Read: Manav Sutar’s career changed with superstition: మూఢనమ్మకాల‌తో మాన‌వ్ సుతార్ కెరీర్ ఛేంజ్…6 వికెట్లు తీసి 38 ఏళ్ల రికార్డ్ బ్రేక్ చేసిన‌ జ‌డేజా వార‌సుడు

పాకిస్తాన్ మ‌హిళా క్రికెట‌ర్ల‌ను వేధించిన వహాబ్ రియాజ్

Advertisement

మహిళల టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ (ICC Women’s T20 World Cup 2026) రేపటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ జట్టులో కలకలం చోటు చేసుకుంది. ఇంగ్లాండ్ లో ఉన్న పాకిస్తాన్ మహిళా క్రికెటర్లతో మెంటర్ వహాబ్ రియాజ్ దారుణంగా ప్రవర్తిస్తున్నారట. వరల్డ్ కప్ లో బాగా ఆడాలని.. వాళ్లకు దిశా నిర్దేశం చేస్తూ, ఒత్తిడి విపరీతంగా పెంచుతున్నాడట. వాళ్ల సామర్థ్యానికి మించి ప్రాక్టీస్ చేయిస్తున్నాడట. అయితే ఇందులో ఓ మహిళా క్రికెటర్ తనకు రెస్ట్ కావాలని అడిగితే.. డ్రెస్సింగ్ రూమ్ లో అత్యంత దారుణంగా పచ్చి బూతులు తిట్టాడట వహాబ్ రియాజ్. ఆమె ప్రైవేట్ పార్ట్స్ ను టార్గెట్ చేసి, రెచ్చిపోయాడ‌ని అంటున్నారు రియాజ్.

మిగిలిన పాకిస్తాన్ క్రికెటర్లను కూడా డ్రెస్సింగ్ రూమ్ లో చాలా వేధిస్తున్నాడట. వరల్డ్ కప్ కొట్టకపోతే మీ అంత చూస్తానని బెదిరిస్తున్నాడట. అయితే ఈ వేధింపులు భరించలేక ఓ మహిళా క్రికెటర్… పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కు ఫిర్యాదు చేసినట్లు కథనాలు వస్తున్నాయి. ఈ క్రమంలో రంగంలోకి దిగిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు, దీనిపై విచారణ కూడా ఇంటర్నల్ గా మొదలు పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో వహాబ్ రియాజ్ తప్పు చేశాడని తేలితే… అతనిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోందట పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. అయితే ఈ టి 20 ప్రపంచ కప్ పూర్తయిన వెంటనే యాక్షన్ ఉంటుందని కూడా తెలుస్తోంది. అప్పటివరకు పాకిస్తాన్ మహిళా క్రికెట్ జట్టును డిస్టర్బ్ చేయకూడదని అనుకుంటున్నారట. టోర్నమెంట్ ఫినిష్ కాగానే వహాబ్ రియాజ్ మెడపై కత్తి వేలాడడం గ్యారంటీ అంటున్నారు.

Advertisement

Also Read: Litton Das ON T20 World Cup 2026 : పాకిస్తాన్ లో అడుగుపెట్టాలంటే గన్ మెన్లను పెట్టుకోవాల్సిందే..బంగ్లా క్రికెటర్ సంచలనం

Related News

సంజు కంటే అభిషేక్ శ‌ర్మ పెద్ద‌ పోటుగాడా? అంద‌రికీ ఒకే రూల్స్ ఉండాలి

పసికూన‌ జింబాబ్వే పైన గెలవడం కాదు…మ‌గాళ్లు అయితే మాపై గెల‌వండి!

పాకిస్తాన్ ఘోర అవ‌మానం…ఏ ఒక్క కామెంటేటర్ ను పిల‌వ‌ని వెస్టిండీస్‌

వైభ‌వ్ సెంచ‌రీ మిస్…టీమిండియా చేతిలో జింబాబ్వే వైట్ వాష్

Video: వైభవ్ సూర్యవంశీ భారీ సిక్సర్..స్టేడియం బయట పడ్డ బంతి

జింబాబ్వేను బెదిరించి సిరీస్ గెలుచుకున్నారు..త‌న్వీర్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక ధోని కుట్ర‌లు?

జింబాబ్వే బౌలర్లు స్లో బంతులు వేశారు…అందుకే టీమిండియా గెలుపు

Big Stories

Advertisement
×