Team India Player Phone Call To Rahul Dravid: టీమిండియా ఒకప్పటి హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కు (Rahul Dravid) ఓ క్రికెటర్ అర్ధరాత్రి రెండు గంటలకు ఫోన్ చేసి బెదిరించిన సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. అర్ధాంతరంగా జట్టులో నుంచి తొలగించాడని, బీసీసీఐ కాంట్రాక్ట్ లేకుండా చేశాడనే ఆరోపణల నేపథ్యంలో రాహుల్ ద్రవిడ్ ను అర్ధరాత్రి ఫోన్ చేసి బండ బూతులు తిట్టినట్టు తెలుస్తోంది.
ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ ఇద్దరిలో ఒకరు ఈ పని చేసినట్టు ప్రచారం సాగుతోంది. ఈ న్యూస్ బయటకు వచ్చిన నేపథ్యంలో ఈ ఇద్దరిపై క్రికెట్ అభిమానులు చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీమిండియాను నెంబర్ వన్ జట్టుగా నిలిపి, ఎన్నో ట్రోఫీలు అందించిన ది గ్రేట్ వాల్ రాహుల్ ద్రవిడ్ ను ఎలా తిట్టాలని అనిపించిందని ఫైర్ అవుతున్నారు. రాహుల్ ద్రవిడ్ ను తిట్టిన సంఘటనపై బీసీసీఐ విచారణ చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
రాహుల్ ద్రవిడ్.. ఒకప్పుడు సాధారణ ప్లేయర్ గా కొనసాగి ఆ తర్వాత టీమిండియా కెప్టెన్ గా ఎదిగాడు. రిటైర్మెంట్ తర్వాత కూడా టీమిండియా హెడ్ కోచ్ గా పని చేశాడు. 2021 నుంచి 2024 వరకు టీమిండియాకు సేవలు అందించి ఎన్నో విజయాలను అందించాడు. ముఖ్యంగా టి20 ప్రపంచ కప్ 2024 టోర్నమెంట్ లో టీమిండియాను విజేతగా నిలపడంలో రాహుల్ ద్రవిడ్ పాత్ర చాలా కీలకము. అయితే అలాంటి రాహుల్ ద్రవిడ్ ను ఓ క్రికెటర్ అర్ధరాత్రి ఫోన్ చేసి బండ బూతులు తిట్టినట్టు తెలుస్తోంది. పీకలదాకా తాగిన తర్వాత రెండు గంటల సమయంలో ఫోన్ చేసి… తనను టీమ్ ఇండియాలో లేకుండా చేశామని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం అందుతోంది.
ఇషాన్ కిషన్ లేదా శ్రేయస్ అయ్యర్ ఇద్దరిలో ఎవరో ఒకరు అప్పటి కోచ్ రాహుల్ ద్రవిడ్ కు ఫోన్ చేసిందని ప్రచారం జోరుగా సాగుతోంది. 2023 చివరలో టీమిండియాకు దూరమైన ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ మళ్లీ రీ-ఎంట్రీ కోసం ప్రయత్నాలు చేశారు. ఆ సమయంలో దేశవాళి క్రికెట్ లో ఆడితేనే జట్టులోకి తీసుకుంటామని రాహుల్ ద్రవిడ్ కండిషన్ పెట్టాడు. కోచ్ ద్రవిడ్ ఆదేశాలను బీసీసీఐ కూడా సమర్ధించింది. అయితే ఈ రూల్స్ పాటించకుండా ఐపీఎల్ ఆడారు ఈ ఇద్దరు క్రికెటర్లు. దీంతో బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టును ఒక సంవత్సరం పాటు కోల్పోయారు. ఆ సమయంలోనే రాహుల్ ద్రవిడ్ కు అర్ధరాత్రి ఓ క్రికెటర్ ఫోన్ చేయడంతో.. శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ లపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.