Bakrid-Umar Akmal : ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ( India Vs Pakistan) మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఉన్నాయి. పొద్దున లేస్తే చాలు ఇండియాను ఏదో ఒక రకంగా బ్లేమ్ చేసేందుకు పాకిస్తాన్ ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది. పాకిస్తాన్ ప్రధాని నుంచి ఢిల్లీలో ఉన్న లీడర్ వరకు ప్రతి ఒక్కరు ఇలాగే వ్యవహరిస్తున్నారు. ఇక రేపు ( May 27) ప్రపంచ వ్యాప్తంగా బక్రీద్ పండుగ ( Bakrid) నిర్వహించుకుంటున్నారు ముస్లింలు. ఈ నేపథ్యంలోనే హిందువులను రెచ్చగొడుతూ పాకిస్తాన్ మాజీ క్రికెటర్ ఉమర్ అక్మల్ ( Umar Akmal) వివాదాస్పద పోస్ట్ పెట్టాడు. భారతదేశంలోని హిందువులు ఎంతో ప్రేమగా పూజించే ఆవును ( Cow), బక్రీద్ సందర్భంగా బలి ఇవ్వబోతున్నట్లు పోస్ట్ పెట్టాడు. ఈ మేరకు రెండు మేకలతో ( Goats) పాటు ఆవు ఫోటోలను పంచుకున్నాడు ఉమర్ అక్మల్. వాటిని మరికాసేపట్లోనే అల్లాకు ( Allah) బలి ఇవ్వనున్నట్లు రెచ్చగొట్టే పోస్ట్ పెట్టాడు. దీంతో ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. దీనిపై హిందువులు సీరియస్ అవుతున్నారు.
హిందువులను రెచ్చగొడుతూ పాకిస్తాన్ మాజీ క్రికెటర్ ఉమర్ అక్మల్ చేసిన పోస్ట్పై సోషల్ మీడియా వేదికగా తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. బక్రీద్ సందర్భంగా ఇండియాలో గోవధ చేయకూడదని రూల్స్ ఉన్నాయి. కానీ పాకిస్తాన్ దేశంలో అలాంటి రూల్స్ లేవు. అందుకే ఉమర్ అక్మల్ అలా వ్యవహరించాడు. కానీ ఇతర దేశాల మత సాంప్రదాయాలను కూడా సెలబ్రిటీ హోదాలో ఉన్న ఉమర్ అక్మల్ గౌరవించాల్సి ఉంటుంది. స్టార్ క్రికెటర్ గా ఎదిగిన ఉమర్ అక్మల్, ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోకుండా… ఓ గల్లి క్రికెటర్ లాగా వ్యవహరించాడు. ఇండియాను రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించి.. ఆవును బలి ఇవ్వబోతున్నట్లు పోస్ట్ పెట్టాడు. దీనిపై పాకిస్తాన్ ముస్లింలు కూడా సీరియస్ అవుతున్నారు. బక్రీద్ రోజున ఇతర మతస్తులను కించపరిచేలా వ్యవహరించకూడదని అల్లా చెప్పాడని పాకిస్తాన్ ముస్లిం పెద్దలు కూడా కౌంటర్లు ఇస్తున్నారు. పబ్లిసిటీ కోసం, హిందువుల మనోభావాలను దెబ్బ తినకుండా చూడాల్సిన బాధ్యత ఉందని ఉమర్ అక్మల్ పై ఫైర్ అవుతున్నారు.
పాకిస్తాన్ మాజీ క్రికెటర్ ఉమర్ అక్మల్ తన కెరీర్ లో గతంలో కూడా అనేక వివాదాల్లో చిక్కుకున్నాడు. 2020 పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ సందర్భంగా… ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో అతనిపై 18 నెలల పాటు నిషేధం కూడా విధించింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. ఇక ఆ తర్వాత అతని కెరీర్ డౌన్ ఫాల్ అయి… రిటైర్మెంట్ కూడా తీసుకున్నాడు. కాగా ఉమర్ సోదరుడు కమ్రాన్ అక్మల్ అన్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరూ వికెట్ కీపర్లుగానే పాకిస్తాన్ జట్టులో రాణించారు.
He is Umar Akmal, a former Pakistani cricketer who served an 18-month ban linked to a spot-fixing controversy.
He recently shared a picture featuring goats and a cow ahead of Bakrid.
While goats are commonly associated with the occasion, the inclusion of a cow has triggered… pic.twitter.com/M4bp9RI6Fa
— Brutal Truth (@sarkarstix) May 25, 2026