PSL 2026: పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ (Pakistan Super League 2026 Tournament) విజేతగా పెషావర్ జల్మీ ( Peshawar Zalmi) ని నిలిచింది. నిన్న హైదరాబాద్ కింగ్స్ మెన్ వర్సెస్ పెషావర్ జల్మీ జట్ల ( Peshawar Zalmi vs Hyderabad Kingsmen) మధ్య మ్యాచ్ లాహోర్ లోని గడాఫీ వేదికగా జరిగింది. అయితే ఇందులో ఐదు వికెట్ల తేడాతో విక్టరీ అందుకుంది పెషావర్ జల్మీ. అయితే ఈ విజయంతో రెండోసారి పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంటును కైవసం చేసుకుంది బాబర్ ఆజం సేన. ఈ క్రమంలో మొహ్సిన్ నఖ్వీ టైటిల్ అందించాడు. అయితే ఆ టైటిల్ తీసుకునే క్రమంలో రోహిత్ శర్మను కాపీ కొట్టాడు బాబర్ ఆజం. టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ సందర్భంగా డిఫరెంట్ గా వాకింగ్ చేసి టైటిల్ అందుకున్నాడు రోహిత్ శర్మ. ఇక నిన్న పాకిస్తాన్ గడ్డపై బాబర్ ఆజం కూడా అలాగే రోహిత్ శర్మను కాపీ కొడుతూ టైటిల్ అందుకునే ప్రయత్నం చేశాడు. దీంతో బాబర్ ఆజం పైన దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు జనాలు. ఎప్పుడు కూడా ఇండియా పైన ఏడ్చే పాకిస్తాన్ వెధవలు.. ఇప్పుడు టైటిల్ తీసుకునే విషయంలో కూడా కాపీ కొడుతున్నారని సెటైర్లు పేల్చుతున్నారు.
Also Read: Islamabad United vs Hyderabad Kingsmen, Eliminator 2 PSLలో మరో అరాచకం.. డబ్బులు లేక ఆంటీలతో క్లీన్ చేయిస్తున్నారు, దొంగల్లా దూరేస్తున్నారు
పాకిస్తాన్ సూపర్ కి 2026 టోర్నమెంట్ లో భాగంగా నిన్న ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ ఫైనల్ మ్యాచ్ లో హైదరాబాద్ కింగ్స్ మెన్ వర్సెస్ పెషావర్ జల్మీ ( Peshawar Zalmi vs Hyderabad Kingsmen) మధ్య కీలక ఫైట్ జరిగింది. ఇందులో మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ కింగ్స్ మెన్.. 18 ఓవర్లలోనే 129 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది. దీంతో చిన్నపాటి లక్ష్యాన్ని కాస్త జాగ్రత్త పడుతూ చేదించింది బాబర్ ఆజం సేన. 15.2 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి టార్గెట్ రీచ్ అయింది. దీంతో రెండోసారి ఛాంపియన్ గా నిలిచింది పెషావర్ జల్మీ.
అయితే ఈ మ్యాచ్ లో ట్రోఫీ గెలిచిన బాబర్ ఆజం చేసిన పని హాట్ టాపిక్ అయింది. రోహిత్ శర్మను కాపీ కొడుతూ పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ ట్రోఫీని అందుకున్నాడు బాబర్ ఆజం. ఈ టోర్నమెంట్ గెలిచిన తర్వాత మొమహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని అందుకున్నాడు బాబర్ ఆజం. ఈ క్రమంలో మెల్లిగా నడుచుకుంటూ వస్తూ టైటిల్ అందుకున్నాడు. అటు ఇఫ్తికర్ అహ్మద్ కూడా అలాగనే ట్రై చేశాడు. ఈ క్రమంలో రోహిత్ శర్మను కాపీ కొట్టారని పాకిస్తాన్ పరువు తీస్తున్నారు ఇండియన్ ఫ్యాన్స్. వీళ్ళ బతుకులకు కాపీ తప్ప ఒరిజినల్ ఏది ఉండబోదని చురకలు అంటిస్తున్నారు.
Babar Azam and Iftikhar Ahmed tried to copy Rohit Sharma’s iconic celebration but failed disastrously 😭🤣
Just look at Iftikhar Ahmed bro tried his best but failed badly 😂 pic.twitter.com/uPZvlnEANJ
— Rohan💫 (@rohann__45) May 4, 2026